జ‌గ‌న్‌పై మొద‌లైన ఎన్నిక‌ల యుద్ధం.. వ్యూహంలో భాగ‌మేనా?

August 12, 2018 at 1:08 pm
YS jagan, ED allegations on YS Bharathi, Chandra babu, paid media, Bharathi cements

వైసీపీ అధినేత‌, విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చుట్టూ వ్యూహాత్మ‌క దాడి మొద‌లైంది. మ‌రో ప‌దిమాసాల్లోనే జ‌రుగుతాయ‌ని బావి స్తున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్‌ను ఒంట‌రిని చేయ‌డ‌మే ల‌క్ష్యంగా, జ‌గ‌న్‌పై దాడులు చేసేందుకు మ‌రింత అవ‌కా శం చేజిక్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీలు చేస్తున్న కుట్ర‌కు జ‌గ‌న్ అండ్ ఫ్యామిలీ బ‌లి అవుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా వెలుగు చూసిన భార‌తి క‌థ‌నం వెనుక భారీ కుట్ర ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేసును మొత్తంగా ప‌రిశీలిస్తే.. ఈడీ ఈ కేసులో భార‌తి పేరును న‌మోదు చేసింది. స్థూలంగా.. ఈ కేసుతో భారతికి ఎలాంటి సంబంధ‌మూ లేదు. అయితే, ఈడీ పేర్కొన్న‌ట్టుగా.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ త‌ప్పుకొన్న నేప‌థ్యంలో ఆయా కంపెనీల వ్య‌వ‌హారాల‌న్నీ.. భార‌తి చూస్తున్నారు. కానీ, ఆమె భారీ ఎత్తున జీతం తీసుకుంటున్నార‌ని, ఇదేదో చేయ‌కూడ‌ని నేర‌మ‌ని అన్న‌ట్టుగా చంద్ర‌బాబు అనుకూల మీడియా క‌థ‌నాలు రాస్తోంది.

dc-Cover-kpiut48e1n2eco9lum1bf149q5-20180810000155.Medi

ఎంత జీతం తీసుకున్నా.. ప్ర‌భుత్వానికి స‌మయానికి ప‌న్నులు చెల్లిస్తున్నారు. అయినా.. జీతం నిర్ణ‌యం అనేది ఆమె ఒక్క‌త్తే తీసుకున్న నిర్ణ‌యం కూడా కాదు.. ఆ సంస్థ బోర్డు స‌భ్యులు కూర్చుని నిర్ణ‌యించిన వ్య‌వ‌హారం. సాధార‌ణంగా ఏదైనా కేసు న‌మోదైన‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తి గురించిన అన్ని వివ‌రాల‌ను పేర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం. ఈడీ కూడా ఈ కేసులో.. భార‌తి వేత‌నాన్ని పేర్కొన్నారు. దీనిని వారేమీ.. ప్ర‌పంచంలో ఈమె ఒక్క‌తే ఇంత జీతం తీసుకుంటున్న‌ట్టుగా వ‌ర్ణించ‌లేదు. గుండెలు బాదుకోలేదు. కానీ, చంద్ర‌బాబు అనుకూల మీడియాలో మాత్రం.. ఇదేదో ఘోరం.. నేరం చేసిన‌ట్టుగా రాసిపారేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో చంద్ర‌బాబు తీసుకుంటున్న జీత‌మే ఎక్కువ‌గా ఉంద‌నేని విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.

YS-Jagan-YS-Bharathi-ED-Case

ఎమ్మెల్యేగా, సీఎంగా ఆయ‌న అంద‌రిక‌న్నా ఎక్కువ వేత‌న్నాన్నే పొందుతున్నారు. మ‌రి దీనిని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తున్నారా? భార‌తి విష‌యంలో ఈడీ లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో బాబు అనుకూల మీడియా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వైసీపీ నాయ‌కుల వ్యాఖ్య‌లు ఇప్పుడు నిజ‌మ‌వుతున్నాయి. మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చెప్పిన‌ట్టు.. ఈడీ ఈ కేసులో చార్జిషీట్ దాఖ‌లు చేసి నెల‌లు గ‌డుస్తున్నా.. కోర్టు నుంచి వెలుగు చూడ‌ని ఈ క‌థ‌నం.. బాబు అనుకూల మీడియా లోనే ఎందుకు వ‌చ్చిందో అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది.

Chandra-Babu-Plays-Judas-with-BC-Community

ఈ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేయ‌డంలో భాగంగానే ఇదంతా ఓ ప‌థ‌కం ప్ర‌కారం జ‌రిగిపోయింద‌ని అంటున్నారు. మ‌రి దీని నుంచి జ‌గ‌న్ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఉరుములు లేని పిడుగుల‌ను త‌ట్టుకుని ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు జ‌గ‌న్ మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి ఉంద‌న‌డంలో సందేహం లేదు.

జ‌గ‌న్‌పై మొద‌లైన ఎన్నిక‌ల యుద్ధం.. వ్యూహంలో భాగ‌మేనా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share