జగన్ ను అన్నమాటలు గుర్తుచేసుకోండి!

September 16, 2018 at 10:38 am

ఇవాళ చంద్రబాబునాయుడుకు అరెస్టు వారంట్లు జారీచేసినది.. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే అన్నట్లుగా.. తెలుగుదేశం నాయకులు తెగ రెచ్చిపోతున్నారు. అసలు అరెస్టు వారంటు జారీచేయడం అనే ప్రక్రియ మోడీ చేతిలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబును నేరుగా ఎదుర్కొనే దమ్ముల్లేక ఇలాంటి వక్రమార్గాలను అనుసరిస్తున్నారని కూడా అవాకులు చెవాకులు పేలుతున్నారు.

ఇలాంటి ప్రేలాపనలు అన్నీ గమనించినప్పుడు.. తెలుగుదేశం నాయకుల జ్ఞానం మరీ ఇంత ఘోరమా అనే అభిప్రాయం కలుగుతోంది. వారంట్ల గురించి న్యాయవ్యవస్థ గురించి.. ఆ ప్రక్రియ గురించి వారికి ఇంత చీప్ అభిప్రాయాలు ఉన్నాయా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇలాంటి సందర్భంలోనే గతంలో.. జగన్మోహన్ రెడ్డి విషయంలో.. చంద్రబాబు అండ్ కో ఎలాంటి విమర్శలు చేశారో కూడా గుర్తుకొస్తోంది.

Jagan-go-to-jail-again

జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల విషయంలో ఏ ఒక్కటీ అధికారికంగా నిరూపణ కాకపోయినప్పటికీ.. ఆయన జైలు జీవితం కూడా అనుభవించి బయటకు వచ్చారు. కేసులు ఆయనను విపరీతమైన ఒత్తిడికి గురిచేశాయి. అయినా సరే న్యాయవ్యవస్థను గౌరవిస్తూ.. ప్రతి వాయిదాకు హాజరవుతూ.. తన తరఫు వివరణ తెలియజేస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో అనివార్యంగా ఇతర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు.. పాదయాత్ర సందర్భంగా మాత్రమే కోర్టు వాయిదాలకు హాజరు కావడం నుంచి ఆయన మినహాయింపు అడిగారు.

అయితే అప్పట్లో ఈ విషయాన్ని కూడా రాజకీయంగా ఆయన మీద బురద చల్లడానికి తెలుగుదేశం బాగా వాడుకుంది. న్యాయవ్యవస్థ మీద జగన్ కు గౌరవం లేదా? కోర్టుకు హాజరు కావాలంటే ఇబ్బందా? అంటూ వారు ఆడిపోసుకున్నారు.

కానీ ఇప్పుడు చంద్రబాబు అండ్ కో చేస్తున్న పనేమిటి? వారి మీద కేసులు నమోదు అయిన తర్వాత.. కేవలం కోర్టుకు హాజరుకాకపోవడం వల్ల మాత్రమే పరిస్థితి ఇవాళ నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు వరకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ సిగ్గులేకుండా న్యాయవ్యవస్థ ఇచ్చిన నోటీసుల గురించి.. భాజపాను నిందిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగన్ చాలా పద్ధతిగా కోర్టు అనుమతి అడిగినా నిందించిన నాయకులు, అసలు కోర్టును ఖాతరు చేయకుండా.. విచ్చలవిడిగా మారినందుకే ఈ ఫలితం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జగన్ ను అన్నమాటలు గుర్తుచేసుకోండి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share