సేఫ్ జోన్‌లో జ‌గ‌న్.. ఇక బాబుకు కేసుల‌ గుబులు స్టార్ట్‌

March 18, 2018 at 10:14 pm
ys jagan, free from cases, chandra babu, vote for note case

అత్త కొట్టినందుకు కాదు.. తోడికోడ‌లు న‌వ్వినందుకు అన్న చందంగా మారిపోయింది ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి. ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌పై ఉన్న కేసులు ఒక్కొక్క‌టిగా తేలిపోతుండ‌టం సంగ‌తి అటుంచితే ఇప్పుడు త‌న‌పై ఉన్న కేసులు ఎక్క‌డ బ‌య‌టికొస్తాయోన‌నే ఆందోళ‌న ఆయ‌నలో విప‌రీతంగా క‌నిపిస్తోంది. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని ఎన్డీఏ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి… అటు వైసీపీ, ఇటు బీజేపీపై తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు చంద్ర‌బాబు!! వైసీపీతో దోస్తీ కోస‌మే టీడీపీని అవ‌మానిస్తోంద‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న‌పై ఉన్న కేసుల‌ను మాఫీ చేసుకునేందుకే బీజేపీ ముందు మోక‌రిల్లార‌ని, అందుకు ప్ర‌తిఫ‌లంగా ఆయ‌న‌పై ఉన్న కేసులు కొట్టేస్తున్నార‌నే ప్ర‌చారం ముమ్మ‌రం చేస్తున్నారు చంద్ర‌బాబు అండ్ కో!! ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ కేసులు వీగిపోతుండ‌టం చంద్ర‌బాబులో కొత్త భ‌యాన్ని క‌లిగిస్తోందంటున్నారు విశ్లేష‌కులు!!

 

ఏపీలో కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే.. బీజేపీకి కూడా ప‌ట్టించేందుకు సీఎం చంద్ర‌బాబు అవిశ్రాంతంగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. త‌మ‌తో తెగ‌దెంపులు చేసుకుంద‌న్న కోప‌మో.. లేక కార‌ణ‌మేదైనా కావొచ్చు.. ఆ పార్టీని భూస్థాపితం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు రచిస్తూ.. పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి బీజేపీతో అక్రమ సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మీద ఉన్న కేసులను కేంద్రం కొట్టి వేయించే అవకాశ ముందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాకపోతే చంద్రబాబులోని భయం జగన్ కేసులను కొట్టివే స్తారేమో అని కాదని వాస్తవంలో తనమీద ఉన్న కేసులను తిరగదోడే భయమే ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తు న్నా రు. 

 

వైఎస్ జగన్ మీద ఉన్న కేసులకు సంబంధించి తొలి నుంచీ ఉన్న నిరాధారమైన ఆరోపణలు ఒక్కొక్కటిగా తేలిపో తున్నాయి. చాలాకాలంగా మబ్బులు విడినట్లుగా ఒక్కొక్క కేసులో సాక్ష్యాలు లేక నీరుకారడం జరుగుతోంది. తాజాగా సాక్షి ఆస్తులను అక్రమంగా ఎటాచ్ చేయడంపై ఈడీని కోర్టు తప్పుపట్టింది. దీంతో బీజేపీ-వైసీపీ దోస్తీపై బాబులో క‌ల‌వ‌రం మొద‌లైంది. జగన్ మీద ఉన్న కేసులు తేలిపోతున్నాయి అనే భయం చంద్రబాబులో మొదలైనట్లుంది. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌నే బూచిగా చూపుతూ వ‌స్తున్నారు చంద్ర‌బాబు, ఇత‌ర నేత‌లు. ఇప్పుడు ఇవి నీరుగారిపోతే ఇన్నాళ్లుగా తమ పార్టీ చేస్తున్న ప్రచారం వీగిపోతుందని, ప్రజలు ఛీకొడతారనే ఆందోళన వారిలో పెరుగుతోంది. 

 

అందుకే జగన్‌కి బీజేపీకి కేసుల‌తో లింకు క‌లిపేస్తున్నారు. వాస్తవంలో బీజేపీ ప్రభుత్వం తన మీద ఉన్న కేసుల విషయంలో ఇక రక్షణ కొనసాగించక పోవచ్చునని చంద్రబాబులో భయం మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఓటుకు నోటు సహా ఇది వరలో ఉన్న అనేక కేసులను తిరగతోడితే తనకు చాలా ప్రమాదం అని ఆయన ఆలోచిస్తున్నారు. దానికితోడు ఈ ప్రభుత్వంలో పోలవరం తదితర విషయాలలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశిస్తే గనుక చిక్కులు తప్పవని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.  ఈ నేప‌థ్యంలో ఆయనకు బీజేపీతో లింకు అంటగడితే.. రెండు పార్టీలను కుట్ర పార్టీలుగా అభివర్ణించి దెబ్బ కొట్టవచ్చునని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

 

సేఫ్ జోన్‌లో జ‌గ‌న్.. ఇక బాబుకు కేసుల‌ గుబులు స్టార్ట్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share