వైసీపీలోకి మాజీ స్పీక‌ర్‌…. జ‌గ‌న్ హామీ ఇదే..!

October 20, 2017 at 6:18 am
Naadendla Manohar, YSRCP, YS Jagan, MP

స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి స్పీక‌ర్‌గా ప‌నిచేసిన నాదెండ్ల మ‌నోహ‌ర్ పొలిటిక‌ల్‌గా రీయాక్టివ్ అవుతున్నారు. రాష్ట్రం విడిపోయే ముందు స‌మైక్యాంధ్ర‌కు చివ‌రి అసెంబ్లీ స్పీక‌ర్‌గా ప‌నిచేసిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో తెనాలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి అదే కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి 15 వేల‌కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో తెనాలి నుంచి వ‌రుస‌గా కాంగ్రెస్ త‌ర‌పున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల్లో కూడా అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఏపీలో కాంగ్రెస్ స‌మాధి అయినా కూడా మ‌నోహ‌ర్‌కు త‌న ఛ‌రిష్మాతో 15 వేల ఓట్లు వచ్చాయి.

ఇక ఏపీలో కీల‌క‌మైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తోన్న వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ఈ నేప‌థ్యంలోనే మ‌నోహ‌ర్ మీద కూడా వ‌ల‌వేశారు. మ‌నోహ‌ర్ కూడా దివంగ‌త మాజీ సీఎం, జ‌గ‌న్ తండ్రి వైఎస్‌తో త‌న‌కు ఎంతో అనుబంధం ఉంద‌ని, ఆయ‌న వ‌ల్లే తాను స్పీక‌ర్ అయ్యాన‌ని జ‌గ‌న్ తండ్రి ప‌ట్ల కృత‌జ్ఞ‌తాభావాన్ని కూడా వ్య‌క్తం చేశార‌ట‌. ఈ క్ర‌మంలోనే వైసీపీలోకి వ‌చ్చేందుకు మ‌నోహ‌ర్ ఓకే చెప్పేశార‌ని తెలుస్తోంది.

ఇక తెనాలిలో వైసీపీకి స‌రైన అభ్య‌ర్థి లేరు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన అన్నాబ‌త్తుని శ్ర‌వ‌ణ్‌కుమార్ ఇక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆల‌పాటి రాజాకు స‌రైన పోటీదారుడు అయితే కాదు. దీంతో మ‌నోహ‌ర్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దింపాల‌ని జ‌గ‌న్ డెసిష‌న్ తీసుకున్నారు. పార్టీ అధికారంలోకి వ‌స్తే మీ సీనియార్టీ దృష్ట్యా స‌ముచిత గౌర‌వం ఇస్తాన‌ని కూడా జ‌గ‌న్ మ‌నోహ‌ర్‌కు హామీ ఇచ్చార‌ట‌. ఇక మ‌నోహ‌ర్ పార్టీ మార‌డ‌మే త‌రువాయి.

 

వైసీపీలోకి మాజీ స్పీక‌ర్‌…. జ‌గ‌న్ హామీ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share