విశ్వ‌స‌నీయ‌త‌కు కేరాఫ్.. ఇక జ‌గ‌నే!

November 4, 2018 at 4:59 pm

విశ్వ‌స‌నీయ‌త‌కు మారుపేరుగా రాజ‌కీయాలు చేస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సాటిరాగ‌ల నాయ‌కులు రాష్ట్రంలో లేర‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌న‌కు అవ‌కాశం ఉన్నా.. అవ‌కాశం లేక‌పోయినా.. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల కొన్ని రాజ‌కీయ ప‌రిణామాల‌ను చూస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు. అవ‌కాశ వాద రాజ‌కీయం ఏపీలో ఎక్కు వగా న‌డుస్తోంది. ఎవ‌రితో అవ‌కాశం ఉంటే.. వారితో చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు అధికార పార్టీ మొగ్గుతుండ‌డం స‌ర్వ త్రా విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇస్తోంది. ఈ ప‌రిణామం రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నాయ‌న్న కామెంట్ల‌కు సైతం అవ‌కాశం ఇస్తోంది. ఈ క్ర‌మంలోనే ఒక అధికార ప‌క్షం- ఒక ప్ర‌తిప‌క్షం మ‌ధ్య ఉన్న వైరుధ్యాల‌పై మేదావులు దృష్టి పెట్టా రు.

ఈ క్ర‌మంలో అనేక కోణాల‌ను వారు చ‌ర్చిస్తున్నారు. రాష్ట్రంలో సీనియ‌ర్ పొలిటీషియన్లు సైతం అధికార దాహంతో అడ్డ దారులు తొక్కుతూ.. సిద్ధాంతాల‌ను, పార్టీ క‌ట్టుబాట్ల‌ను సైతం గాలికి వ‌దిలేస్తున్నారు. ఆగ‌ర్భ శ‌త్రు పార్టీల పంచ‌న ఆత్మ‌గౌ ర‌వాన్ని తాక‌ట్టు పెట్టుకుంటున్నారు. మ‌రి అలాంటి పార్టీలున్న ఏపీలో… త‌న‌కు ఏక‌ష్ట‌మొచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎ దురైనా.. ఎన్ని విధాలుగా ఆటంకాలు వ‌చ్చినా.. వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ ఏనాడూ.. మ‌డ‌మ వెనక్కి తిప్పింది లేదు. స‌మ స్యల‌పై పోరాడారే త‌ప్ప‌.. స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. తాను న‌మ్మిన సిద్ధాంతాన్ని తానే తుంగ‌లో తొ క్కాల‌ని నిర్ణ‌యించుకోలేదు. తెలుగు ప్ర‌జ‌ల కోసం ఆయ‌న అహ‌ర‌హం ముందుకు సాగుతూనే ఉన్నారు.

Jagmohan_20170522_350_630

వాస్త‌వానికి జ‌గ‌న్‌పై కాంగ్రెస్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగి.. ఆయ‌న‌పై లేనిపోని కేసులు న‌మోదు(ఇప్ప‌టికీ నిరూపితం కాలే దు) చేసి జైలుకు త‌ర‌లించింది. దీనికి ప్ర‌ధానంగా.. ఏపీలో కాంగ్రెస్‌ను ఎదిరించి, సోనియాకు వ్య‌తిరేకంగా జ‌గ‌న్ సొంతం గా పార్టీ పెట్ట‌డ‌మే. ఈ ప‌రిణామాల‌నే సీరియ‌స్‌గా తీసుకున్న కాంగ్రెస్‌.. జ‌గ‌న్‌ను తీవ్ర‌స్థాయిలో ఇరికించేసింది. అయినా జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. పైగా మాతో చేతులు క‌లుపు.. నీ పార్టీని విలీనం చేయి.. నీపై ఉన్న కేసులు మాఫీ చేస్తాం.. అని ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌ప్పుడు కూడ జ‌గ‌న్ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఇక‌, గ‌త 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తాన‌ని విశ్వ‌సించిన జ‌గ‌న్‌కు ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా ఆయ‌న అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

దీనికి ఆయ‌న ఎవ‌రి స‌హ‌కారాన్న‌యినా తీసుకుని ఉంటే.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఎలా ఉండేదో? కానీ, ఆయ‌న తాను న‌మ్ము కున్న విశ్వ‌స‌నీయ‌త‌కు పెద్ద‌పీట వేశారు. చేతులు క‌ట్టుకుని ఎవ‌రి వ‌ద్దో కూర్చోకూడ‌ద‌ని అనుకున్నారు. ఒక నోటితో తిడుతూ.. అదే నోటితో పొగిడేందుకు జ‌గ‌న్‌కు మ‌న‌సు రాలేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌లు పార్టీలు త‌న‌కు ఆఫ‌ర్లు ఇచ్చినా.. ఏ ఒక్క పార్టీతోనూ అంట‌కాగ‌లేదు. కానీ, రాష్ట్రంలో ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే ఓ సీనియ‌ర్ నాయ‌కుడు అవ‌కాశ‌వాద రాజ‌కీయంతో చెల‌రేగిపోతున్నారు. అంతేకాదు, పార్టీ సిద్ధాంతాల‌ను కూడా అమ్ముకుంటు న్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలోనే ఎవ‌రు విశ్వ‌స‌నీయ నేత అన్న‌ప్పుడు జ‌గ‌న్ క‌న్నా ఎవ‌ర‌ని చెప్ప‌గ‌ల‌రు ఎవ‌రైనా?!

విశ్వ‌స‌నీయ‌త‌కు కేరాఫ్.. ఇక జ‌గ‌నే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share