టీడీపీ కంచుకోట‌లోనూ… జ‌గ‌న్ కే జై..!

October 1, 2018 at 10:44 am

టీడీపీకి కంచుకోట లాంటి విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనూ విప‌క్ష నేత‌కు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున జై కొడుతున్నారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర ఎస్‌.కోట నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసుకొని గజపతినగరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జననేతకు ఆ పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, అప్పలనర్సయ్య, నియోజకవర్గ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దీంతో కొత్త వలస-విజయనగరం రోడ్డు జనసంద్రంతో నిండిపోయింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గొడికొమ్ము గ్రామ మహిళలు కలిసి జననేతను కలిశారు.

42778397_1979340245419766_2041881354357964800_o

అయితే, ఇదే జిల్లా నుంచి టీడీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఆశ‌లు పెంచుకున్నారు. దీంతో ఇప్ప‌టికే ప‌లు కార్య‌క్ర‌మాల‌ను సైతం ఇక్క‌డ నుంచే ప్రారంభించారు. అయితే, తాజాగా జ‌గ‌న్ యాత్ర‌కు పెద్ద ఎత్తున జ‌నాలు రావ‌డం అధికార పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు టీడీపీకి కంచుకోట వంటి ప‌లు జిల్లాల్లో నూ మ‌ద్ద‌తు ల‌భించింది. చిత్తూరు ఇది చంద్ర‌బాబు నాయుడి సొంత జిల్లా అయినా కూడా ఇక్క‌డ జ‌గ‌న్‌కు అపూర్వ స్వాగ‌తం ల‌భించ‌డంతోపాటు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌చ్చి జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇక‌, క‌ర్నూలు, గుంటూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ జ‌గ‌న్‌కు అపూర్వ‌మైన మ‌ద్ద‌తు ల‌భించింది.

ఇక‌, విజ‌య‌న‌గ‌రంలో అంత‌గా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఎవ‌రూ ప‌ల‌క‌ర‌ని టీడీపీ భావించింది. ఇదే విష‌యాన్ని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూడా వ్య‌క్తీక‌రించారు. ఆయ‌న కూడా పెద్ద ఎత్తున జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, వాస్త‌వానికి తాజాగా జ‌గ‌న్ విజ‌య‌న‌గ‌రంలో నిర్వ‌హించిన మోడో రోజు స‌భ‌కు పెద్ద ఎత్తున జ‌నాభా త‌ర‌లి వ‌చ్చారు. ప‌నులు సైతం ప‌క్క‌న పెట్టుకుని జ‌గ‌న్ ను చూసేందుకు జ‌నాలుత‌ర‌లిరావ‌డం వైసీపీ నేత‌ల్లోనూ, కార్య‌క‌ర్త‌ల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎక్క‌డ జ‌గ‌న్‌ను ప‌లుచ‌న చేద్దామా? అని వెయ్యి కెమెరా క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్న టీడీపీ అనుకూల మీడియా కు సైతం ఈ జ‌న ప్ర‌భంజ‌నం ఉక్కిరి బిక్కిరి చేస్తుండడం గ‌మ‌నార్హం. సో.. ఇది ముందు జ‌ర‌గ‌బోయే పెద్ద మార్పున‌కు నాందిగా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు

టీడీపీ కంచుకోట‌లోనూ… జ‌గ‌న్ కే జై..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share