అడుగు ముందుకేసి ‘నారాచై’ను అణిచివేస్తా..

October 18, 2018 at 12:01 pm
YS Jagan, Praja samkalpa yatra, Bobbili sabha, speech, educational institutes

బడుగు బలహీన వర్గాల పిల్లలకు సాంకేతిక విద్య ను అందుబాటులో కి తెచ్చిన మహా నేత వైఎస్సార్. నిరుపేదల పిల్లలు సహితం ఉన్నత విద్యను అందించేందుకు పరితపించిన వైఎస్సార్ అడుగు జాడల్లోనే ఆయన తనయుడు, వైసీపీ అధినేత జగన్ ముందుకు కదులుతున్నారు. నాడు ఆ దివంగత నేత వైఎస్సార్ అందించిన చేయూతతో తెలుగు రాష్ట్రాల్లో వేలు, లక్షలాది మంది పిల్లలు ఫీజుల భారం లేకుండానే ఉన్నత సాంకేతిక విద్యను పొందారు. ఇప్పుడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు. నిరుపేద విద్యార్థులను గాలికొదిలి ప్రైవేటు కళాశాల ల యాజమాన్యాల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు.

44310957_2002018139818643_1932290015350489088_n

ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పేదల పిల్లలకు చదువుపై భరోసా ఇచ్చారు. ప్రైవేటు కళాశాల ల దోపిడీని అరికట్టేందుకు తాను అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటానని చెబుతున్నారు. పేదవాడి చదువు కోసం వైఎస్సార్ ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని భరోసా ఇస్తున్నారు. నారాయణ, చైతన్య కాలేజీల యాజమాన్యాలను దారిలోకి తెస్తానని జగన్ గట్టిగా చెబుతున్నారు.
‘ఇవాళ మన పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు లాంటి పెద్ద చదువులు చదివించే స్థితిలో ఉన్నామా..? ఇంజినీరింగ్ చదివించాలంటే ఫీజులు ఏటా లక్షల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీఇంబర్స్ మెంట్ కేవలం రూ.30-35 వేలు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక తల్లిదండ్రులు నాలుగేళ్లలో రూ.3 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఈ దుస్థితి నుంచి ప్రజలను బయట పడేసేందుకు తాను అధికారంలోకి రాగానే అన్ని చర్యలు తీసుకుంటానని జగన్ హామీ ఇచ్చారు.
‘మీ పిల్లలకు ఏ చదువు చెప్పిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షలు ఖర్చయినా మేం భవిస్తాం. అంతేకాదు, వాళ్లకయ్యే హాస్టల్ ఖర్చుల కోసం ఏడాదికి 20వేలు ఇస్తాం. పెద్ద చదువులు చదవాలంటే చిన్నప్పట్నుంచే పునాదులు పడాలి. అందుకే చిన్నారులను బడికిపంపే ప్రతి తల్లికి ఏటా 15వేలు ఇస్తాం. మేం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టించడంతో పాటు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీచేస్తాం. నారాయణ, చైతన్య లాంటి కాలేజీల నుంచి భారం పడకుండా తల్లిదండ్రులను, పిల్లలను ఆదుకుంటాం’ అని జగన్ ఇచ్చిన హామీతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అడుగు ముందుకేసి ‘నారాచై’ను అణిచివేస్తా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share