ప‌శ్చిమ‌లో జ‌గ‌న్ హ‌వా.. బాబు టీంలో ద‌డ‌.. !

May 14, 2018 at 12:26 pm
YS Jagan, Praja samkalpa yatra, west godavari, response, chandra babu

సీఎం చంద్ర‌బాబు టీం క‌ళ్ల‌న్నీ ఇప్పుడు జ‌గ‌న్ మీదే ఉన్నాయి. ఆయ‌న వేసే ప్ర‌తి అడుగును టీడీపీ మంత్రులు, నాయ‌కులు చాలా నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. అసలు ఏం జ‌ర‌గ‌బోతోంది? అంటూ ఆలా ఉత్కంఠ‌గా చూస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వైసీపీ అధినేత సాగిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర  ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించ‌డ‌మే. ఈ జిల్లా టీడీపీకి కంచుకోట‌. 2014లో ఇక్క‌డ వైసీపీ ఖాతా తెర‌వ‌లేక‌పోయింది. ఎంతో మంది సీనియ‌ర్లు సైతం ఓడిపోయారు. ఇక‌, టీడీపీకి అతిర‌థ‌మ‌హార‌ధులు అన‌ద‌గిన నాయకులు ఉన్నారు. అలాంటి జిల్లాలో వైసీపీ అధినేత అడుగు పెడుతున్నాడంటే.. టీడీపీ కంచుకోట‌ల‌కు బీటలు వ‌స్తాయేమోన‌ని అధికార పార్టీ నాయ‌కులు అధిరిపోతున్నారు. 

 

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌శ్చిమ గోదావ‌రి స‌హా తూర్పులోనూ టీడీపీకి ఎదురు లేకుండా ఉంద‌ని నాయకులు భావిస్తు న్నారు. అయితే, జ‌గ‌న్ ఆయా విష‌యాల‌ను గ్ర‌హించి.. ఇక్క‌డ పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌భుత్వ నేతలు చేస్తున్న అవినీతిని, ఇసుక మాఫియాను, చ‌ట్టాన్ని సైతం లెక్క చేయ‌కుండా కోడి పందేలు నిర్వ‌హిం చడం వంటి  నాయ‌కుల అవినీతి వంటి వాటిని ప్ర‌ధానంగా వెలుగులోకి తెచ్చి.. ఇరుకున పెట్టాల‌ని నిర్ణ‌యించుకు న్నారు. దీనికితోడు ప్ర‌జా సంకల్ప యాత్ర ఈ జిల్లాలోనే రికార్డు స్థాయిలో 2000 కిలో మీట‌ర్ల‌కు చేరుతుంది. ఈ సందర్భం గా  40 అడుగుల పైలాన్ ను జ‌గ‌న్ ఆవిష్కరించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నాయి. 

 

వీటిని ఇంత ఘ‌నంగా నిర్వ‌హిస్తుండ‌డంతో టీడీపీ అధినేత గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. కృష్ణా జిల్లానుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు జగన్ ఎంట్రీ కాగానే చాలా పెద్ద ఉత్స‌వం నిర్వ‌హించిన‌ట్టుగా వైసీపీ నాయ‌కులు ఆహ్వానం ప‌లికారు.  జనం వెల్లువలా వచ్చి జగన్ ను హారతులతో తిలకాలు దిద్ది స్వాగతించారు.  ఈ సందర్భంగా కొన్ని గంటల పాటు ట్రాఫిక్ కూడా స్తంభించింది. ఈ ప‌రిణామాల‌ను తెలుసుకున్న టీడీపీ నాయ‌కులు ప‌శ్చిమ‌లో త‌మ ఓటు బ్యాంకుకు కూసాలు క‌దులుతున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించిన‌ట్టు తెలుస్తోంది.  ఈ జిల్లాలో జగన్ యాత్రకు స్పందన భారీగా వస్తే టీడీపీకి ఇబ్బందే న‌న్న ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ని అనిపిస్తోంది.

 

పశ్చిమలో జగన్ యాత్ర సాగే తీరుతెన్నులపై చంద్రబాబుకు ఎప్పిక‌ప్పుడు  సమాచారం అందించడానికి నిఘా వర్గాలను ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జ‌ల‌పైనా చంద్ర‌బాబు క‌న్నేసి ఉంచార‌ని తెలుస్తోంది. యాత్రంలో జ‌గ‌న్‌ను ఎవ‌రెవ‌రు క‌లుస్తున్నారు ? ఏం మాట్లాడుతున్నారు ?  వారి ప్ర‌భావం ఎంత ? ఏ పార్టీ నాయ‌కులు? వ‌ంటి అన్ని కీల‌క అంశాల‌ను కూడా చంద్ర‌బాబు సేక‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

 

ఇక జ‌గ‌న్ ప‌శ్చిమ టూర్‌లో చేరిక‌లు కూడా గ‌ట్టిగానే ఉండ‌నున్నాయి. ఇప్ప‌టికే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగ‌నాథ రాజు పేరు ప్ర‌ముఖంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. ఆయ‌న్ను పార్టీలో చేర్చుకుని ఆచంట‌లో మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ మీద పోటీ చేయించాల‌ని జ‌గ‌న్ ప్లాన్‌. ఇక జిల్లాకే చెందిన మ‌రో మాజీ ఎమ్మెల్యే పేరు కూడా వైసీపీలో చేరే పేర్ల జాబితాలో వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్‌లో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన కాపు నేత‌లు చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య‌తో పాటు మాజీ డీసీసీబీ చైర్మ‌న్ క‌రాటం రాంబాబు పేర్లు కూడా వైసీపీ టార్గెట్ లిస్టులో ఉన్నాయ్‌. మొత్తానికి ఈ ప‌రిణామం ప‌శ్చిమ విష‌యంలో బాబు టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నం.

 

ప‌శ్చిమ‌లో జ‌గ‌న్ హ‌వా.. బాబు టీంలో ద‌డ‌.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share