కేరాఫ్‌.. కంచరపాలెం.. హిట్టు.. సూప‌ర్ హిట్టు!!

September 10, 2018 at 11:45 am
YS Jagan, Prajasamkalpa Yatra, road show, Kancherapalem, YSRCP

నింగి వంగిందా.. నేల ఈనిందా.. అనే స్థాయిలో జ‌నం. క‌నుచూపు మేర ఎటు చూసినా జ‌నం. జ‌గ‌న్ స‌భ‌ల‌కు జ‌న‌మే జ‌నం!ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల నీరాజ‌నం. ఎక్క‌డ ఎప్పుడు స‌భ పెట్టినా.. జ‌గ‌న్‌కు జ‌నాల నుంచి అపూర్వ‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తూనే ఉంది. ఊరూ.. వాడా.. జిల్లా.. గ‌ల్లీల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా త‌ర‌లి వెళ్లి.. జ‌గ‌న్ స‌భ‌ల‌ను విజ‌య‌వంతం చేస్తున్నారు. అయితే, తాజాగా విశాఖ‌ప‌ట్నం జిల్లాలో నిర్వ‌హిస్తున్న‌ ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా 258వ రోజు ఆదివారం ఆయన కంచరపాలెం వద్ద స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు జ‌నాలు మామూలుగా పోటెత్త‌లేదు. ఎటు చూసినా జ‌నాలే.. ఎటు వైపు త‌ల‌తిప్పినా.. క‌నిపించ‌ని నేల‌!! వాస్త‌వానికి ప్ర‌భుత్వ అనుకూల మీడి యా.. వ‌ర్గాలు జ‌గ‌న్ స‌భ‌లు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయ‌ని చెప్పేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు పూర్తిగా విఫ‌ల‌మయ్యాయి.

ysrcp

గ‌త ఏడాది న‌వంబ‌రు 6న ప్రారంభ‌మైన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర నేటి వ‌ర‌కు దాదాపు 11 మాసాలుగా నిర్విఘ్నంగా, నిరాటం కంగా ముందుకు సాగుతోంది. ప్ర‌తినియోజ‌క‌వ‌ర్గంలోనూ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో భాగంగా స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే, తాజాగా కంచ‌ర్ల పాలెంలో నిర్వ‌హించిన స‌భ‌కు మాత్రం భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ కూడా పెద్ద ఎత్తునే స్పందించారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌పై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ప‌లు స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధించారు. ఎక్కడ భూములు కనిపించినా లాక్కోవడం.. చక్కగా పని చేస్తున్న సహకార సంస్థలను నష్టాల్లోకి నెట్టడం.. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం.. ఎడాపెడా పన్నులు బాదేయడం.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం..

10VJPAGE4JAGAN

అబద్ధాలు చెప్పడం.. పేదలకు వైద్యం, చదువును దూరం చేయడం.. ఇవేనా అభివృద్ధి అంటే బాబూ.. అని జ‌గ‌న్ నిప్పు లు చెరిగారు. ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు ప‌థ‌కాలు నేటికీ కూడా ప్ర‌జ‌లకు చేరువ కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిగా ఉండాల్సిన ప్ర‌భుత్వం ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. మొత్తానికి జ‌గ‌న్ కంచ‌ర్ల పాలెం స‌భ అదిరిపోయింది. దీనిపై విమ‌ర్శ‌కులు సైతం అభినంద‌న‌లు తెలియ‌జేయ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, నెటిజ‌న్లు… ఈ స‌భ‌కు వ‌చ్చిన వారి ఫొటోలు పెట్టి సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యానికి ఈ స‌భ‌కు వ‌చ్చిన ప్ర‌జ‌లే సంకేత‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కేరాఫ్‌.. కంచరపాలెం.. హిట్టు.. సూప‌ర్ హిట్టు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share