పీత‌ల సుజాత‌పై ‘ ద‌మ్ము ‘ ను దింపిన జ‌గ‌న్‌

November 20, 2017 at 10:42 am
YSRCP, Chinthala pudi constituency, suhasini, peethala sujatha

ఏపీలో మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ అభ్య‌ర్థిని దాదాపు ఖ‌రారు చేశారు. టీడీపీకి కంచుకోట లాంటి నియోజ‌క‌వ‌ర్గ‌మైన చింత‌ల‌పూడి వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా జ‌గ‌న్ ద‌మ్ము సుహాసినిని నియ‌మించారు. ఈ మేర‌కు ఆ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. వాస్త‌వానికి గ‌త ఎన్ని ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌పున మాజీ ఎమ్మెల్యే మ‌ద్దాల రాజేష్ భార్య మ‌ద్దాల దేవీప్రియ పోటీ చేసి పీత‌ల సుజాత చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత మ‌ద్దాల రాజేష్ రాజ‌కీయాల‌కు దూర‌మైపోవ‌డంతో జ‌గ‌న్ లింగ‌పాలెం మండ‌లానికి చెందిన ద‌య్యాల న‌వీన్‌బాబును స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు.

తాజాగా ఆర్థిక‌కోణంలో న‌వీన్‌బాబు వీక్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చిన జ‌గ‌న్ ఆయ‌న‌కు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఏదైనా ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీతో త‌ప్పించేశారు. ఇక ఇప్పుడు ద‌మ్ము సుహాసినిని నియోజ‌క‌వ‌ర్గ స‌మన్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె చింత‌ల‌పూడి నుంచి వైసీపీ త‌ర‌పున బ‌రిలోకి దిగ‌డం దాదాపు ఖాయ‌మైంది. క‌ర్ణాట‌క‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఎస్‌.స్వ‌తంత్య్ర‌రావు కుమార్తే ఈ సుహాసిని. సుహాసిని భ‌ర్త ద‌మ్ము ముర‌ళీధ‌ర్‌రావు హైద‌రాబాద్‌లో సివిల్ స‌ర్వెంట్‌గా ప‌ని చేస్తున్నారు.

ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పీత‌ల సుజాత ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లోను వైసీపీ ఇక్క‌డ నుంచి మ‌హిళ‌నే పోటీకి దింప‌గా ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కూడా మ‌హిళ‌నే రంగంలోకి దించ‌డం విశేషం. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు, ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయంగా పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌ని సుహాసినికి స‌మ‌న్వ‌య‌క‌ర్త బాధ్య‌త‌లు ఇవ్వ‌డం వెన‌క భారీగా ఆర్థిక‌కోణమే కార‌ణ‌మ‌న్న టాక్ న‌డుస్తోంది.

వైసీపీలో గ్రూపులు సుహాసినికి సవాలే…

చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలో లెక్క‌కు మిక్కిలిగా వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. వీరంద‌ర‌ని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వెళ్లడం సుహాసినికి పెద్ద స‌వాల్‌గా మార‌నుంది. నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన చింత‌ల‌పూడిలో మాజీ ఎమ్మెల్యే ఘంటా ముర‌ళిది ఓ వ‌ర్గం, లేడీ లీడ‌ర్ జ‌గ్గ‌వ‌ర‌పు జాన‌కీరెడ్డిది మ‌రో వ‌ర్గం, ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త కోట‌గిరి శ్రీథ‌ర్‌, మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబుల‌ది మూడో వ‌ర్గం. లింగ‌పాలెం మండ‌లంలోను వైసీపీలోనే రెండు గ్రూపులు రాజ్య‌మేలుతున్నాయి. ఇక కామ‌వ‌ర‌పుకోట మండ‌లంలోను ముర‌ళీ, శ్రీథ‌ర్ వ‌ర్గాల మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగానే మండుతోంది. వీళ్ల‌లో క‌వ‌ర‌మంటే క‌ప్ప‌కు కోపం, విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా వార్ న‌డుస్తోంది. ఎవ్వ‌రిని మెప్పించి ఒప్పించే ప‌రిస్థితి లేదు. ఇప్పుడు వీరంద‌రిని క‌లుపుకుని ముందుకు వెళ్ల‌డం సుహాసిని ముందున్న అతి పెద్ద స‌వాల్.

 

పీత‌ల సుజాత‌పై ‘ ద‌మ్ము ‘ ను దింపిన జ‌గ‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share