ఆ జంపింగ్ పని పట్టేందుకు…జగన్ సంచలన నిర్ణయం!

November 5, 2018 at 5:03 pm

రాజ‌కీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు స‌హ‌జం. అదేవిధంగా త‌మ‌ను ఎదిరించిన నాయ‌కుల‌కు, త‌మ‌కు వెన్నుపోటు పొడిచి న నాయ‌కులకు కూడా స‌రైన విధంగా బుద్ది చెప్పేందుకు పార్టీల అధినేత‌లు స‌మ‌యం కోసం ఎదురు చూడ‌డం కూడా స‌హ‌జ‌మే. అచ్చం ఇప్పుడు అలాంటి ప‌నే చేస్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. నిజానికి గ‌తంలో వైఎస్ కూడా టీడీపీ అధి నేత చంద్ర‌బాబుకు స‌రైన షాక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రాష్ట్రంలో తిరుగులేని శ‌క్తిగా త‌న‌ను తాను ఎద‌గాలని క‌ల‌లు క‌న్నారు. దీనికోసం ఆయ‌న చాలా సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డ్డారు. మండుటెండ‌లో పాద‌యాత్ర కూడా చేసి ప్ర‌జ‌లతో భేష్ అనిపించుకున్నారు.ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకు వ‌చ్చారు.

padayatra_1

ఖ‌చ్చితంగా వైఎస్ వారసుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌గ‌న్ కూడా తండ్రి నుంచి రాజ‌కీయాల‌ను ఒంట‌బ‌ట్టించుకున్నా రు. తాను న‌మ్మి, ఉన్న‌త ప‌ద‌వులు సైతం క‌ట్ట‌బెట్టినా.. త‌న‌కు తీర‌ని ద్రోహం చేయ‌డ‌మే కాకుండా త‌న టికెట్‌పై విజ‌యం సాధించి.. త‌ర్వాత త‌న బ‌ద్ధ శ‌త్రువు బాబుకు జైకొట్టిన నాయ‌కుల‌పై జ‌గ‌న్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ ఫిరాయించి సైకిల్ ఎక్కిన వైసీపీ ఎమ్మెల్యేల‌పై క‌సి తీర్చుకునేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ము ఖ్యంగా తాను అన్న అని గౌర‌వించే తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు జ్యోతుల నెహ్రూకు స‌రైన విధంగా బుద్ది చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ్యోతుల‌ను ఓడించేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకుసాగుతున్నారు.

11nehru_G05C1R3IV.1+11nehru

ప్ర‌స్తుతం జ‌గ్గంపేట నియోక‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జుగా చంటిబాబు ఉన్నారు. అయితే, నెహ్రూను ఓడించేందుకు చంటిబాబు శ‌క్తి స‌రిపోద‌ని భావించిన జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన వ్య‌క్తిగా ఉంటాడ‌ని భావిస్తున్న యువ నేత‌కు ఆహ్వానం ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మాజీ మంత్రి తోట రామస్వామి మనవుడు అయిన తోట రామస్వామిని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీకి దించాలని జ‌గ‌న్ వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ఇంచార్జుగా ఉన్న చంటిబాబును ప‌క్క పెట్టి.. రామ‌స్వామికి బాద్య‌త‌లు అప్ప‌గించాల‌ని యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆర్థికంగాను, ప్ర‌జ‌ల్లోనూ బ‌ల‌మైన ప‌ట్టున్న రామ‌స్వామికి వైసీపీ పగ్గాలు అప్పజెప్పడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జ‌రిగితే.. నెహ్రూకు చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఆ జంపింగ్ పని పట్టేందుకు…జగన్ సంచలన నిర్ణయం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share