జగన్ దెబ్బకు ఉత్తరాంధ్రలో టిడిపి కోట కూలుతోందా!

October 24, 2018 at 12:59 pm

నవ్యాంధ్ర లో జరిగిన తొలి ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి చంద్రబాబు తొలి సీఎం అవ్వడం లో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు ఎంతో కీలక మయ్యాయి, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఇరవై ఆరు చోట్ల విజయకేతనం ఎగురవేసింది. విశాఖ జిల్లాలోని అరకు పాడేరు మాడుగులతో పాటు విజయనగరం జిల్లాలోని కురుపాం సాలూరు శ్రీకాకుళం జిల్లాలోని రాజాం పాతపట్నం పాలకొండ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది.

వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థులు తక్కువ ఓట్లతో మాత్రమే విజయం సాధించారు, విశాఖ ఏజెన్సీలు ఏజెన్సీ లో ఉన్న అరకు పాడేరు లో మాత్రమే వైసిపికి భారీ మెజారిటీ దక్కింది. ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో అరకు పాడేరు పాతపట్నం ఎమ్మెల్యేలు సైతం సైకిల్ గూటికి చేరిపోయారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్న ఐదు ఎంపీ సీట్లలో అరకు ఎంపీ సీటు మినహా మిగిలిన నాలుగు ఎంపీ సీట్లు కూడా బీజేపీ తో కలుపుకుని టిడిపి ఖాతాలోనే పడ్డాయి.

chandrababu-naidu-7591

నాలుగున్నర ఏళ్లలో టిడిపి పై ఉత్తరాంధ్ర జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ వైపు ఉత్తరాంధ్రలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తుంటే, టిడిపి ప్రజాప్రతినిధులు జనాల్లోకి వెళుతుంటే రావొద్దు అనేలా నినాదాలు చేసే వరకు పరిస్థితి వెళ్లింది. దీనిని బట్టి టిడిపి ప్రజాప్రతినిధులపై ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో తెలుస్తోంది. తితలి తుఫాను బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ రామ్మోహన్ నాయుడును కారు దిగకుండానే జనాలు వెనక్కి పంపించేశారు, యువ ఎంపీ గా ప్రజా సమస్య లపై బాగానే స్పందిస్తాడని పేరున రామ్మోహన్ నాయుడు పరిస్థితి ఇలా ఉందంటే సీనియర్ ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

శ్రీకాకుళం జిల్లాలో జిల్లా కేంద్రం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తో పాటు అదే జిల్లాకు చెందిన మంత్రులు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకట్రావు తీవ్రమైన వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అసలు మంత్రివర్గంలో ఉన్నారా ఆయన తమ జిల్లాకు చెందిన వ్యక్తేనా అన్న పరిస్థితి వచ్చింది. ఇక విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు తమలో తాము విమర్శించుకోడానికే టైం సరిపోవడం లేదు వీళ్ళకి జనాలను పట్టించుకునే టైం ఎక్కడ ఉంటుంది అన్న చందంగా మారింది.

44617419_2010682725618851_6688106481872535552_n

ఇక గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు నేపద్యంలో స్వల్ప ఓట్ల శాతం గట్టెక్కిన టీడీపీకి, ఇప్పుడు జనసేన ఒంటరి పోరుకు రెడీ అవుతుండటం ఎండ నుంచి బయటకు రావడంతో ఆ పార్టీ కి చుక్కలు కనపడుతున్నాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వెనుక బడిన వైసీపీ ఇప్పుడు రోజురోజుకు పుంజుకోవడంతో పాటు జగన్ పాదయాత్రకు టి.డి.పి వాళ్లు సైతం ఊహించని విధంగా స్పందన వస్తుండటంతో వాళ్లకు మింగుడు పడటం లేదు. విచిత్రమేంటంటే శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడికి ఇప్పుడు ఏటికి ఎదురీది పరిస్థితి వచ్చేసింది విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేరు, ఇక విజయనగరం నుంచి ఎంపీగా ఉన్న మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తాం అంటున్నారు, అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి లేదా మరో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకే పోటీ చేస్తాను తప్ప ఎంపీగా పోటీ చేయనని కరాఖండిగా చెబుతున్నారు.

ఏదేమైనా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఉత్తరాంధ్రలో టిడిపి పై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది మాత్రం క్లియర్ గా తెలుస్తోంది. అదే టైంలో వైసిపి అంచనాలకు మించి రోజురోజుకు పుంజుకుంటుంది, సందట్లో సడేమియా అన్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాటకాన్ని రక్తి కట్టిస్తున్న తప్ప ఆ పార్టీకి ప్రజల్లో ఏ మాత్రం గెలిచే స్కోప్ లేదని తెలుస్తోంది.

జగన్ దెబ్బకు ఉత్తరాంధ్రలో టిడిపి కోట కూలుతోందా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share