జ‌గ‌న్ వెంటే జ‌నం..స్ప‌ష్ట‌మైంది ఇలా!

September 15, 2018 at 9:07 pm

తేలిపోయింది! ఏపీలో ఎవ‌రికి ప్ర‌జ‌లు జై కొడుతున్నారో అర్ధ‌మైంది. ఇన్నాళ్లుగా త‌మ‌దే విజ‌యం అంటూ.. త‌మ‌కే సంతృప్తి ఉందంటూ… డ‌బ్బా కొట్టుకున్న చంద్ర‌బాబు బాగోతం ప్ర‌జ‌లు చాలా వేగంగా వెల్ల‌డించారు. ఆయ‌న‌కు ఉన్న పాపులారిటీ కేవ‌లం అవినీతి, దందాలు చేస్తున్న‌నాయ‌కులు మాత్ర‌మేన‌ని స్ప‌ష్ట‌మైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం సీటును జ‌గ‌న్‌కు క‌ట్ట‌బెట్టాల‌ని ప్ర‌జ‌ల్లో 50 % మంది భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. రానున్న ఎన్నికల్లో జగన్ వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే జగన్‌కి 43% మంది ఓటేశారు.

f5071c4571c357b92d0936b91d51cf78

చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చారు. ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో టీడీపీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు తేలింది. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని, కాబోయే సీఎం జగన్‌ వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏపీలో జగన్‌కు మినహా ఎక్కడా ప్రస్తుత సీఎంల కంటే ప్రతిపక్షనేతకు ఎక్కువ శాతం ఓట్లు రాలేదని వెల్లడైంది. ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్‌లో ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది.

Friendship-with-KCR-Costing-YS-Jagan-Mohan-Reddy-Dearly-1

ఈచర్చా కార్యక్రమాన్ని సీనియర్‌ జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్, రాహుల్‌ కన్వల్‌ నిర్వహించారు. ఇండియా టుడే సర్వేలో భాగంగా తదుపరి సీఎం ఎవరన్న సూటి ప్రశ్నకు 43% మంది జగన్‌కు అనుకూలంగా ఓటేశారని వారు వెల్ల డించారు. 36% చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై బాగాలేదని, 18% ఓ మోస్తరుగా ఉందని స్పష్టం చేశారన్నారు. మొత్తానికి ఈ ప‌రిణామాలు.. ఏపీలో మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌రణ‌ల‌ను స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, జ‌గ‌న్ వీటితోనే మురిసిపోవ‌డం కాద‌ని, ఇప్పుడు కేవ‌లం 43 %గా ఉన్న ఈ సంతృప్తిని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత పుంజుకునేలా కృషి చేయాల్సిన అవ‌స‌రం చాలా ఉంద‌ని చెబుతున్నారు. ఇక‌, పార్టీ ప‌రంగా కూడా ప‌లు జిల్లాల్లో నాయ‌క‌త్వ లేమి, నేత‌ల కొర‌త ప‌ట్టి పీడిస్తోంద‌ని, ఈ క్ర‌మంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

జ‌గ‌న్ వెంటే జ‌నం..స్ప‌ష్ట‌మైంది ఇలా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share