జగన్ ఈక్వేషన్లు…బాబు ఉక్కిరి బిక్కిరి!

November 3, 2018 at 3:46 pm

రాజకీయాల్లో కాకలతీరిన యోధుడుగా, పార్టీ ఈయర్స్‌ ఇండస్ట్రీగా పేరున్న ఏపీ సీఎం చంద్రబాబు తనకన్నా వయస్సులో, రాజకీయాల్లో చాలా చాలా జూనియర్‌ అయిన వైసీపీ అధినేత జగన్‌ పన్నుతున్న వ్యూహాలతో విలవిల్లాడుతున్నట్టే కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబును గద్ది దించేందుకు జగన్‌ ఇప్పటికే ప్రజాసంకల్ప యాత్ర పేరుతో సుథీర్గ కాలంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు వస్తున్న అద్భుతమైన స్పందనతో టీడీపీ విలవిల్లాడుతుంది. దీంతో పాటు టీడీపీకి అటు బీజేపీ ఇటు పవన్‌తో పాటు తెలంగాణలో కేసీఆర్‌తో ఉండాల్సిన అన్ని సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు అందరితోనూ నవ్యాంధ్రను అభివృద్ధి చేస్తాడని ప్రజలు ఎన్నో ఆశలతో ఆయన్ను సీఎం చేస్తే ఆయన రాజకీయంగా అందరితోనూ విభేదిస్తున్నారు.

jagan-and-chandrababu

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ అధినేత జగన్‌ పన్నుతున్న వ్యూహాలు, స్ట్రెటజి ముందు టీడీపీ చాలా నియోజకవర్గాల్లో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఎన్నికలంటేనే కులాల ఈక్వేషన్ల లెక్కల్లో మునిగిపోతారు. అందులోనూ తెలంగాణ కన్నా ఏపీలో కులాల లెక్కల ప్రభావం ఎక్కువే. అయితే జగన్‌ రాజధాని జిల్లా అయిన గుంటూరులో అదిరిపోయే వ్యూహంతో ముందుకువెళ్తున్నాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ సమన్వయకర్తగా జనాల్లోకి దూసుకుపోతున్న విడదల రజినీ బీసీ వర్గానికి చెందిన మహిళ కాగా ఆమె భర్త కాపు వర్గానికి చెందిన వారు. దీంతో ఈ కుటుంబంలోనే రెండు కులాలు ఉండడంతో అటు కాపులతో పాటు బీసీలు సైతం అక్కడ రజినీకి అనుకూలంగా మగ్గు చూపుతున్నారు. జగన్‌ వేసిన ఎత్తుగడతో ఇక్కడ మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు విలవిల్లాడాల్సిన పరిస్థితి.

ఈ నియోజకవర్గంలో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని ఢీ కొట్టేందుకు జగన్‌ వేసిన ఈక్వేషన్‌ ఇక్కడ బాగా వర్కోట్‌ అయ్యినట్టే కనిపిస్తోంది. అలాగే గుంటూరు వెస్ట్‌ వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన చంద్రగిరి యేసురత్నం బీసీలో II సామాజికవర్గానికి చెందిన వారు కాగా ఆయనకు అటు బీసీలతో పాటు ఇటు క్రీస్టియానాలోనూ మంచి పట్టుంది. ఈ క్రమంలోనే చంద్రగిరి యేసురత్నం వెస్ట్‌ నుంచి పోటీ చేస్తుండడంతో ఆయనకు అటు వైసీపీకి మంచి పట్టున్న రెడ్డి ఓటు బ్యాంకుతో పాటు బీసీలు, క్రీస్టియానాల ఓటు బ్యాంకును కొల్లగొట్టే చాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గుంటూరు వెస్ట్‌లో జగన్‌ వేసిన ఈ పాచికికు టీడీపీ విలవిల్లాడాల్సిన పరిస్థితి. జగన్‌ ఇప్పుడు అదే వ్యూహాన్ని తాడికొండ నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇక్కడ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న గత ఎన్నికల్లో ఓడిన హెన్‌డ్రీ క్రిస్టియానాను తప్పించి ఆమెకు బదులుగా హైదరాబాద్‌లో డాక్టర్‌గా ఉన్న శ్రీదేవిని రంగంలోకి దింపుతున్నారు. తాడికొండ నుంచి వచ్చే ఎన్నికల్లో డాక్టర్‌ శ్రీదేవి పోటీ చెయ్యడం దాదాపు కరారు అయ్యినట్టే. శ్రీదేవి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాగా ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారుగా తెలుస్తోంది. దీంట్లో శ్రీదేవి కుటుంబంలోనూ రెండు కులాలు ఉన్నట్లు అయ్యింది. అలాగే అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జొన్నలగడ్డ పద్మావతి ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కాగా ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. ఇలా జగన్‌ కులాల కాంబినేషన్‌ మిక్స్‌ చేసి అన్ని విధాల బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడంతో టీడీపీ ఇప్పుడు ఈ వ్యూహానికి ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

జగన్ ఈక్వేషన్లు…బాబు ఉక్కిరి బిక్కిరి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share