వాళ్లకు అంత సీనుంటే.. వైసీపీ జెండా ఎందుకు ప‌ట్టుకున్నారో?!

September 9, 2018 at 11:37 am

మేం.. మా సొంత బ‌లంతోనే గెలిచాం.. జ‌గ‌న్ మాకు చేసింది ఏమీలేదు! అంటూ.. వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిన్న‌టి కినిన్న గొంతు చించుకున్నారు. విజయమ్మ‌ను ఓడించిన బీజేపీతో మీరు కలవొచ్చు.. అలాంటప్పుడు మేం టీడీపీలో కలి స్తే తప్పేముంది అని మంత్రి ఆదినారాయణరెడ్డి వంటి చంచ‌ల చిత్తులు ప్ర‌శ్న‌లు కూడా సంధించారు. తన వల్లే మేం గెలిచామని జగన్‌ చెబుతున్నారని, విశాఖలో ఆయన తల్లి విజయలక్ష్మి తన వల్లే ఓడిపోయిందని జగన్‌ ఒప్పుకొంటే.. మేం కూడా జగన్‌ వల్లే గెలిచామని అంగీకరిస్తామ‌ని ఆది వితండ వాద‌న తెరమీదికి తెచ్చారు. ఆయన మా వంశ చరిత్ర గురిం చి మాట్లాడుతున్నారు.

ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. వైసీపీ పెట్టిన నాటి చరిత్ర చెబితే జగన్‌ పారిపోతారు అంటూ.. వ్యాఖ్యానించారు. ఇక‌, మ‌రో ఫిరాయింపు మంత్రి వ‌ర్యులు .. అమ‌ర్నాథ‌రెడ్డి మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నికల్లో తమను ఓడిస్తామంటున్న జగన్ కు దమ్ముంటే తన నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేయాలని సవాల్‌ విసిరారు. తమ సత్తా, ఆయన సత్తా ఏంటో తేల్చు కుంటామని చెప్పారు. నువ్వు(జగన్‌) పుట్టక ముందే మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యే గా చేశారు. మాది రాజకీ య కుటుంబం. నీ బొమ్మ పెట్టుకుని గెలవాల్సిన దుస్థితి మాకు లేదు అని వ్యాఖ్యానించారు. అయితే, ఇంత సుద్దులు చెబుతున్న ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌పై ఇప్పుడు నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.

మ‌రి అంత సీనున్న నాయ‌కులు సొంత పార్టీ పెట్టుకుని గెలవ‌చ్చు క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు, వీరిక‌న్నా వైసీపీ నుంచి గెలిచి.. గోడ‌మీద పిల్లి మాదిరిగా మారిపోయిన కొత్త‌ప‌ల్లి గీత బెట‌ర‌ని అంటున్నారు. ఆమె సొంత‌గా పార్టీ పెట్టుకుంద‌ని, వీరు పురుష పుంగ‌వులు అయి ఉండి ఆడోళ్ల క‌న్నా ఎక్కువ‌గా మాటలు చెప్పుకొంటు న్నార‌ని సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు ద‌ద్ద‌రిల్లుతున్నాయి. జ‌గ‌న్ జెండాపై గెలిచి.. ఫిరాయించి కూడా సిగ్గులేకుండా ఇప్పుడు కామెంట్లు ఎలా చేస్తున్నార‌ని అంటున్నారు.

ఒక‌వేళ అంత‌గా వెళ్లాల‌నుకుంటే.. వైసీపీకి రాజీనామా చేసి.. ఆ పార్టీ టికెట్‌పై వ‌చ్చిన ఎమ్మెల్యే గిరీని వ‌దులుకుని, టీడీపీలోకి చేరి ఉండాల్సింది. టీడీపీ టికెట్‌పై గెలిచి ఉండాల్సింది. కానీ, ఇవేవీ చేయ‌కుండానే జ‌గ‌న్‌ను నిందించ‌డం అంటే.. అంతా చంద్ర‌బాబును మెప్పించ‌డంలో భాగ‌మ‌నే అనుకోవాలి. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. అప్పుడు తెలుస్తుంది .. ఎవ‌రి ప్ర‌తాపం ఎంతో! ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు పౌరుషం ఉంటే పార్టీకి రాజీనామా చేయాల‌న్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను సైతం అర్ధం చేసుకోలేని వీరు ఎమ్మెల్యేలుగా ఉండ‌డం త‌మ దౌర్భాగ్యం అంటున్నారు ప్ర‌జ‌లు.

వాళ్లకు అంత సీనుంటే.. వైసీపీ జెండా ఎందుకు ప‌ట్టుకున్నారో?!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share