ప్ర‌భుత్వం గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించిన జ‌గ‌న్ యాత్ర‌..!

June 13, 2018 at 4:49 pm

ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం! రాష్ట్రంలోని టీడీపీ ప్ర‌భుత్వంలో సీఎం చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులైన అధికారులు సైతం నిన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌పై వెయ్యి క‌ళ్లు పెట్టుకుని ప‌ర్య‌వేక్షించారు. ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు .. నాలుగు డ్రోన్ కెమెరాల‌తో జ‌గ‌న్ నిర్వ‌హించిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌ను చిత్రీక‌రించారు. నిజానికి గ‌త ఏడాది న‌వంబ‌రులో ప్రారంభమైన ఈ పాద‌యాత్ర‌కు సంబందించి ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఇన్నాళ్లుగా ఇంత దూకుడు ప్ర‌ద‌ర్శించింది లేదు. ప‌ర్య‌వేక్షించింది కూడా చాలా త‌క్కువ‌. శాంతి భ‌ద్ర‌త‌ల కోణంలోనే ఈ పాద‌యాత్ర‌ను గ‌మ‌నించి.. సూచ‌ల‌ను స‌ల‌హాలు చేసిన ఉన్న‌తాధికారులు నిన్న మాత్రం పూర్తిగా ప్ర‌తిక్ష‌ణం.. పాద‌యాత్ర సాగుతున్న తీరును స‌మీక్షించారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌గ‌న్ పాద‌యాత్ర అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోదావ‌రి న‌దిపై నిర్మించిన రైల్ కం.. రోడ్ బ్రిడ్జిపై సాగ‌డ‌మే! దాదాపు 100 సంవ‌త్స‌రాల కింద‌ట నిర్మించిన ఈ బ్రిడ్జి.. అత్యంత కీల‌క‌మైంది. పొడ‌వైంది కూడా. ఇది రెండు జిల్లాల‌నే కాదు.. రాష్ట్రంలోని ఉత్త‌రాంధ్ర‌కు కూడా వార‌ధిగా ఉంది. అలాంటి ఈ బ్ర‌డ్జిని దాటుకుని తూర్పు గోదావ‌రి జిల్లాలోకి జ‌గ‌న్ అడుగు పెట్టే క్ష‌ణాలు.. అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించేలా చేశాయి. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ గోదావ‌రిలో పూర్తి చేసుకున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌.. తూర్పు గోదావ‌రిలోకి ప్ర‌వేశించేందుకు ఉన్న ఏకైక మార్గం.. రైల్‌కం రోడ్ బ్రిడ్జి. అయితే, అధికార పార్టీ భావించిన విధంగా జ‌గ‌న్ యాత్ర‌కు ఏదో చిన్న‌పాటి స్పంద‌న రావ‌డం లేదు. పెద్ద ఎత్తున జ‌నాల నుంచి ఫాలోయింగ్ పెరుగుతోంది.

ఎక్క‌డిక‌క్క‌డ ఆయ‌న పాద‌యాత్ర‌కు వంద‌లు వేలు కాదు.. కొన్ని సంద‌ర్భాల్లో ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం.. జ‌గ‌న్‌తో క‌లిసి పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. ఇదే ప‌రిణామం.. గోదావ‌రి న‌దిని దాటే స‌మ‌యంలోనే ఏర్ప‌డితే.. ప‌రిస్థితి ఏంటి? ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం ఒక్క‌సారిగా జ‌గ‌న్‌తో క‌లిసి పాద‌యాత్ర‌తో రైల్ కం రోడ్ వంతెన‌ను దాటే ప్ర‌య‌త్నం చేస్తే.. ఏం జ‌రుగుతుంది? వ‌ంద‌ల ఏళ్ల‌నాటి బ్రిడ్జి.. కూలిపోవ‌డం ఖాయం! అధికారులుముంద‌స్తుగానే ఈ హెచ్చ‌రిక‌లు చేశారు. వేల సంఖ్య‌లో జ‌గ‌న్ అనుచ‌రులు బ్రిడ్జిపై న‌డిస్తే.. అనునాదం కారణంగా బ్రిడ్జి నేల‌మ‌ట్ట‌మ‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం నాలు డ్రోన్ కెమెరాల‌ను రంగంలోకి దించి.. బ్రిడ్జిని దాటుతున్న స‌మ‌యంలో ప‌రిస్థితిని అంచ‌నా వేసింది.

ముఖ్యంగా విజ‌య‌వాడ‌లోని ఆర్టీజీ కేంద్రంలో ప్రభుత్వం ఉన్న‌తాధికారులు, డీజీపీ సైతం.. ఈ క్ష‌ణాల‌ను స్వ‌యంగా టీవీల్లో వీక్షించి నోరెళ్ల బెట్టారు. ఇస‌కేసినా రాల‌నంత జ‌నాభా .. జ‌గ‌న్ ను ఫాలో అవుతుంటే.. వారికి ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దాదాపు 70 నిముషాల పాటు ప్ర‌భుత్వంలోని కీల‌క ప‌ని మొత్తం నిలిచిపోయింద‌ని ఉన్న‌తాధికారి ఒక‌రు వెల్ల‌డించ‌డాన్ని బ‌ట్టి జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం ఏపాటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే, మొత్తంగా ఈ పాద‌యాత్ర ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గోదావ‌రి వంతెన‌ను దాటుకోవ‌డంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ద‌టీజ్.. జ‌గ‌న్ ఫాలోయింగ్‌!!

ప్ర‌భుత్వం గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించిన జ‌గ‌న్ యాత్ర‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share