జ‌గ‌న్‌కు గుడ్ టైం.. అవన్నీ క‌లిసొస్తున్నాయ్‌..

June 4, 2018 at 11:43 am
YS Jagan, YSRCP, Praja Samkalpa Yatra, Good time,

వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌కు ఇప్పుడు అన్నీ క‌లిసి వ‌స్తున్నాయి. అటు టీడీపీని, ఇటు ప్ర‌ధాన ప‌క్షంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌న‌సేనాని ప‌వ‌న్ విష‌యంలోనూ జ‌గ‌న్ విజ‌యం సాధించారు. తాను చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్తున్న జ‌గ‌న్.కు ప్ర‌జ‌లు కూడా అదే రేంజ్‌లో బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితుల‌ను చూసుకుంటే… ఓ సంక్లిష్ట‌మైన వాతావ‌ర‌ణాన్ని, స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్నారు. విభ‌జ‌న‌తో రాష్ట్రం పూర్తిగా న‌ష్ట‌పోయింది. ప్ర‌ధానంగా రాష్ట్రానికి ఇస్తామ‌ని హామీ ఇచ్చిన ప్ర‌త్యేక హోదా అట‌కెక్కిపోయిం ది. ఎక్క‌డి అభివృద్ది అక్క‌డే నిలిచిపోయింది.పోల‌వ‌రం ప్రాజెక్టు ఇప్ప‌ట్లో పూర్త‌య్యేలా క‌నిపించ‌డం లేదు. రాజ‌ధాని నిర్మాణాల‌కు ఒక్క‌పైసా కూడా లేదు.

మ‌రి ఈ నేప‌థ్యంలో రాష్ట్రాన్ని లీడ్ చేసే ది ఎవ‌రు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడ‌ని, ఆయ‌న అనుభ‌వం రాష్ట్రానికి ఉప యోగ ప‌డుతుంద‌ని భావించి 2014లో అధికారం అప్ప‌గిస్తే.. చంద్ర‌బాబు చేసిందేంటి? నిజానికి ఆయ‌నో హిట్ల‌ర్‌గా మారిపోయాడ‌ని సొంత పార్టీలో అస‌మ్మ‌తినాయ‌కులే చెప్పుకొంటున్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం, అధికారం ద‌క్క‌డమే ప‌ర‌మావ‌ధిగా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చాక నాలుగేళ్లు కేంద్రంలోని బీజేపీతో అంట‌కాగారు. అదేమంటే హోదా కోసం త్యాగం అని చెప్పారు. నాలుగేళ్లు అయిపోయి ఎన్నిక‌ల సీజ‌న్ ప్రారంభ‌మ‌య్యాక.. హోదా ద‌క్క‌ని నేప‌థ్యంలో ఇదే అంశంపై విప‌క్షం వైసీపీ ప్ర‌జల్లో సంచ‌ల‌నం రేకెత్తిస్తుండ‌డంతో బాబు గుండెళ్లో ఎన్నిక‌ల రైళ్లు ప‌రిగెత్తాయి.

ఈ నేప‌థ్యంలో.. ఆయ‌న మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకుని ప్ర‌త్యేక హోదా కోసం ధ‌ర్మ పోరాట దీక్ష‌లు చేప‌ట్టారు. ఇవేవో అప్ప‌డే చేసి ఉంటే బాగుండేద‌న్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను బాబు విస్మ‌రిస్తున్నారు. అయితే, ప్ర‌జ‌లు మాత్రం జ‌గ‌న్ కృషిని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో అధికార టీడీపీ నాయ‌కులు గ‌తంలో ఏం చేశారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? వ‌ంటి అంశాల‌పైనా ప్ర‌జ‌లు దృష్టి పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా జ‌గ‌న్ త‌న భుజం నుంచి దించేయ‌లేదు. ఆనాడు విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డ‌గించినా.. ఆ త‌ర్వాత అధికార పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు చేసి.. హోదా అడిగిన వారు రాష్ట్ర ద్రోహులేన‌ని ముద్ర వేసినా.. జ‌గ‌న్ చ‌లించిపోలేదు.

హోదా కోసం నాడు, నేడు ఒకే మాట‌పై, ఒకే వ్యూహంతో ఆయ‌న న‌డుస్తున్నారు. ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే రాజ‌కీయ పార్టీల‌కు గీటురాయిగా భావిస్తూ.. ఆయ‌న ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌లు రాష్ట్రానికి ఏ దైన ప్ర‌యోజ‌నం క‌ల‌గాలంటే.. ఒక్క జ‌గ‌న్‌తోనే సాధ్య‌మ‌ని న‌మ్ముతున్నారు. ఊస‌ర‌వెల్లి మాదిరిగా చంద్ర‌బాబు నిముషానికో మాట మారుస్తున్నార‌ని అంటున్నారు. దీంతో జ‌గ‌న్‌పై భ‌రోసా నానాటికీ పెరుగుతోంది. దీనికి నిద‌ర్శ‌న‌మే ఆయ‌న నిర్వ‌హిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌కు పోటెత్తుతున్న జ‌నం. ఇక‌, రాష్ట్రంలోని మ‌రో పార్టీ జ‌న‌సేన‌పైనా పెద్ద‌గా మ‌హిళ‌లు ఆశ‌లు పెట్టుకున్నది లేదు. ప‌వ‌న్ పై మ‌హిళ‌ల్లో స‌ద‌భిప్రాయం లేక‌పోవ‌డ‌మే దీనికి ప్ర‌ధాన తార్కాణం. ఇక‌, ఆయ‌న నిల‌క‌డ‌లేని రాజ‌కీయాలు చేస్తుండ‌డం కూడా మైన‌స్‌గా మారింది. ఇవ‌న్నీ జ‌గ‌న్‌కు బాగా సానుకూలాంశాలు కానున్నాయి.

జ‌గ‌న్‌కు గుడ్ టైం.. అవన్నీ క‌లిసొస్తున్నాయ్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share