తుది స‌మ‌రానికి సిద్ధం కండి.. పార్టీ క్యాడ‌ర్‌కు జ‌గ‌న్ పోరు పిలుపు..

March 14, 2019 at 11:58 am

ఎన్నిక‌లు త‌రుమకొస్తున్న వేళ‌.. వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ క్యాడ‌ర్‌కు నిరంత‌రం దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఇప్ప‌టి నుంచి పోలింగ్ జ‌రిగేంత‌వ‌ర‌కు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న అంటున్నారు. ఇప్ప‌టికే ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ పార్టీ బూత్‌లెవ‌ల్ కార్య‌క‌ర్త‌లు, ముఖ్య నాయ‌కుల‌తో ఆయ‌న స‌భ‌లు నిర్వ‌హించారు. స‌మ‌ర‌శంఖారావం పేరుతో చేప‌ట్టిన ఈ స‌భ‌ల్లో ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై వారికి జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 16న ఇడుపుల‌పాయ‌లో పార్టీ అభ్య‌ర్థుల తొలిజాబితాను ప్ర‌క‌టించి.. అక్క‌డి నుంచే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఆయ‌న ప్రారంభించారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి ఓట‌రు జాబితాలో భారీగా అవ‌క‌త‌క‌వ‌లు జ‌రిగాయి. ప్ర‌ధానంగా ఓట‌రు జాబితా నుంచి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట‌ర్ల‌ పేర్ల తొల‌గింపు.. వైసీపీ అనుకూల ఓట‌ర్ల తొల‌గింపున‌కు కుట్ర‌లు జ‌రుగుతున్నాయి. అధికార టీడీపీ పార్టీ ప‌క్కా ప్లాన్‌తోనే ఇలాంటి దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తోంది. నేప‌థ్యంలో పార్టీ క్యాడ‌ర్ మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జ‌గ‌న్ అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఏకంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌తోపాటు ప‌లువురు కీల‌క నేత‌లు, నాయ‌కుల ఓట్ల‌నే తొల‌గించేందుకు కుట్ర‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పార్టీ శ్రేణులు త‌మ ఓట్లు ఓట‌రు జాబితాలో ఉన్నాయో లేవో జాగ్ర‌త్తగా చూసుకోవాల‌ని జ‌గ‌న్ చెబుతున్నారు.

తాజాగా.. పార్టీ శ్రేణులు మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాల‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పిలుపునిచ్చారు. వ‌చ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి శుక్రవారంతో గడువు ముగుస్తుండటంతో పార్టీ క్యాడర్‌ను వైఎస్‌ జగన్‌ అలర్ట్‌ చేశారు. ‘వైసీపీ బూత్‌ లెవల్‌ క్యాడర్‌ అందరకీ.. మనం నాలుగేళ్లుగా ప్రతి అంశంలో కష్టపడ్డాం. ఈ చివరి యత్నంలో ఉత్తమ ప్రయత్నాల కోసం పోరాడేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్దంగా ఉండాలి. వచ్చే రెండు రోజుల్లో ప్రతి ఓటును తనిఖీ చేయండి. పోలింగ్‌ రోజు ప్రతి ఒక్కరు ఓటేసేలా చూడాలి. వచ్చే 27 రోజుల్లో మీ నుంచి మద్దతును మరింత కోరుతున్నా’ అని జగన్‌ ట్వీట్‌ చేశారు.

తుది స‌మ‌రానికి సిద్ధం కండి.. పార్టీ క్యాడ‌ర్‌కు జ‌గ‌న్ పోరు పిలుపు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share