కృష్ణా జిల్లా వైసీపీ అభ్య‌ర్థులు ఖరారు!

May 15, 2018 at 10:07 am
YSRCP, leaders, krishna district, ys jagan, finalized

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ కృష్ణా జిల్లా పాద‌యాత్ర మిగిలిన జిల్లాల‌న్నింటికంటే బాగా స‌క్సెస్ అయ్యింది. జ‌గ‌న్ ఈ జిల్లాలో ఉండ‌గానే ప‌లువురు ప్ర‌ముఖ నాయ‌కులు వైసీపీలో చేరారు. జ‌గ‌న్ ఈ జిల్లాలో ఉండ‌గానే చాలా ప్ర‌త్యేక‌త‌లు చోటు చేసుకున్నాయి. రాజ‌ధాని జిల్లా అయిన కృష్ణా జిల్లాలో మొత్తం  239 కిలో మీటర్లు ఆయన నడిచారు. న్యాయవాదులు, నాయిబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కలంకారీ చేతివృత్తిదారులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు.ఎస్సీల ఆత్మీయ  సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇక ఈ జిల్లాలో ప‌ట్టున్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని ఎట్రాక్ట్ చేయ‌డంలో జ‌గ‌న్ బాగా స‌క్సెస్ అయ్యారు.

 

ఇక ఈ జిల్లా పాదయాత్రలోనే మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి,  జిల్లాలో మంచి ప‌ట్టున్న మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్,  విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరారు.  ఏప్రిల్ 16న ప్రత్యేక హోదా కోసం జరిగిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా  పాదయాత్రకు వైఎస్‌ జగన్‌ విరామమిచ్చారు.  ఏప్రిల్ 30న హోదాపై టీడీపీ మోసాన్ని ఎండగడుతూ.. వంచన వ్యతిరేక దినానికి సంఘీభావంగా నల్లరిబ్బన్లు కట్టుకుని ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఒక‌టేమిటి జ‌గ‌న్ ఈ జిల్లాలో చాలా స‌క్సెస్ అయిన‌ట్టే. 

 

ఇక జ‌గ‌న్  ఈ జిల్లా పాద‌యాత్ర‌లోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రెవ‌రు పోటీ చేస్తార‌నేదానిపై ఓ క్లారిటీ ఇచ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. కీల‌కమైన విజ‌య‌వాడ న‌గ‌రంలో వెస్ట్ సీటు నుంచి మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లికే మొగ్గు ఉంది. చివ‌రి క్ష‌ణాల్లో ఎవ‌రైనా బ‌ల‌మైన మైనార్టీ క్యాండెట్‌ను కూడా రంగంలోకి దింప‌వ‌చ్చు. సెంట్ర‌ల్ సీటు రాధాకు ఇవ్వ‌డంతో ఇక్క‌డ విష్ణు వ‌ర్సెస్ రాధా గొడ‌వ‌కు తెర‌ప‌డిందంటున్నారు. సెంట్ర‌ల్ సీటు రాధా నుంచి మార్చే విష‌యంలో జ‌గ‌న్ డేర్ చేయ‌ట్లేదు. తూర్పు సీటు ఇటీవ‌లే పార్టీలో చేరిన య‌ల‌మంచిలి రవికి ఖ‌రారైంది.

 

ఇక జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ‌లో పాత క్యాండెట్లు అయిన సామినేని ఉద‌య‌భాను, మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావే బ‌రిలో ఉంటున్నారు. మైల‌వ‌రంలో మాత్రం వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు కృష్ణ‌ప్ర‌సాద్ ఎంట్రీతో మంత్రి ఉమాకు సెగ‌లు రేగుతున్నాయి. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌కు ఆయ‌న గ‌తంలో గెలిచిన పెడ‌న సీటు ఇస్తారా ?  లేదా వేరే ఆప్ష‌న్ ఉంటుందా ? అన్న‌ది చూడాలి. తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధే ఉంటారా లేదా ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పామ‌ర్రుకు వెళితే ఇక్క‌డ మ‌రో అభ్య‌ర్థిని పోటీ చేయిస్తారా ? అన్న‌ది చూడాలి.

 

ఇక గుడివాడ‌, నూజివీడులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు బ‌రిలో ఉంటారు. గ‌న్న‌వ‌రంలో వంశీ మీద క‌మ్మ క‌మ్యూనిటీ నుంచి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు పోటీ చేస్తున్నారు. కైక‌లూరులో గ‌త ఎన్నిక‌ల్లో సీటు మిస్ అయిన కాపు వ‌ర్గానికి చెందిన దూలం నాగేశ్వ‌ర‌రావుకు సీటు ఇస్తున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. బంద‌రులో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌దే సీటు. ఇక పెడ‌న‌లో ఇన్‌చార్జ్ ఉప్పాల రాంప్ర‌సాద్ పోటీ చేస్తాడా ?   లేదా ? అన్న చిన్న డౌట్ ఉంది. మైల‌వ‌రంలో కృష్ణ‌ప్ర‌సాద్ పోటీ చేస్తుండ‌డంతో జోగి ర‌మేష్ ఇక్క‌డ సీటు ఆశిస్తున్నాడు. మ‌రి వీరిద్ద‌రిలో జ‌గ‌న్ ఇక్క‌డ ఎవ‌రిని బ‌రిలో దింపుతాడో ?  కాస్త స‌స్పెన్స్‌.

 

ఇక పామ‌ర్రులో వైసీపీ నుంచి గెలిచిన ఉప్పులేటి క‌ల్ప‌న టీడీపీలోకి జంప్ చేయ‌డంతో ఇక్క‌డ ప్ర‌స్తుతం బాధ్య‌త‌లు కైలా అనిల్‌కుమార్ చూస్తున్నారు. అయితే అనిల్ అంత బ‌ల‌మైన అభ్య‌ర్థి కాక‌పోవ‌డంతో మ‌రో అభ్య‌ర్థి కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. తిరువూరు ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధికి పామ‌ర్రు సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ర‌క్ష‌ణ‌నిధికి ఇక్క‌డ మార్చి తిరువూరులో మ‌రో క్యాండెట్‌ను చూసే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయి. ఇక గ‌త ఎన్నిక‌ల్లో బంద‌రు ఎంపీగా పోటీ చేసిన పార్థ‌సార‌థి ఈ సారి పెన‌మ‌లూరు నుంచి అసెంబ్లీకే పోటీ చేస్తాన‌ని ఘంటాప‌థంగా చెపుతున్నారు. 

 

ఇక అవనిగ‌డ్డ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే గ‌త రెండు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న సింహాద్రి ర‌మేష్ బ‌ల‌మైన క్యాండెట్‌. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఇంకా బ‌ల‌మైన అభ్య‌ర్థిని చూసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇక విజ‌య‌వాడ, బంద‌రు ఎంపీ సీట్ల‌ను ప్ర‌స్తుతానికి కోరుతున్న వారు ఎవ్వ‌రూ లేరు. బంద‌రు నుంచి మాజీ ఎంపీ బాడిగ రామ‌కృష్ణ‌ను తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇక విజ‌య‌వాడ నుంచి ప్ర‌ముఖ హీరో కృష్ణ సోద‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు పేరు వినిపిస్తోంది.

 

కృష్ణా జిల్లా వైసీపీ అభ్య‌ర్థులు ఖరారు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share