వైసీపీలో ఈ ఎమ్మెల్యేలు మహా డేంజర్

May 31, 2018 at 3:42 pm
YSRCP, MLA, Very danger, YS Jagan, most popular

రాజ‌కీయాల్లో ఎవ‌రితోనైనా పెట్టుకోవ‌చ్చు.. కానీ.. ప్ర‌జాబ‌లం ఉన్న నాయ‌కుల‌తో మాత్రం పెట్టుకుంటే మ‌టాషైపోవ‌డం ఖాయం అంటారు అనుభ‌వ‌జ్ఞు లు! ఇదేవిధంగా వైసీపీలోని దాదాపు 20 మంది ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఉంద‌ని తాజాగా స‌ర్వేలు చాటి చెబుతున్నాయి. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా విప‌క్షంలో ఉన్న ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఏంటి? వారు ఎలాగూ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధికి ఏమాత్ర‌మూ కృషి చేయ‌లేదు. పైగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంతో పోరాటానికే ఎక్కువ స‌మ‌యం వెచ్చించారు.

మ‌రి అలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చేందుకు, వారికి త‌ల‌లో నాలుక‌లా వ్య‌వ‌హ‌రించేందుకు వారికి ఎక్క‌డ స‌మ‌యం ఉంది? అనే సందేహాలు ప్ర‌ధానంగా తెర‌మీదికి వ‌స్తాయి. దీంతో ప్ర‌జ‌ల‌లో వైసీపీ ఎమ్మెల్యేల ప‌ట్ల వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది. నిజ‌న‌మే క‌దా.. దాదాపు నాలుగేళ్లుగా వారు ప్ర‌తిప‌క్షంలోనే ఉన్నారు. నిజానికి ఎమ్మెల్యేకు చ‌ట్ట‌బ‌ద్ధంగా క‌ల్పించ‌బ‌డిన నిధుల విష‌యంలో కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వైసీపీ ఎమ్మెల్యేలైతే.. ఒక విధంగా.. టీడీపీ ఎమ్మెల్యేలైతే మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌. దీంతో వారికి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి నిధులు కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ క్ర‌మంలో వారు నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద‌గా తిరిగేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఒక‌వేళ నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగినా.. ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్ట‌డం ఖాయం. త‌మ వ‌ద్దా నిధులు లేవు. దీంతో ఏం చేయాలి? అందుకే చాలా మంది విప‌క్ష ఎమ్మెల్యేలు త‌ప్పించుకుని తిరుగుతున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది.. ఇంకా సాగుతోంది కూడా! దీంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చుక్క‌లు చూపిస్తార‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ, ఇక్క‌డ సీన్ క‌ట్ చేస్తే.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు విప‌క్షంలో ఉన్నా కూడా ప్ర‌జ‌లు వారికే బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

వారి అభివృద్ధి చేయ‌క‌పోయినా.. ప్ర‌జ‌లు అర్ధం చేసుకుంటున్నారు. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉంటే చాల‌ని అనుకుంటున్నారు. మ‌రి ఎందుక‌లా ప‌రిస్థితి ఏర్ప‌డింది? అభివృద్ధి చేయ‌క‌పోయినా.. వారినే ఎందుకు ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు? అనే ప్ర‌శ్న‌లు స‌ర్వ‌సాధార‌ణం! ఈ విష‌యానికే వ‌స్తే.. వైసీపీలో ఉన్న ప్ర‌స్తుత సిట్టింగులు గ‌తంలో కాంగ్రెస్ నుంచి వ‌చ్చి వ‌చ్చిన‌వారే. గ‌తంలో వీరు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌ను అభివృద్ధి చేసుకున్నారు. ప్ర‌జ‌ల్లో క‌లివిడిగా తిరిగారు. వారికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. మేమున్నామంటూ ముందుకు వెళ్లారు. అప్ప‌టి ఆ ముద్ర నేటికీ చెరిగిపోలేదు. అదే ఇప్పుడు కూడా కొన‌సాగుతోంది.

ఇలా దాదాపు 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌ను మ‌ళ్లీ గెలిపించేందుకు రెడీ అవుతున్నారు. త‌మ నాయ‌కుల‌పై న‌మ్మ‌కం ఉంద‌ని చాటుతున్నారు. అధికార పార్టీ త‌ర‌ఫున ఈ 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి వారు నిల‌బ‌డ్డా కూడా ఓడించి తీరుతామ‌ని అంటున్నారు. మ‌రి అంత‌గా ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొన్న‌ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రో చూద్దామా….

వైఎస్ జ‌గ‌న్‌.. పులివెందుల-క‌డ‌ప‌
మేకా ప్ర‌తాప్ అప్పారావు- నూజివీడు-కృష్ణా
కొడాలి నాని-గుడివాడ‌-కృష్ణా
ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి-మంగ‌ళ‌గిరి-గుంటూరు
ముస్త‌ఫా-గుంటూరు ఈస్ట్‌-గుంటూరు
గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి-న‌ర‌స‌రావుపేట‌-గుంటూరు
పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి-మాచ‌ర్ల‌-గుంటూరు
మేక‌పాటి గౌంతం రెడ్డి-ఆత్మ‌కూరు-నెల్లూరు
కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి-నెల్లూరు రూర‌ల్‌-నెల్లూరు
కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి-స‌ర్వేప‌ల్లి-నెల్లూరు
గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి-రాయ‌చోటి-క‌డ‌ప‌
రాచ‌మ‌ల్లు ప్ర‌సాద్‌రెడ్డి-ప్రొద్దుటూరు-క‌డ‌ప‌
గౌరు చ‌రితా రెడ్డి-పాణ్యం-క‌ర్నూలు
బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి-డోన్‌-క‌ర్నూలు
వై.సాయి ప్ర‌సాద్‌రెడ్డి-ఆదోని- క‌ర్నూలు
వై.విశ్వేశ్వ‌ర‌రెడ్డి-ఉర‌వ‌కొండ‌-అనంత‌పురం
పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి-పుంగ‌నూరు-చిత్తూరు
చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి-చంద్ర‌గిరి-చిత్తూరు

వైసీపీలో ఈ ఎమ్మెల్యేలు మహా డేంజర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share