అక్క‌డ జ‌గ‌న్‌కు స‌రైనోడు దొరికాడు… టీడీపీ ప‌ని అవుటే..!

August 4, 2018 at 3:45 pm
YSRCP, YS Jagan, Paderu, Dr Adapa Kirshna naidu, MLA candidate

ఆ ప్రాంతంలో వైసీపీకి స‌రైన అభ్య‌ర్థి దొరికాడు.. ఇక టీడీపీకి తిప్ప‌లు త‌ప్పేలా లేదు.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఫిరాయింపుల‌కు తెర‌లేపిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. డాక్ట‌ర్‌గా రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి గుర్తింపు పొందిన ఆ యువ‌నాయ‌కుడికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు కేటాయించేంద‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ను బ‌రిలోకి దింపితే… వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడడం.. వైసీపీ గెల‌వ‌డం ఖాయ‌మ‌నే ఆలోచ‌న‌లో పార్టీ అధిష్టానం ఉన్న‌ట్లు స‌మాచారం. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను బ‌రిలోకి దింపి మ‌ళ్లీ స‌త్తాచాటడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇంత‌కీ ఏమిటా ప్రాంతం..? ఎవ‌రా నాయ‌కుడు అని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు ఈ ఆస‌క్తిక‌ర‌మైన‌ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే.

2014 ఎన్నిక‌ల్లో విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ స‌త్తాచాటింది. అర‌కు పార్ల‌మెంటు స్థానంతోపాటు అర‌కు, పాడేరు, మాడుగుల అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. అయితే, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో అరకు – పాడేరు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు , గిడ్డి ఈశ్వరిలు టీడీపీ గూటికి చేరారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్ర‌స్తుతం ఏ పార్టీలో ఉన్నారో ఎవ‌రికీ తెలియ‌దు. ఈ నేప‌థ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీకి కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అయితే, ఇక్క‌డ మ‌ళ్లీ స‌త్తాచాటేందుకు బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం వెదుకుతున్న‌స‌మ‌యంలో ఆయ‌నొక పేరు ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలిసింది. ఆంధ్రయూనివర్సిటీ మెడికల్ కాలేజిలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ అడపా రామకృష్ణ నాయుడిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దింపాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున‌ట్లు స‌మాచారం.

ys jagan_8486

ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో రామకృష్ణ నాయుడికి మంచి గుర్తింపు ఉంది. కేజీహెచ్ లో రుమటాలజీ విభాగంలో వైద్యుడిగా ప‌నిచేస్తున్న ఆయ‌న పాడేరు నుంచి వైద్యం కోసం వ‌చ్చే వారికి ఆదుకుంటార‌నే టాక్ ఉంది. ఆయ‌న తండ్రి బొంజు నాయడు ఇప్పటికే వైసీపీలో కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆదివాసీ వికాస పరిషత్ రాష్ట్ర కన్వీనర్ గా బొంజునాయుడు ప‌నిచేశారు. గ‌త‌ ఎన్నికల్లో గిడ్డి ఈశ్వరి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈశ్వరిది – వీరిది గిరిజనుల్లో ఒకే తెగ‌ కావడంతో ఆ వర్గం ఓట్లు గిడ్డి ఈశ్వరికి పోకుండా రామ‌క‌`ష్ణ‌నాయుడిని రంగంలోకి దింపాల‌న్న జ‌గ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తండ్రితో క‌లిసి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో చురుగ్గా ప‌ర్య‌టిస్తున్నారు. అయితే పాడేరు, అర‌కు అసెంబ్లీ స్థానాల‌తోపాటు అర‌కు ఎంపీ స్థానంలోనూ ఆయ‌న పేరును జ‌గ‌న్ ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అక్క‌డ జ‌గ‌న్‌కు స‌రైనోడు దొరికాడు… టీడీపీ ప‌ని అవుటే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share