భారీ ప్లాప్ డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన ప్ర‌భాస్‌..!

July 1, 2017 at 6:38 am
Prabas

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి 2 దెబ్బ‌తో ఎవ్వ‌రికి అంద‌నంత ఎత్తుకు వెళ్లిపోయాడు. బాహుబలి 2తో ప్ర‌భాస్ జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ ఇప్పుడు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ డైరెక్ష‌న్‌లో సాహో సినిమాలో న‌టిస్తున్నాడు. రూ. 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నాలుగు భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్‌తోనే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తేలిపోయింది.

సాహో సినిమాతో ప్ర‌భాస్ బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఇక ఈ సినిమా త‌ర్వాత కూడా ప్ర‌భాస్ ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్‌జోహార్‌తో మూడు సినిమాల‌కు కూడా క‌మిట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ ప్రాజెక్టును ఓ డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌కు క‌మిట్ అయిన‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆ డైరెక్ట‌ర్ ప్ర‌భాస్‌కు పెద్ద ప్లాప్ ఇచ్చాడు. అత‌డు ఎవ‌రో కాదు డ్యాన్స్ డైరెక్ట‌ర్ కం యాక్ట‌ర్ కం డైరెక్ట‌ర్ ప్ర‌భుదేవా. ప్రభుదేవా – ప్రభాస్ కాంబినేషన్‌లో ఇంత‌కు ముందు వ‌చ్చిన ‘పౌర్ణమి’ సూప‌ర్ ప్లాప్ అయ్యింది. ఇక ప్ర‌భాస్ – త‌న కాంబోలో సినిమా ఫిక్స‌య్యింద‌న్న విష‌యాన్ని ప్ర‌భుదేవా బ‌య‌ట చెపుతున్నాడ‌ట‌. మ‌రి అంత ప్లాప్ ఇచ్చిన ప్ర‌భుదేవాతో ఇప్పుడు భీక‌ర ఫాంలో ఉన్న ప్ర‌భాస్ సినిమాకు ఎలా క‌మిట్ అయ్యాడా ? అన్న సందేహాలు కూడా కొంద‌రికి క‌లుగుతున్నాయి.

 

భారీ ప్లాప్ డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన ప్ర‌భాస్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts