దారుణంగా ప‌డిపోయిన మోదుగుల గ్రాఫ్‌

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో టీడీపీ త‌ర‌పున న‌రసారావుపేట ఎంపీగా పోటీ చేసి త‌క్కువ మెజార్టీతో గెలిచి ల‌క్‌గా ఎంపీ అయిన మోదుగుల గ‌త ఎన్నిక‌ల్లో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కోసం త‌న సిట్టింగ్ సీటును వ‌దులుకుని గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించారు. మంత్రి అవుతాన‌ని మూడేళ్లుగా క‌ల‌లు కంటోన్న మోదుగులకు ప్ర‌క్షాళ‌న‌లో చంద్ర‌బాబు షాక్ ఇచ్చారు. దీంతో మోదుగుల బాబు అన్నా, టీడీపీ అధిష్టానం అన్నా తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. ఈ మూడేళ్ల పాల‌న‌లో మోదుగుల ప్ల‌స్‌లు, మైన‌స్సులు ఏంటో ఆయ‌న ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో చూద్దాం.

మూడేళ్ల పాటు మోదుగుల ఎమ్మెల్యేగా చేసిందేమి లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న మాట కూడా చెల్ల‌బాటు కావ‌డం లేదు. కీల‌క‌మైన మిర్చి యార్డు, స్టేడియం పాల‌క‌వ‌ర్గాల క‌మిటీల ఎంపిక విష‌యంలో స్థానిక ఎమ్మెల్యే మోదుగుల కంటే మంత్రి ప్ర‌త్తిపాటిదే పైచేయి అయ్యింది. అప్ప‌టి నుంచి ఆయ‌న టీడీపీలో ఇమ‌డ‌లేక‌పోతున్నారు. ఇటీవ‌ల సెటిల్మెంట్లు చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి.

ప‌ల్నాడు నుంచి వ‌చ్చి సిటీ ఎమ్మెల్యే అయిన మోదుగుల ఇప్ప‌ట‌కీ నియోజ‌క‌వ‌ర్గంలో స‌రైన ప‌ట్టు సాధించ‌లేక‌పోయారు. అభివృద్ధిలో అండ‌ర్ వాట‌ర్ డ్రైనేజ్ ప‌నులు మిన‌హా మిగిలిన‌వి చెప్పుకోద‌గ్గ స్థాయిలో జ‌ర‌గ‌లేదు. ఇక క‌మిష‌న‌ర్ నాగ‌ల‌క్ష్మితోను ఆయ‌న‌కు స‌ఖ్య‌త లేదు. మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో ఆయ‌న పార్టీ మార‌తార‌న్న ఊహాగానాలు జోరుగా వినిపించాయి.

ఎంపీగా స‌మైక్యాంధ్ర మూమెంట్ టైంలో పార్ల‌మెంటులో అదిరిపోయే రేంజ్‌లో ఫైటింగ్ చేసి హీరోగా నిలిచిన మోదుగుల‌కు ఇప్ప‌ట‌కీ మోదుగుల‌కు అస్స‌లు సంబంధం లేదు. మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో ఇత‌రుల పెత్త‌నంతో ఆయ‌న‌లో నైరాశ్యం ఎక్కువైంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి సైతం ఆయ‌న యాంటీగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ విష‌యం చంద్ర‌బాబు దృష్టికి కూడా వెళ్లింది.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– మోదుగుల‌పై చంద్ర‌బాబుకు కాస్త ఇంట్ర‌స్ట్ ఉండ‌డం

– రెడ్డి సామాజిక‌వ‌ర్గం నుంచి జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే

– నియోజ‌క‌వ‌ర్గంలో అండ‌ర్ వాట‌ర్ డ్రైనేజ్ ప‌నులు స్పీడ‌ప్‌

మైన‌స్ పాయింట్స్ (-):

– చంద్ర‌బాబుతో పాటు పార్టీపై కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు

– మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుతో తీవ్ర విబేధాలు

– నియోజ‌క‌వ‌ర్గంలో కొంద‌రికే ప్ర‌యారిటీ ఇవ్వ‌డం

– గ‌త ఎన్నిక‌ల్లో ఓట్లు వేయని వ‌ర్గాల‌ను ద‌గ్గ‌ర‌కు తీసి…ఓట్లు వేసిన వారిని దూరం పెట్ట‌డం

– జిల్లాలో ఎక్కువ మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌ఖ్య‌త లేక‌పోవ‌డం

– గుంటూరు న‌గ‌ర క‌మిష‌న‌ర్ నాగ‌ల‌క్ష్మితో పొస‌గ‌క‌పోవ‌డం

– వైసీపీలోకి వెళ‌తార‌న్న గుస‌గుస‌లు

– ఎంపీగా ఉన్న‌ప్పుడితో పోల్చుకుంటే దారుణంగా ప‌డిపోయిన గ్రాఫ్‌

తుది తీర్పు:

2009లో న‌ర‌సారావుపేట ఎంపీగా గెలిచిన ఐదేళ్ల‌లో మోదుగుల‌కు ఉన్న‌ప్ప‌టి క్రేజ్‌తో పోల్చుకుంటే ప్ర‌స్తుతం ఆయ‌న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఈ మూడేళ్ల‌లో ఆయ‌న గ్రాఫ్ చాలా ప‌డిపోయింది. మంత్రి ప‌దవి రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబుతో పాటు టీడీపీపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో ఇటీవ‌ల పార్టీ అధిష్టానంతో ఆయ‌న‌కు గ్యాప్ పెరిగింది.

ఇక మోదుగుల బావ అయోధ్య రామిరెడ్డి వైసీపీలో ఉండ‌డంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం కూడా ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు చంద్ర‌బాబు గుంటూరు వెస్ట్ సీటు ఇస్తారా ? ఇవ్వ‌రా ? అన్న‌ది ప్ర‌స్తుతానికి అయితే సందేహ‌మే. మ‌రో టాక్ ఏంటంటే చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు వెస్ట్ సీటు నుంచి మోదుగుల‌ను త‌ప్పించి ఆయ‌న ప‌ల్నాడులోని ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా బ‌రిలో దింపొచ్చ‌న్న ప్ర‌చారం గుంటూరు జిల్లాలో జోరుగా జ‌రుగుతోంది.