టాప్ లేపిన చైతు: ” రారండోయ్ ” ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌

అక్కినేని నాగచైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఫ‌స్ట్ వీక్ అదిరిపోయే క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. సినిమాకు అనుకున్న స్థాయిలో టాక్ రాక‌పోయినా చైతు త‌న కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. చైతు – స్టార్ హీరోయిన్ సమంతల ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌డం కూడా సినిమాకు బాగా క‌లిసొచ్చిన‌ట్ల‌య్యింది.

ఫ‌స్ట్ వీక్ ముగిసేస‌రికి రారండోయ్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.30 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక సినిమా షేర్ రూ 17.43 కోట్లు. ఏరియాల వారీగా చూస్తే వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

ఉత్తరాంధ్ర – 2.2 కోట్లు

ఈస్ట్ – 1.24 కోట్లు

వెస్ట్ – 89 లక్షలు

కృష్ణా – 1.14 కోట్లు

గుంటూరు – 1.21 కోట్లు

నెల్లూరు – 42 లక్షలు

సీడెడ్ – 1.98 కోట్లు

నైజం – 5.16 కోట్లు

కర్ణాటక – 1.35 కోట్లు

యూఎస్ఏ – 1.34 కోట్లు