‘ రాజా ది గ్రేట్ ‘ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్‌

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ దీపావ‌ళి కానుక‌గా బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌వితేజ రెండేళ్ల త‌ర్వాత వెండితెర‌పై క‌నిపించ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ముందునుంచి భారీ అంచ‌నాలు ఉన్నాయి. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించ‌డంతో పాటు ప‌టాస్‌, సుప్రీమ్ సినిమాల డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో సినిమాపై ముందునుంచే పాజిటివ్ అంచ‌నాలు ఉన్నాయి.

భారీ అంచ‌నాల మ‌ధ్య భారీ ఎత్తున రిలీజ్ అయిన రాజా ది గ్రేట్ తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఏపీ, తెలంగాణ‌లో సుమారు రూ.5 కోట్ల పైగానే షేర్ వసూలు చేసింది. రాజా ది గ్రేట్ ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ షేర్ డీటైల్స్ ఇలా ఉన్నాయి.

నైజాం – 1.95 (రూ.కోట్ల‌లో)

సీడెడ్ – 0.76

ఉత్త‌రాంధ్ర – 0.60

వెస్ట్ – 0.30

ఈస్ట్ – 0.40

కృష్ణా – 0.29

గుంటూరు – 0.50

నెల్లూరు – 0.22

—————————————————

ఏపీ+తెలంగాణ ఫ‌స్ట్ డే షేర్ = 5.02 కోట్లు

—————————————————

ఇక తొలి రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.10 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా తొలిరోజు వ‌సూలు చేసింద‌ని స‌మాచారం. ఈ రోజు దీపావ‌ళి కావ‌డంతో రెండో రోజుతో పాటు భారీ లాంగ్ వీకెండ్ రావ‌డం కూడా సినిమాకు క‌లిసిరానుంది.