బాహుబ‌లి 2కు స‌వాల్ విసురుతోందిగా…

బాహుబలి–2 చిత్రం ఇండియన్‌ సినిమాలోనే ఒక సంచలనం. భార‌తీయ సినిమాతో పాటు ప్ర‌పంచ సినిమాను సైతం మ‌న‌వైపు చూసేలా చేసిన ఘ‌న‌త ఈ సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమా డైరెక్ట‌ర్ మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికే ద‌క్కింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు స‌వాల్ విసిరేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంద‌న్న చ‌ర్చ‌లు ఇండియ‌న్ సినిమా ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

బాహుబ‌లి 2 టోట‌ల్ క‌లెక్ష‌న్ల‌ను దంగ‌ల్ దాటేసినా అది చైనా మార్కెట్‌లోనే రూ.1200 కోట్ల వ‌సూళ్లు సాధించింది. చైనా మార్కెట్‌ను త‌ప్పిస్తే బాహుబ‌లి 2 ముందు దంగ‌ల్ ఎందుకు స‌రిపోదు. ఇక ఇప్పుడు ఓ సినిమా ఇండియ‌న్ మార్కెట్‌లోనే బాహుబ‌లి 2కు స‌వాల్ విసిరేలా క‌నిపిస్తోంది.

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న రోబో 2.0 సినిమాపై ఇప్పుడు లెక్క‌కు మిక్కిలిగా ఇండియ‌న్ సినిమా వ‌ర్గాల్లో అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తుండ‌డంతో సౌత్‌తో పాటు నార్త్‌లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి.

సినిమాను సాంకేతికంగా హాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా ఉండేలా తెర‌కెక్కిస్తోన్న శంక‌ర్ ఆ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌. ఇక 2.0 సినిమాను ఎట్ట‌కేల‌కు వ‌చ్చే జ‌న‌వ‌రిలో రిలీజ్ చేసేందుకు శంక‌ర్ టీం స‌న్నాహాలు చేస్తోంది. ఇక బాహుబ‌లి 2 రికార్డుల‌ను టార్గెట్ చేసిన శంక‌ర్ 2.0 సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 15భాషల్లో, 7వేల థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్‌.రెహ్మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా శాటిలైట్ హ‌క్కులే ఏకంగా రూ. 110 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. ఏదేమైనా బాహుబ‌లి 2కే స‌వాల్ విసురుతోన్న రోబో 2.0 క‌లెక్ష‌న్ల‌లో బాహుబ‌లి 2ను ఎంత వ‌ర‌కు బీట్ చేస్తుందో చూడాలి.