‘ రాజు గారి గ‌ది 2 ‘ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్ సూప‌ర్‌

బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్ ఓంకార్ దర్సకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది-2’ చిత్రం శుక్ర‌వారం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఓంకార్ డైరెక్ట్ చేసిన ‘రాజుగారి గది’ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్‌గా రాజు గారి గ‌ది 2 పేరుతో ఈ సినిమా రావ‌డంతో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు పీవీపీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు ఈ సినిమాను నిర్మించ‌డంతో పాటు నాగార్జున‌, స‌మంత న‌టించ‌డంతో మామ‌కోడ‌ళ్ల ఫ్యాక్ట‌ర్ కూడా బాగా క‌లిసొచ్చింది.

ఇక మామాకోడ‌ళ్ల ఫ్యాక్ట‌ర్, ఓంకార్ డైరెక్ష‌న్‌తో పాటు టీజ‌ర్లు, ట్రైల‌ర్ల ఎఫెక్ట్‌తో ఈ సినిమాకు మంచి ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జ‌రిగింది. ఈ క్రేజ్ వల్లనే సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. విడుదలైన అన్ని చోట్ల సినిమా దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. యూఎస్‌లో రాజు గారి గ‌ది 2 సినిమా 80,000 డాలర్ల ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ఈ సినిమాకు ఇది మంచి ప్రారంభ‌మే. ఈ వీకెండ్ పెద్ద సినిమాలేవి లేక‌పోవ‌డంతో రాజు గారి గ‌ది 2 మరిన్ని భారీ వ‌సూళ్లు ద‌క్కించుకోవ‌డం ఖాయం.