చెర్రీ ” రంగ‌స్థ‌లం ” రేటు ఎక్కువే

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ – క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతోన్న రంగ‌స్థ‌లం 1985 సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ భారీ రేటుకు దాదాపు క్లోజ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కు రూ. 16 కోట్లు ప‌లికిన‌ట్టు…ఈ రేటుకే కాస్త అటూ ఇటూగా డీల్ ఓకే అయిన‌ట్టు స‌మాచారం.

చెర్రీ సినిమాల‌కు మార్కెట్ మ‌హా అయితే ఇటీవ‌ల కాలంలో రూ.40 కోట్ల‌కు మించ‌డం లేదు. చెర్రీ గ‌త నాలుగైదు సినిమాలు రూ.40 కోట్ల షేర్ దగ్గ‌రే ఆగిపోతున్నాయి. ధృవకు కూడా లాభాలు అయితే రాలేదు. ఈ టైంలో చెర్రీ రంగ‌స్థలంకు రూ. 16 కోట్ల రేటు అంటూ మామూలు విష‌యం కాదు.

ఇక వెన‌కాల సుకుమార్ బ్రాండ్ ఉండ‌డం, ఓవ‌ర్సీస్‌లో సుకుమార్‌కు క్రేజ్ ఉండ‌డం, గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో పాటు సినిమా లైన్ చాలా కొత్త‌గా ఉంద‌నే ఇంత భారీ రేటు పెట్టి ఓ ప్ర‌ముఖ ఛానెల్ శాటిలైట్ రైట్స్ ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు టాక్‌.

చెర్రీ – స‌మంత – సుకుమార్ – దేవిశ్రీ ఇలా అంతా భారీ కాస్టే. అందుకే సినిమాకు 70 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.