ప‌వ‌న్ కోసం కీల‌క‌మైన త్యాగం చేస్తున్నారాంచ‌ర‌ణ్

July 25, 2017 at 7:52 am
telugujournalist,pawan and cherri

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 2019 ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం మాత్ర‌మే ఉంది. ఈ లోగా ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ మ‌రో రెండు సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత నీశ‌న్‌, సంతోష్ శ్రీనివాస్ సినిమాలు ప‌ట్టాలెక్కించాల్సి ఉంది. 

ప‌వ‌ర్ సినిమా కెరీర్ ప‌రంగా వ‌రుస ప్లాపుల్లో ఉన్నాడు. త్రివిక్ర‌మ్ సినిమా ప‌వ‌న్ కెరీర్‌కు, అటు జ‌న‌సేన‌కు మంచి ఊపునిస్తుంద‌న్న అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను ప‌వ‌న్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేసేందుకు త్రివిక్ర‌మ్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ మ్యాట‌ర్ లీక్ అవ్వ‌డంతో మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ఇప్పుడు సందిగ్ధంలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చెర్రీ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ను సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించారు. బాబాయ్ ప‌వ‌న్ కెరీర్‌కు ప్రెస్టేజియ‌స్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుండ‌డంతో ఇప్పుడు ప‌వ‌న్ కోసం చెర్రీ త్యాగం చేసేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌.

బాబాయ్ సినిమా సంక్రాంతికి వ‌స్తుండ‌డంతో త‌న సినిమాను క్రిస్మ‌స్‌కే రిలీజ్ చేయాల‌ని త‌న సినిమా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌పై చెర్రీ ప్రెజ‌ర్ చేస్తున్నాడ‌ట‌. ఏదేమైనా ప‌వ‌న్ కోసం చెర్రీ కీల‌క‌మైన సంక్రాంతి సీజ‌న్‌ను త్యాగం చేస్తున్నాడు.

ప‌వ‌న్ కోసం కీల‌క‌మైన త్యాగం చేస్తున్నారాంచ‌ర‌ణ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts