టాలీవుడ్లో ప్రస్తుతం స్టిల్ క్యారెక్టర్లతో పాటు బయోపిక్‌లను బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి. టాలీవుడ్లో కొద్ది రోజులుగా ఈ తరహా సినిమాలు ఎక్కువవుతున్నాయి. బయోపిక్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన రియలిస్టిక్ సినిమాల పరంపరలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక మరోవైపు తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ హీరోగా మరో బయోపిక్ వస్తోంది. రెండూ ఎన్టీఆర్ బయోపిక్‌లే అయినా వీటి కథాంశాలు మాత్రం వేరుగా ఉంటాయన్నది కన్ఫార్మ్. ఇదిలా ఉంటే తెలుగు ప్రజలకు పరిటాల ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉంది. పేదల కోసం పోరాటాలు చేసిన దివంగత మాజీ మంత్రి పరిటాల రవి మరణాంతరం ఆయన సతీమణి సునీత రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఉన్నారు.
ఇదిలా ఉంటే నారా రోహిత్ హీరోగా బాలకృష్ణుడు అనే ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా బయోపిక్ కాకపోయినా పరిటాల రవి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తోన్న ఓ కల్పిత కథ అని టాక్. ఈ సినిమాలో గతంలో పరిటాల రవి కిడ్నాప్ అయినప్పుడు భార్య సునీత ఎలాంటి ఫైట్ చేసి తన భర్తను విడిపించుకుంది. అన్న లైన్ ఉందట.
ఇందులో రవిని కిడ్నాప్ చేసే క్యారెక్టర్లో నారా రోహిత్ నటిస్తుంటే రవి భార్య సునీత క్యారెక్టర్ మన శివగామి రమ్యకృష్ణ చేస్తున్నారట. ఈ సినిమాలో రోహిత్ వర్సెస్ రమ్యకృష్ణ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు అదిరిపోయే రేంజ్లో ఉంటాయని తెలుస్తోంది. ఏదేమైనా టాలీవుడ్లో మరో ఇంట్రస్టింగ్ కథాంశంతో బాలకృష్ణుడు సినిమా రెడీ అవుతోంది. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.