ఆ సన్నివేశం దగ్గర నేను కన్నీరు ఆపుకోలేక పోయా

రజినికాంత్ నరసింహ సినిమాలో రజిని కి దీటుగా విలన్ పాత్రలో ‘నీలాంబరి’గా తెలుగు, తమిళ ప్రేక్షకుల మదిలో స్థానాన్ని రమ్యకృష్ణ సంపాదించిఒచుకుంది. ఇప్పుడు బాహుబలి పేరు చెప్తే దేశవ్యాప్తంగా ‘శివగామి’ అని పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్రలో లీనమైపోయింది రమ్యకృష్ణ. ‘నా మాటే శాసనం’ అంటూ ఒకవైపు రాజసం ప్రదర్శిస్తూనే సెంటిమెంట్‌ను కూడా అద్భుతంగా పండించి తనదైన ముద్ర వేసింది. వెయ్య కోట్లు కొల్లగొట్టిన ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాలో  రమ్యకృష్ణ కు ఓ సీన్‌ ఏడుపు తెప్పించిందట. ఆ సీన్‌లో నటిస్తున్నప్పుడు కంటే తెరపై చూస్తున్నప్పుడే ఎక్కువ భావోద్వేగానికి గురైందట రమ్యకృష్ణ.

బాహుబలిని చంపిన తర్వాత శివగామి వద్దకు కట్టప్ప వచ్చి కొడుకు బల్లాల దేవా చేసిన తప్పులను జరిగిన నిజాలను చెప్పే సన్నివేశాలు రమ్యకృష్ణను కంటతడి పెట్టించాయట. నేను నేపథ్య సంగీతం లేకుండా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రదర్శనలో సినిమా చూశా. శివగామి వద్దకు కట్టప్ప వచ్చి నిజాలను వెల్లడించే సన్నివేశాలు వచ్చినపుడు నాకు ఏడుపు వచ్చేసింది. ఈ సీన్‌ ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది అయినప్పటికీ.. అందులో నాకు ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు. ఆ సీన్‌ రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిదర్శమ’ని చెప్పింది రమ్యకృష్ణ.