” రారండోయ్ వేడుక చూద్దాం ” ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

అక్కినేని హీరో నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చైతు – ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు చైతు కెరీర్‌లోనే ఫ‌స్ట్ డే బెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి.

ఈ సినిమా ఏపీ+తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే రూ 3.40 కోట్ల షేర్ రాబ‌ట్టింది. నాగ‌చైత‌న్య సినిమాల‌కు తొలి రోజు ఇంత పెద్ద షేర్ రావ‌డం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. చైతు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ప్రేమమ్ చిత్రం కన్నా ఈ చిత్రం తొలిరోజు అధిక వసూళ్లని సాధించడం విశేషం.