‘ రాజా ది గ్రేట్ ‘ సెన్సార్ రిపోర్ట్‌…. టాక్ వ‌చ్చేసింది

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కెరీర్ గ‌త ఆరేడేళ్లుగా అస్త‌వ్య‌స్తంగా ఉంది. ఆరేడు వ‌రుస ప్లాపుల త‌ర్వాత బ‌లుపు, ప‌వ‌ర్ లాంటి యావ‌రేజ్‌లు ఇచ్చిన ర‌వితేజ ఆ త‌ర్వాత కిక్ 2 లాంటి ఘోర‌మైన డిజాస్ట‌ర్‌, బెంగాల్ టైగ‌ర్ లాంటి ప్లాప్ ఇచ్చాడు. ఓ ర‌కంగా జ‌నాలు ర‌వితేజ సినిమాల‌ను మ‌ర్చిపోయారు కూడా. ఎప్పుడో రెండేళ్ల క్రితం దీపావ‌ళికి బెంగాల్ టైగ‌ర్‌గా వ‌చ్చిన మ‌నోడు ఇప్పుడు మ‌ళ్లీ దీపావ‌ళికే రాజా ది గ్రేట్‌తో రానున్నాడు.

ఇక దీపావ‌ళి కానుక‌గా బుధ‌వారం ఈ నెల 18న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి U / A స‌ర్టిఫికేట్ తెచ్చుకుంది. ర‌వితేజ పూర్తి స్థాయి అంధుడిగా న‌టించిన ఈ సినిమాను ప‌టాస్ – సుప్రీమ్ లాంటి వ‌రుస హిట్ సినిమాలో మాంచి జోరుమీదున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌డంతో మంచి అంచ‌నాలు ఉన్నాయి.

ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్ క్రియేష‌న్ మీద నిర్మించ‌డం, మంచి ప్రి రిలీజ్ బిజ‌నెస్ జ‌ర‌గ‌డం, వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్ గోల్డెన్ గ‌ర్ల్‌గా పేరున్న మెహ్రిన్ కౌర్ పిర్జాదా హీరోయిన్‌గా చేయ‌డంతో సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది. సాయి కార్తీక్ సంగీతం అందించారు.

ఇక సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ టాక్ వ‌చ్చింది. ర‌వితేజ అంధుడిగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడ‌ని, ఇక మెహ్రిన్ అందాలు, నిర్మాణ విలువ‌లు, ఫైట్లు, అనిల్ డైరెక్ష‌న్ బాగుంద‌ని సెన్సార్ బోర్డు కితాబిచ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి రాజా అస‌లు స‌త్తా 18న తేలిపోనుంది.