చింతమనేని అలక వెనుక..అదే రహస్యం

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మంత్రి పదవి రాకపోవడం తో అలక పాన్పు పై నుండి దిగక పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తనకు పదవి రాకపోవడం కంటే తన చిరకాల ప్రత్యర్థి,తన రాజకీయ ఎదుగుదలకు అడుగడునా అడ్డు తగిలిన పైడికొండల మాణిక్యాల రావు ని కాబినెట్ బెర్త్ లో కూర్చోబెట్టడం తో చింతమనేని ఆగ్రహం కట్టలు తెచ్చుకుందట.ఏంటి ఇదంతా నిజమే..ఇసుక మాఫియాలో..వనజాక్షి విషయం లో బాబు గోరు నీకంత చేస్తే ఇదేనా చింతమేనేని స్వామి భక్తి అనుకుంటున్నారా..

ఎమ్మెల్యే పదవికి రాజీనామా,సొంత పార్టీ ఏర్పాటు అంటూ హడావిడిగా ప్రకటించడం..ఆ మరుసటిరోజు తాను పార్టీ కి విధేయుడిగా కొనసాగుతానంటూ లేఖ రాయడం తెలిసిందే.అయితే తాజాగా తానూ ఇంకా పూర్తి గా అలక పాన్పు దిగలేదన్నట్టు తనకున్న నలుగురి గన్మెన్ లో ఇద్దరినీ వెనక్కి పంపించేశాడు.తనకు ప్రజలే రక్షణ అంటూ ఈ గాంధేయవాది చెప్పుకు రావడం కొసమెరుపు.

అయితే ఈ మొత్తం వ్యవహారం లో చంద్ర బాబు పాత్ర పై సందేహాలు వ్యక్త మవుతున్నాయి.వన్ మాన్ షో గా టీడీపీ లో చక్రం తిప్పే బాబు..ఓ చిన్న పాటి కాబినెట్ విస్తరణకే బోండా,చింతమనేని లాంటి వాళ్లంతా ఇలా ఫైర్ అవ్వడం అంత నమ్మ శక్యంగా లేదు.ఇదంతా ఓ పద్ధతి ప్రకారం ముందుగా గీసిన స్కెచ్ లో భాగంగానే జరుగుతోందనిపించక మానదు.ఫిరాయింపు ఎమ్మెల్యే లకు మంత్రి పదవుల అంశం రాష్ట్రం దాటి ఢిల్లీకి తాకే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి దాని మరుగున పడేసే మరో అంశమే ఈ అసంతృప్తి సెగలన్న మాట.

మొదటి రోజు ఈ ఫిరాయింపుల అంశం భగ్గుమంటుంది కాబట్టి అనేక మంది చే ఈ అసంతృప్తి గళం వినిపించి ఎలాగూ తన అను ‘కుల’ భజ మీడియా వుంది కాబట్టి మిగిలిన కార్యాన్ని వారే పూర్తి చేస్తారు.ఇక ఆ తరువాత పురంధ రేశ్వరి లేక,జగన్ రాష్ట్ర పతిని కలుస్తుండడం ఇవన్నీ హై లైట్ కాకుండా ప్రభాకర్ లాంటి వాళ్ళని అవసరమైనప్పుడు మల్లి అలక పాన్పు ఎక్కించేస్తుంటారు.ఈ భజన మీడియా లో ఎప్పటి లాగే టీడీపీ లో భగ్గుమన్న అసంతృప్తి సెగలు అంటూ కవర్ పేజీ కలరింగ్ ఇచ్చేస్తుంటారు.స్కెచ్ అదుర్స్ కదూ..మీడియా ముసుగులో చేస్తున్న ఈ రాజకీయ వ్యభిచారం సాధారణ సగటు ఓటరు పసిగట్టలేడనుకోవడం బాబు మూర్ఖత్వమే.