కూక‌ట్‌ప‌ల్లిలో కృష్ణారావుకు అందుకే షాకిచ్చారా?!

కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే.. మాధ‌వ‌రం కృష్ణారావు కు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరుంది. గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరు ప‌డ్డారు. అయితే, కొన్ని పొలిటిక‌ల్ రీజ‌న్స్ వ‌ల్ల ఆయ‌న టీఆర్ ఎస్‌లో కి జంప్ చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇటీవ‌ల టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన స‌ర్వేలో కృష్ణారావు మార్కులు త‌గ్గిపోయాయి. వాస్త‌వానికి ఆయ‌నకు ప్ర‌జ‌ల్లో మంచి మార్క‌లు ఉండ‌గా.. కేసీఆర్ స‌ర్వేలో మాత్రం ఎందుకు మార్క‌లు త‌గ్గాయి? అనేది ఇప్పుడున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

దీనికి కూడా స‌మాధానం దొరికిందంటున్నారు విశ్లేష‌కులు. అదేంటంటే.. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ఈ నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేయాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నాడ‌ట‌. దీంతో ఆయ‌న సిట్టింగ్ ఎమ్మెల్యే మాధ‌వ‌రావుని ఏదో విధంగా వెన‌క్కి నెట్టి.. ఆయ‌న అక్క‌డ పుంజుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌జ‌ల్లో మార్క‌లు త‌గ్గాయి కాబ‌ట్టి కూక‌ట్‌ప‌ల్లిలో మాధ‌వ‌రం ను త‌ప్పించి.. ఆ ప్లేస్‌లో కేటీఆర్‌ను పోటీకి నిల‌బెట్టాల‌ని వ్యూహంగా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలోనే పెద్ద ఎత్తుగ‌డ వేసుకుని.. కేటీఆర్‌.. కావాల‌నే ఇదంతా చేస్తున్నాడ‌ని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలా గెలిచామో ఇప్పుడు అదే తరహలో స్కెచ్ గీస్తున్నారు కేసీఆర్. తన కుమారుడ్ని అక్కడ బరిలో దింపడం ద్వారా చుట్టుపక్కల మరికొన్ని నియోజకవర్గాల పైనా పట్టు సాధించేలా కేసీఆర్ వ్యూహం ఉండనుంది. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కూకట్ పల్లిలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు.. స్థానికులకు ఇబ్బంది లేకుండా చేసే ఆలోచన చేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి కేసీఆర్‌ను న‌మ్ముకుని పార్టీ మారిని మాధ‌వ‌రం ఇప్పుడు చుక్క‌లు క‌న‌బ‌డుతున్నాయ‌ని వాపోతున్న‌ట్టు స‌మాచారం.