‘ స్పైడ‌ర్‌ ‘ లో అది మిస్…అందుకే తేడా అయ్యిందా!

స్పైడ‌ర్ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి దిగిపోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగాను, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రీమియ‌ర్ షోల అనంత‌రం ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. కొన్ని క్లాస్ వ‌ర్గాల‌తో పాటు ఏ క్లాస్ ప్రేక్ష‌కులు చాలా బాగుంది అంటున్నా బీ, సీ సెంట‌ర్ల‌తో పాటు కామ‌న్ ఆడియెన్స్ మాత్రం ఎన్నో అంచ‌నాల‌తో వ‌స్తే ఈ సినిమానా అని పెద‌వి కూడా విరుస్తున్నారు. సో ఓవ‌రాల్‌గా సినిమాకు మెజార్టీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి హిట్ టాక్ అయితే రావ‌డం లేదు.

స్పైడ‌ర్ సినిమాపై ముందునుంచి భారీ అంచ‌నాలు ఉన్నాయి. మురుగ‌దాస్ – మ‌హేష్ కాంబినేష‌న్ అన‌గానే జ‌నాలు చుక్క‌ల్లో అంచ‌నాలు పెట్టుకున్నారు. సినిమా చూశాక అవి రీచ్ కాలేద‌ని తెలుస్తోంది. సినిమాలో మ‌హేష్ న‌ట‌న‌, మురుగ‌దాస్ స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ వ‌ర‌కు బాగానే ఉన్నా సూప‌ర్‌స్టార్ అయిన మ‌హేష్‌కు స‌రిపోయే బ‌ల‌మైన క‌థాంశం ఇందులో లేదు.

ఓ సాదాసీదా క‌థ‌ను ఎంత బాగా ఎలివేట్ చేసేందుకు ప్ర‌య‌త్నించినా అది స్పైడ‌ర్‌కు కుద‌ర్లేదు. ఇక హాస్పిటల్ ఫైట్, భరత్ ని పట్టుకునే సన్నివేశం, హీరో, విలన్ ఒకరినొకరు హెచ్చరించుకునే సన్నివేశం, లాంకో హిల్స్ ఎపిసోడ్, మహిళల కోసం ఓ గేమ్ షో ఇవన్నీ ఐబీ అధికారి ఇంటలిజెన్స్ కి అద్దం పడతాయి. ఇంత అత్య‌ద్భుత‌మైన సీన్లు రాసుకున్న మురుగ‌దాస్ సినిమా అంతా అదే మ్యాజిక్ చేయ‌లేక‌పోయాడు. దీంతో చాలా బ‌ల‌హీన సీన్ల‌లో ఇవి ఇరుక్కుపోయిన‌ట్టుగా ఉన్నాయి.

సినిమాలో త‌మిళ ప్లేవ‌ర్ ఎక్కువైపోయింది. పాట‌ల ట్యూనింగ్‌లో కూడా హ‌రీష్ జైరాజ్ అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే ట్యూన్స్ ఇచ్చిన‌ట్టు క్లీయ‌ర్‌గా తెలిసిపోతోంది. ఇక మ‌న తెలుగు ప్రేక్ష‌కులు పూర్తిగా ఇక్క‌డి నేటివిటీనే కోరుకుంటారు. మ‌హేష్‌బాబు సినిమా అంటే అది కంప్లీట్ తెలుగు ప్లేవ‌రే ఉండాలి. అయితే స్పైడ‌ర్‌లో ఎక్కువుగా త‌మిళ ప్లేవ‌ర్ మైన‌స్‌. ఇక మురుగ‌దాస్ ఎంచుకున్న క‌థాంశం కూడా వీక్‌గానే ఉంది. దానిని స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్‌తో ఎంత ఎలివేట్ చేయాల‌ని చూసినా మెయిన్ క‌థ తేలిపోవ‌డంతో ప్రేక్ష‌కుడు కాస్త అసంతృప్తితో ఉన్నాడు. మ‌రి ఈ యావ‌రేజ్ సినిమాతో మ‌హేష్ త‌న స్టామినా చూపి ఎంత వ‌ర‌కు క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడ‌తాడో ? చూడాలి.