కేసీఆర్ వ్యూహానికి అడ్డుగా రేవంత్‌

September 14, 2017 at 5:14 am
Telangana, revanth reddy, TDp, TRS, KCR

తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మ‌ధ్య వార్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు! సంద‌ర్భ‌మేదైనా.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటారు రేవంత్‌! మ‌రోసారి వీరిద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన మొద‌లైంది. ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసే వ్యూహాల్లో కేసీఆర్‌ను మించిన వారు లేరనే విష‌యం తెలిసిందే! వీటిని ప‌సిగ‌ట్ట‌లేని ప్ర‌తిప‌క్షాలు ఆయ‌న ఉచ్చులో ప‌డిపోవ‌డం ప‌రిపాటిగా మారింది. అయితే తొలిసారి కేసీఆర్‌కు షాక్ త‌గ‌ల‌బోతోంద‌ట‌. ఆయన వ్యూహానికి రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చేందుకు రేవంత్ సిద్ధ‌మ‌వుతున్నారని స‌మాచారం! ఇదే జ‌రిగితే ఇక కేసీఆర్‌కు ఎదురుదెబ్బ త‌గ‌ల‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

ఏపీలో నంద్యాల‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో గెలిచి.. అంద‌రి సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేసింది టీడీపీ! సెమీ ఫైన‌ల్‌గా భావించిన ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షానికి అవ‌కాశం లేకుండా.. త‌మ బ‌లం నిరూపించింది. అంతేగాక తెలుగుదేశం శ్రేణుల్లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపారు ఏపీ సీఎం చంద్ర‌బాబు! ఇప్పుడు ఇదే ప‌ద్ధ‌తిని ఫాలోఅవ‌బోతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. తెలంగాణాలోనూ ఉప ఎన్నిక నిర్వ‌హించి.. ఆ గెలుపు ద్వారా తెలంగాణ రాష్ట్ర స‌మితిలో కొత్త ఉత్సాహం నింపాల‌నే ఉద్దేశంతో ఉన్నార‌ట‌. నంద్యాల త‌ర‌హాలోనే రాష్ట్రంలో ఏదో ఒక స్థానానికి ద‌స‌రా త‌రువాత ఎన్నిక వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగానే చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌ధానంగా న‌ల్గొండ లోక్ స‌భ స్థానానికే ఎన్నిక నిర్వ‌హిస్తార‌నే టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో రాజీనామా చేయించి, వెంట‌నే ఉప ఎన్నిక నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నార‌ట‌. ఇదే అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణ టీడీపీ నేత‌లు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకునే క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టార‌నే చ‌ర్చ మొద‌లైంది. న‌ల్గొండ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలిస్తే.. టీడీపీ, కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే! ఆ పార్టీలు కూడా అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపాల్సిన ప‌రిస్థితి అనివార్యం అవుతుంది. అలాగ‌ని ప్ర‌తిపక్షాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా తెరాసను ఎదుర్కొనే ప‌రిస్థితీ ఉండ‌దు. టీడీపీతో భాజ‌పా క‌లిసి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఈ ఉప ఎన్నిక ప్ర‌భావం 2019 జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై క‌చ్చితంగా ఉంటుంది.. అందుకే ఈ ఎన్నిక‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాలంటే ఈ ఉపఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున రేవంత్ రెడ్డి స్వ‌యంగా పోటీకి దిగ‌డ‌మే స‌రైన వ్యూహమ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. రేవంత్ పోటీకి దిగ‌డం ద్వారా ఆయ‌న సొంత ఇమేజ్ తోపాటు, ఇక్క‌డి సామాజిక స‌మీక‌ర‌ణ‌లు కూడా టీడీపీకి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ అంచ‌నా. స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డి, ఈ ఒక్క ఎన్నిక‌లో టీడీపీ గెలిస్తే చాల‌నీ, 2019 ఎన్నిక‌ల్లో పార్టీ కేడ‌ర్ కు కావాల్సిన ఉత్సాహం వ‌చ్చేస్తుంద‌ని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి బ‌రిలోకి దిగితే మాత్రం పోటీ ఆస‌క్తిక‌రంగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు.

 

కేసీఆర్ వ్యూహానికి అడ్డుగా రేవంత్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts