‘ఆటగదరా శివ’ సినిమా రివ్యూ రేటింగ్

July 20, 2018 at 11:05 am
Aatagadharaa Siva, review, Rating, Hyper aadhi,

సినిమా : ఆటగదరా శివ
నటీనటులు : ఉదయ్ , దొడ్డనా, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, దీప్తి
కథ : డి సత్య ప్రకాష్
డైలాగ్స్ : ముని సురేష్ పిళ్ళై, భీమ్
మ్యూజిక్ : వాసుకి వైభవ్
సినిమాటోగ్రఫీ: లవిత్
నిర్మాత : వెంకటేష్
స్క్రీన్ప్లే , డైరెక్షన్: చంద్ర సిద్ధార్థ్

ఆ నలుగురు అన్న ఒకే ఒక్క సినిమాతో ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయేలా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ మళ్ళీ తన దైన శైలి లో ఒక ఆసక్తికర సినిమా తో మన ముందరకి వచ్చాడు. ‘ ఆట గదరా శివా ‘ అంటూ ఒక పెక్యూలియర్ పేరుతో జనాల్లో క్రేజ్ తెప్పించిన ఈ సినిమా బృందం థియేటర్ లో ఎంతవరకూ ప్రేక్షకులని అలరించిందో చూడాలి. అయితే ఇప్పటి వరకూ డైరెక్ట్ సినిమాలు తీసిన చంద్ర సిద్దార్థ మొట్టమొదటి సరిగా ఒక కన్నడ రీమేక్ ని తెలుగులో తీసారు. కన్నడం లో బ్లాక్ బస్టర్ ఐన ఈ సినిమా తెలుగులో ఎంత వరకూ వెళుతుంది అనేది చూడాల్సి ఉంది.

aatagadhara-siva-movie-review-682-1532033705

బాబ్జీ గాజుల మర్రి – ఉదయ శంకర్ అనే వ్యక్తి కి మర్డర్ కేసు లో ఉరిశిక్ష పడుతుంది. శిక్ష అమలు చెయ్యడానికి సరిగ్గా నాలుగు రోజులు ఉంది అన్న టైం లో జైల్లో ఫైట్ చేసి పారిపోతాడు అతను. అనుకోకుండా పారిపోయే క్రమం లో ఒక లారీ ఎక్కుతాడు అది పంచర్ అవ్వడం తో ఒక వ్యక్తిని కలుస్తాడు అతనే జంగయ్య – దొడ్దన్న … బాబ్జీకి ఉరిశిక్ష వెయ్యడం కోసం బయలు దేరిన తలారీ నే ఈ జంగయ్య . అప్పుడప్పుడు జైల్లో తలారీ పని చేసే జంగయ్య కి అసలు వృత్తి పశువులకి వైద్యం చెయ్యడం. వీరిద్దరి ప్రయాణం సాగుతున్న క్రమం లో వీరికి ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ప్రేమ పక్షులు తగులుతాయి. వీరి నలుగురి ప్రయాణం ఎలా ముందరకి వెళ్ళింది .. బాబ్జీ భవిష్యత్తు ఏంటి .. జంగయ్య బాబ్జీ గురించి తెలుసుకోగలిగాడా లేదా అనేదే అసలు కథ ..

పాజిటివ్ లు :
ఈ సినిమాకి అతిపెద్ద పాజిటివ్ గా నటీ నటుల యొక్క ఎంపిక వారి నటన గురించి చెప్పుకోవచ్చు .. నేపధ్య సంగీతం తో పాటు పాటలు – సంగీతం అన్నీ బాగా సెట్ అయ్యాయి సినిమాకి. లొకేషన్ లు కూడా పర్ఫెక్ట్ గా సాంగ్స్ కి సూట్ అయ్యాయి కూడా. డైలాగులు కూడా జనాలకి బాగా కనక్ట్ అవుతాయి. పాటలు కూడా తెరమీద బాగున్నాయి.. టెక్నికల్ గా రీ రికార్డింగ్ బాగుంది. చంద్ర సిద్దార్థ ఆ నలుగురు సినిమాలో లాగానే ఇందులో కూడా భావోద్వేగాలు పండించడం చాలా బాగా కుదిరింది.,

aatagadhara-siva-movie-review-671-1532033540

నెగెటివ్ లు :
స్క్రీన్ ప్లే విషయం లో చంద్ర సిద్దార్థ మైనస్ మార్కులు వేయించుకున్నాడు . రెగ్యులర్ కమర్షియల్ పంథా కి చాలా దూరంగా ఉంది ఈ సినిమా. మూల కథ చాలా వీక్ గా ఉంది , తక్కువ పాత్రల మధ్యన సినిమా నడవడం తో బోరింగ్ అనిపిస్తుంది కూడా. కాస్తంత కామెడీ – మసాలా పెడితే బాగుండేది అనిపించడమే కాదు ఈ సినిమాలో వాటికి ఆవశ్యకత కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ కమర్షియల్ ప్రేక్షకులు ఎవ్వరు అయినా సరే ఈ సినిమాని లైట్ తీసుకునే పరిస్థితి ఉంది. చాలా కష్టం గా సదరు మాస్ మసాలా ప్రేక్షకుడు థియేటర్ లో కూర్చుంటాడు అనడం లో సందేహం లేదు..

aatagadhara-siva-movie-review-678-1532033637

కేవలం మనుషుల మధ్య జరిగే భావోద్వేగాలు మానసిక సంఘర్షణ లూ మూలంగా చేసుకుని కథ చెప్పడం అంటే మామూలు విషయం కాదు . అది చాలా ఛాలెంజ్ తో కూడుకున్న పని. రెండు గంటల పాటు ఖాళీ ప్రదేశం కవర్ చేస్తూ సినిమా చూపించడం కష్టమే .. అందులో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. తత్వాన్ని , జీవితాన్ని , వేదననీ , అనుభూతి నీ కలిపి కలిపి కొట్టాడు చంద్ర సిద్దార్థ. కొన్ని చోట్ల ఆ మోతాదు పెరిగిపోయి ఎక్కువ అనిపిస్తుంది , ఇంకొన్ని చోట్ల అస్సలు లేదు అనిపిస్తుంది. ఇలా మిళితం గా సాగుతుంది ఈ చిత్రం. హైపర్ ఆడి పాత్ర ఈ సినిమాకి పెద్ద రిలీఫ్ అని చెప్పచ్చు. క్రిటికల్ అప్లాజ్ ఏమన్నా రావచ్చు కానీ కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యే సినిమా మాత్రం కాదు – ఆటగదరా శివ

TJ రేటింగ్ :1.75/5

‘ఆటగదరా శివ’ సినిమా రివ్యూ రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share