‘జంబలకడిపంబ’ రివ్యూ రేటింగ్

June 22, 2018 at 3:21 pm
Jamba Lakidi Pamba, Review, Rating, Srinivas reddy

నటీనటులు :

శ‌్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్, స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు.

సంగీతం: గోపీసుంద‌ర్‌
కెమెరా: స‌తీశ్ ముత్యాల‌
ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌
స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌
ద‌ర్శ‌క‌త్వం: జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను)
నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్

కథ :

వరుణ్ ( శ్రీనివాస్ రెడ్డి ) పల్లవి (సిద్ది) ఇద్దరూ ప్రేమించుకొంటారు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. అంతేకాకుండా వరుణ్ వాళ్ల తండ్రి గ్రామ పెద్ద…దీంతో వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించరు. ఈ సందర్భంగా వరుణ్ పల్లవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకుంటారు. అయితే వివాహం ఎంత తొందరగా అయిందో…అంతే త్వరగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా పల్లవికి వరుణ్ పై బాగా అనుమానం ఎక్కువ.. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న వరుణ్ ఇంటికి వచ్చినప్పుడు పెళ్ళాం పెడుతున్న టార్చర్ ను తట్టుకోలేక విడాకులను సులువుగా ఇప్పించే ఓ పేరుపొందిన లాయర్ హరిచంద్ర ప్రసాద్ ని( పోసాని) ఆశ్రయిస్తాడు..అప్పటికే హరిశ్చంద్రప్రసాద్ 99 మందికి విడాకులు ఇప్పించాడు…ఈ క్రమంలో వీరిది 100వ కేసు వీరిద్దరికి ఎలాగైనా విడాకులు ఇప్పించి తన కెరియర్లో విడాకుల కేసుల విషయంలో సెంచరీ కొట్టాలి అనుకుంటాడు…అయితే అనుకోకుండా లాయర్ హరిచంద్ర ప్రసాద్ ఓ యాక్సిడెంట్లో మరణిస్తాడు.స్వ‌ర్గంలో త‌న భార్య‌తో విర‌హాన్ని త‌ట్టుకోలేడు. ఇదేం శిక్ష దేవుడా? అని అడిగితే ‘భూమ్మీద అన్ని జంట‌ల్ని విడ‌గొట్టిన పాప‌మే ఇది.. నీ పాపం క‌డుక్కోవాలంటే ఒక్క‌టే మార్గం.. వ‌రుణ్, ప‌ల్ల‌విల‌ను క‌లుపు’ అని దేవుడు… హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌ని భూమ్మీద‌కు పంపుతాడు. త‌న త‌ప్పుల్ని తెలుసుకున్న హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ వ‌రుణ్ ప‌ల్ల‌విల‌ని క‌ల‌ప‌డానికి ఏం చేశాడు? వ‌రుణ్‌ని అమ్మాయిగా, ప‌ల్ల‌విని అబ్బాయిగా ఎందుకు మార్చాడు? అనేదే క‌థ‌.

విశ్లేషణ :

చిన్నాచితకా పనులకు చిల్లర గొడవలు పడి కుటుంబాన్ని కాపురాన్ని నాశనం చేసుకునే దంపతుల విడాకుల కోసం లాయర్లను ఆశ్రయించిన సందర్భంలో న్యాయవాదులు ఇటువంటి గొడవలను అవకాశంగా భావించి వారి లాభాల కోసం కాపురాలను కుటుంబాలను కూల్చి డబ్బు సంపాదించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలో కూర్చుని మాట్లాడు కొన్ని విషయాలను కోర్టు మెట్లు దాకా ఏక్కిస్తుంటారు….ఈ క్రమంలో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఒక్క క్ష‌ణం ఎదుటివారి స్థానంలో నిలుచుని ఆలోచిస్తే అంతా అదే స‌ర్దుకుంటుంది అని చెప్పే సినిమా ఇది. అయితే లైన్‌గా విన‌డానికి బావుంది కానీ, దాని చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి. పాట‌లు కూడా మెప్పించ‌వు. ఒక‌రి మీద ఒక‌రు ప‌గ ప‌ట్ట‌డం, ఒక‌రి కెరీర్ల‌ను మ‌రొక‌రు నాశ‌నం చేసుకోవాల‌నుకోవ‌డం వంటి స‌న్నివేశాల‌న్నీ తేలిపోయాయి. ఎక్కడా కూడా సినిమాలో పెద్ద విశేషంగా సినిమా ఏమీ కనిపించదు అలాగే ఇద్దరిలోనూ ఉన్న కసి వెండితెరపై పెద్దగా కనబడలేదు..అయితే అమ్మాయి లక్షణాలతో శ్రీనివాసరెడ్డి అద్భుతంగా నటించాడు అబ్బాయి లక్షణాలతో సిద్ది కూడా బాగా నటించింది. అలాగే మిగతా నటీనటులు కూడా బాగానే నటించారు మొత్తంమీద చెప్పుకుంటే వెండితెరపై కామెడీ పెద్దగా పండలేదు..ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మాయిల స‌మ‌స్య‌ల గురించి మాట్లాడేట‌ప్పుడు సున్నితంగా, హ‌ద్దుమీర‌కుండా తెర‌కెక్కించిన విధానం బావుంది. మొత్తంమీద సినిమాను ఒకసారి చూడవచ్చు.

ప్ల‌స్ పాయింట్స్
శ్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని న‌ట‌న‌
నేప‌థ్య సంగీతం
కెమెరా

మైన‌స్ పాయింట్స్
క‌థ‌నం పేల‌వంగా ఉండ‌టం
ట్విస్టులు లేక‌పోవ‌డం
పాట‌లు ఆక‌ట్టుకునేలా లేక‌పోవ‌డం
సాగ‌దీత‌గా అనిపించడం

పబ్లిక్ టాక్ :

పాత సినిమా జంబలకడిపంబ పేరు పెట్టుకుని కనీసం ఆ స్థాయిలో కూడా ఈ సినిమాలో ఫ్లవర్ కనబడలేదు అని అంటున్నారు ప్రేక్షకులు. కేవలం పాత సినిమా పేరు లైన్ తీసుకొని ప్రస్తుత తరానికి సరైన కామెడీ అందించలేదని ఈ కొత్త సినిమా జంబలకడిపంబ గురించి అంటున్నారు సినిమా ప్రేక్షకులు…మొత్తంమీద చెప్పుకుంటే సినిమా చాలా బోర్ కొట్టింది అని అంటున్నారు.

TJ రేటింగ్ – 2 /5

‘జంబలకడిపంబ’ రివ్యూ రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share