కృష్ణార్జున యుద్ధం రివ్యూ

April 12, 2018 at 2:29 pm
Krishnarjuna Yuddham, Krishnarjuna Yuddham Movie, Review and Rating, Nani

బ్యాన‌ర్‌: షైన్ స్క్రీన్స్‌

టైటిల్‌: కృష్ణార్జున యుద్ధం

న‌టీన‌టులు: నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ , బ్ర‌హ్మాజీ, దేవ‌ద‌ర్శిని, నాగినీడు త‌దిత‌రులు

ఎడిటింగ్‌: స‌త్య.జి

మ్యూజిక్‌: హిప్ హాప్ త‌మిళ‌

సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని

నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది

ద‌ర్శ‌క‌త్వం:  మేర్ల‌పాక గాంధీ

సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ

ర‌న్ టైం: 158 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 12 ఏప్రిల్‌, 2018

 

గత సంవత్సరం వరుసగా సక్సెస్‌లు దక్కించుకున్న నాని ఈ సంవత్సరం ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రంతో తన సక్సెస్‌ రికార్డును కొనసాగించేందుకు రెడీ అయ్యాడు. నాని ఖాతాలో ఇప్ప‌టికే 8 వ‌రుస హిట్లు. ఈ సినిమాతో ట్రిబుల్ హ్యాట్రిక్ కొట్టి ఎన్నో సంచ‌నాల‌కు కేంద్ర బిందువు కావాల‌ని నాని ప్లాన్‌. జెండా పైక‌పిరాజు సినిమా త‌ర్వాత నాని కృష్ణుడు, అర్జ‌నుడిగా ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ సినిమాకు వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల‌తో హిట్లు కొట్టిన మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కుడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు వరుసగా బాక్సాఫీస్‌ ముందు మంచి వసూళ్లను రాబట్టాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంతో నానికి మాస్‌లో మరింత ఇమేజ్‌ పెరుగుతుందనే నమ్మకంను దర్శకుడు గాంధీ వ్యక్తం చేస్తున్నాడు. మ‌రి ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

 

క‌థ‌, క‌థ‌నం – పాజిటివ్‌లు :

వుమన్ ట్రాఫికింగ్ చుట్టూ సాగుతుంది ఈ సినిమా .. నాని ద్విపాత్రాభినయంలో కృష్ణ అనే పల్లెటూరి కుర్రాడి గా ఒక చోట మరొక చోట యూరప్ లో రాక్ స్టార్ గా కనిపిస్తాడు. నానీ రెండు పాత్రలూ చెయ్యడం మొదటి టైం కాకపోయినా అతని పెర్ఫార్మెన్స్ మాత్రం కేవలం కృష్ణ క్యారెక్టర్ లో ఆకట్టుకుంది. యూరప్ లో అనుపమాతో ప్రేమలో పడతాడు అర్జున్ , ఇండియా లో రుక్సర్ ని ప్రేమిస్తాడు. నాని. డిక్షన్ , స్టైల్ , పల్లెటూరి నేపధ్యంతో కృష్ణ ఎంతగా ఆకట్టుకుంటాడో అంతగా అర్జున్ రాక్ స్టార్ గా విసిగిస్తాడు. కృష్ణ క్యారెక్టర్ రాసినంత బాగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ అర్జున్ క్యారెక్టర్ ని రాయలేక పోయాడు. 

 

రాక్ స్టార్ అంటే మనకి 1 లో మహేష్ బాబు మాత్రమే గుర్తుకు వస్తాడు ఆ రేంజ్ లో ప్రయత్నం చేసిన నానీ అడ్డంగా ఫెయిల్ ఐనట్టు కనపడతాడు. అనుపమ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఆడపిల్లల ని ఎలా అమ్మేస్తున్నారు, వారితో ఎలా డీల్ చేస్తున్నారు .. ఇలాంటి విషయాలు అన్నీ కళ్ళకి కట్టినట్టు చూపించారు. అయితే అక్కడక్కడా తీన్ మార్ , హార్ట్ అటాక్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే బాగుంది , కామెడీ కూడా కూల్ గా సాగింది. కలువ పూడి సాంగ్ టేకింగ్ అద్భుతం .. యూరప్ సన్నివేశాల్లో కార్తి ఘట్టమనేని గొప్పతనం బయట పడింది. హిప్ హాప్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ .. బ్రహ్మాజీ కామెడీ బాగుంది. 

 

మ‌రి కొన్ని ప్ల‌స్ పాయింట్స్ (+) :

– కృష్ణ రోల్‌లో నాని సూప‌ర్బ్ పెర్పామెన్స్‌

– ఫ‌స్టాఫ్ కూల్ కామెడీ

– హీరోయిన్లు

– మ్యూజిక్‌

– సినిమాటోగ్ర‌ఫీ

 

నెగెటివ్‌లు : 

డైరెక్టర్ ఎంచుకున్న పాత చింతకాయ కథ ఈ సినిమాకి అతిపెద్ద నెగెటివ్ . ఎప్పుడో ఒకప్పటి స్టోరీ ని తీసుకొచ్చి దానికి ఫస్ట్ హాఫ్ వరకూ న్యాయం చేసి సెకండ్ హాఫ్ లో జనాల సహనం టెస్ట్ చేసాడు. నానీ కూడా కొత్తదనం మానేసి అవే మూస నటన చేస్తూ విసిగించే ప్రయత్నం చేసాడు. కృష్ణ పాత్రలో ఒదిగిపోయిన నాని అర్జున్ పాత్రలో ఏంటి ఇలా చేసాడు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాలా వీక్ గా బోరింగ్ గా సాగుతుంది. దీనికి తోడు సాంగ్స్ ప్లేస్మెంట్ విషయం లో కూడా మేర్లపాక గాంధీ సరైన కేర్ తీస్కోలేదు. కామెడీ పరంగా సూపర్ ఫేం ఉన్న గాంధీ బ్రహ్మాజీ తో తప్ప కామెడీ చాలా చోట్ల తేల్చేసాడు. 

 

మ‌రికొన్ని మైన‌స్‌ పాయింట్స్ (- ) :

– సెకండాఫ్‌లో లాగ్ అయిన క‌థ‌నం

– క‌థ‌తో పోలిస్తే ఎక్కువుగా ఉన్న నిడివి

– రొటీన్ స్టోరీ

 

మొత్తం మీద :

మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమా నానీ కి mca , నేను లోకల్ రేంజ్ లో ఏమీ కనపడ్డం లేదు. పేలవమైన కథ కి చప్పగా రాసిన స్క్రీన్ ప్లే తలనొప్పి గా మారడం తో సెకండ్ హాఫ్ ప్రేక్షకులకి విసుగు తెప్పించడం పక్కా . ఇరవై ఆరు కోట్ల డబ్బు వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అనిపించుకుంటుంది ఈ సినిమా .. మరి ఇలాంటి కంటెంట్ తో మరొక పక్క ఫుల్లుగా ర‌న్ అవుతోన్న‌ రంగస్థలం , భరత్ అనే నేను సినిమాలు వస్తున్న ఈ తరుణం లో కృష్ణార్జున యుద్ధం కి కమర్షియల్ హిట్ కష్టమే అని చెప్పాలి. పేలవమైన కథ, సాగదీసిన కథనం. అందులోనూ బాక్సాఫీస్ వద్ద “రంగస్థలం” ర్యాంప్ ఆడేస్తుండడం, వచ్చే వారం మహేష్ “భరత్ అనే నేను”తో రెడీగా ఉండడంతో “కృష్ణార్జున యుద్ధం” నాని సక్సెస్ స్ట్రీక్ కి బ్రేక్ వేసినట్లే. 

 

కృష్ణార్జున యుద్ధం TJ రేటింగ్ : 2.5 / 5

 

 

కృష్ణార్జున యుద్ధం రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share