‘లవర్’ సినిమా రివ్యూ రేటింగ్

July 20, 2018 at 9:45 am
Lover, Review, rating, Raj tharun, dilraju

విడుదల తేదీ: జులై 20 2018
హీరో, హీరోయిన్ : రాజ్ తరుణ్, రిద్ది కుమార్
దర్శకుడు: అనీష్ కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్: అంకిత్ తివారి
నిర్మాత: హర్షిత్ రెడ్డి
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్
నటీనటులు: అజయ్, రాజీవ్ కనకాల,సుబ్బా రాజు
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి

రాజ్ తరుణ్, రిద్ది కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ లవర్ ‘ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అనీష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకుడిగా పని చేసారు. ఇక గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ కి దిల్ రాజు లక్కీ హ్యాండ్ విజయాన్ని అందిస్తుందేమో వేచి చూడాలి. ఈ సినిమాతోనైనా యువ హీరో రాజ్ తరుణ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడని ఆశిద్దాం. ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ మరియు ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది, ట్రైలర్ ని బట్టి ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.

ఇక సినిమా కథ విషయానికి వస్తే హీరో రాజ్ (రాజ్ తరుణ్) ఈ మూవీలో ఒక బైక్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. సినిమా మొదలైన కొద్దీ సేపటికే హీరో ఒక ఫైట్ లో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రి లో జాయిన్ అవుతాడు. అక్కడే పని చేస్తున్న హీరోయిన్ చరిత (రిద్ది కుమార్) ని మొదటి సారి చూస్తాడు. చరిత అదే ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక నర్స్ గా పని చేస్తూ ఉంటుంది. తొలి చూపు లోనే రాజ్ చరిత తో ప్రేమలో పడిపోతాడు, వెంటనే ‘నాలో ఏదో చిలిపి కల’ అనే ఒక చక్కటి మెలోడీ సాంగ్ వస్తుంది.
ఇక మెల్లిగా అన్ని సినిమాల్లో లాగానే హీరో రాజ్, చరితాని ఎలాగైనా ఇంప్రెస్స్ చేసి ప్రేమలో పాడియాలని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో ‘అంతే కదా మరి’ అనే మరో లవ్ సాంగ్ వస్తుంది. ఇక అనుకోకుండా చరిత ని విలన్లు కిడ్నప్ చేస్తారు. ఇక్కడితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కథ రొటీన్ గా ఉన్న, సినిమాలో వచ్చే లవ్ సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకోవచ్చు.

ఇక సెకండ్ హాఫ్ లో రాజ్ హీరోయిన్ చరితాని వెతుక్కుంటూ కేరళ కి వెళ్తాడు. సెకండ్ హాఫ్ అంత కేరళ లో చిత్రీకరించారు దర్శకుడు. ఎన్నో అందమైన లొకేషన్స్ మనకి సెకండ్ హాఫ్ లో దర్శనమిస్తాయి. ఇక రాజ్, చరితాని కలిసిన వెంటనే ‘ అద్భుతం’ అనే మరో సాంగ్ మొదలవుతుంది. సినిమాలో ఈ పాటే హైలైట్ , కేరళ లోని అద్భుతమైన ప్రకృతిని సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి ఈ పాట ద్వారా మనకి చూపించే ప్రయత్నం చేసాడు. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. విలన్ పాత్రని దర్శకుడు వైవిధ్యంగా తెరకెక్కించారు. ఇక సినిమా క్లైమాక్స్ రొటీన్ ట్విస్ట్ తోనే ముగుస్తుంది.

‘లవర్’ సినిమా రొటీన్ కథాంశం తో తెరకెక్కిన మరో తెలుగు సినిమా అని చెప్పవచ్చు. దిల్ రాజు ప్రమోషన్స్ ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు తెప్పించవచ్చు. ఇక సినిమాలో రాజ్, చరిత ని ఎలాగైనా దక్కించుకోవాలనే చేసే ప్రయత్నం ఆకట్టుకుంది. విలన్ పాత్ర, కేరళ బ్యాక్ డ్రాప్ సినిమాలో ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. రాజీవ్ కనకాల నటనతో ప్రేక్షకులని కంటతడి పెట్టించాడు.

TJ రేటింగ్ – 2.75/3

‘లవర్’ సినిమా రివ్యూ రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share