TJ రివ్యూ: మ‌హానుభావుడు

TJ రివ్యూ: మ‌హానుభావుడు

టైటిల్‌: మ‌హానుభావుడు

జాన‌ర్‌: కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌

నటీనటులు: శర్వానంద్ ,  మెహ్రీన్, వెన్నెల కిషోర్ , రఘుబాబు 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వర రావు 

సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ 

మ్యూజిక్ : ఎస్ఎస్‌.థ‌మ‌న్‌

నిర్మాత: వంశీ కృష్ణారెడ్డి , ప్రమోద్ 

దర్శకత్వం: మారుతి  

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

ర‌న్ టైం : 151 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 27 సెప్టెంబ‌ర్‌, 2017

యంగ్ హీరో శర్వానంద్ ప‌దే ప‌దే పెద్ద హీరోల‌కు పోటీగా త‌న సినిమాలు రిలీజ్ చేసి హిట్లు కొడుతున్నాడు. ఎక్స్‌ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి రెండు సినిమాలు ఇలాగే హిట్ అయ్యాయి. ఇప్పుడు శ‌ర్వానంద్ – డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో యువీ క్రియేషన్స్ నిర్మించిన చిత్రం మహానుభావుడు. టైటిల్ సీరియస్ గా వున్నా సినిమాలో మ్యాటర్ కామెడీ అని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా తేలిపోయింది. కంటెంట్ నచ్చితే ఏ ప్రయోగం చేయడానికి అయినా వెనుకాడని హీరో శర్వానంద్. డైరెక్టర్ మారుతీ కామెడీ సెన్స్ గురించి తెలిసిందే. ఇక స్పైడ‌ర్‌, జై ల‌వ‌కుశ‌కు పోటీగా ద‌స‌రాకే ఈ సినిమాను రంగంలోకి దింపారు. వ‌రుస హిట్ల‌తో రేంజ్‌లో ఉన్న శ‌ర్వానంద్‌కు ఈ మ‌హానుభావుడు ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ అయిన ఆనంద్ (శ‌ర్వానంద్‌)కు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డ‌ర్ అనే మానసిక సమస్య ఉంటుంది. అంటే ఈ డిజార్డ‌ర్ ఉన్న వాళ్లు అతి శుభ్ర‌త‌కు ప్ర‌యారిటీ ఇస్తుంటాడు. అంటే మ‌న ఇళ్ల‌ల్లో కొంద‌రు ఆడ‌వాళ్లు చేసిన‌ట్టుగా కడిగింది కడగడం, తుడిచిందే తుడవడం లాంటి, వేసిన తాళాన్ని పదిసార్లు చూడడం లాంటి జ‌బ్బు ఇది. ఆనంద్ త‌న కొలిగ్ అయిన అమ్మాయి మేఘ‌న‌ (మెహ్రీన్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కూడా అత‌డిని ఇష్ట‌ప‌డుతుంది. అయితే ఆనంద్ అతిశుభ్ర‌త వ‌ల్ల వీరి మ‌ధ్య గ్యాప్ వ‌స్తుంది. చివ‌ర‌కు త‌న ప్రేమ‌ను నెగ్గించుకునేందుకు ఓ ప‌ల్లెటూరుకు వెళ‌తాడు. అక్క‌డ హీరోయిన్ ఇంట్లో ఆనంద్‌కు ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి ? ఆనంద్ ప్రేమని గెలుస్తాడా ? ఈ ప్రయత్నంలో అతి శుభ్రత రీజ‌న్‌తో ఆనంద్ ఎదుర్కొనే సమస్యలు ఏంటి ?  చివ‌ర‌కు ఈ ప్ర‌య‌త్నంలో ఆనంద్ త‌న ప్రేమ‌ను ఎలా గెలిచాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

TJ విశ్లేష‌ణ‌:

భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలో మ‌తిమ‌రుపు వ్యాధి క్యారెక్ట‌ర్ చుట్టూ క‌థ‌ను అల్లుకున్న ద‌ర్శ‌కుడు మారుతి ఈ సినిమాలో అతి శుభ్ర‌త‌తో బాధ పడే హీరో, అతని ప్రవర్తన, దాంతో ఎదురయ్యే పరిస్థితులను బేస్ చేసుకుని రాసుకున్న క‌థ‌, క‌థ‌నాలు సినిమాకు ఆయువుప‌ట్టుగా నిలిచాయి. ఇక సినిమాలో మ‌న‌కు తెలియంది ఏమీ ఉండ‌దు. ట్రైల‌ర్ చూపించిన‌ట్టుగానే హీరోకు అతిశుభ్ర‌త ల‌క్ష‌ణం ఎక్కువుగా ఉంటుంది. దీనివ‌ల్ల అత‌డి ప్రేమ‌కు వ‌చ్చిన ఇబ్బందులను చ‌క్క‌గా కామెడీగా ద‌ర్శ‌కుడు ప్ర‌జెంట్ చేశాడు. 

మారుతి వెంకీతో తీసిన బాబు బంగారం సినిమాలో కూడా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ బాగున్నా దాని చుట్టూ అల్లుకున్న సీన్లు పండ‌లేదు. అయితే ఈ సినిమా విష‌యంలో ఆ పొర‌పాట్లకు తాడులేకుండా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చుట్టూ రాసుకున్న సీన్లు రొటీన్ రొటీన్‌గా ఉన్నా స్పెష‌ల్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇక కొన్ని సీన్లు పాత‌గా ఉన్నా హీరోకు ఉన్న స‌మ‌స్య కొత్త‌గా ఉండ‌డంతో చూసేవాళ్ల‌కు ప్రెష్ షీలింగ్ క‌లుగుతుంది.  ఇంటర్వెల్ ఎపిసోడ్,సెకండ్ హాఫ్ అంతా మిమ్మల్ని సీటులో నిలవకుండా నవ్వించేస్తాయి. క్లయిమాక్స్ కూడా అదే స్థాయిలో వుంది.

శ‌ర్వానంద్ కెరీర్‌లోనే కొత్త క్యారెక్ట‌రైజేష‌న్‌లో క‌నిపిస్తాడు. సినిమాలో శ‌ర్వానంద్ మ‌నకు కేవ‌లం రెండు మూడు సీన్ల‌లో మాత్ర‌మే క‌నిపిస్తాడు. మిగిలిన సినిమా అంతా అతిశుభ్ర‌త ఉన్న మ‌నిషిగా అద‌ర‌గొట్టేశాడు. సినిమా అయిపోయాక ఇంటిదాకా గుర్తొచ్చి నవ్విస్తాడు. హీరోయిన్ మెహ్రిన్ అందంగా క‌నిపించ‌డంతో పాటు న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న రోల్ చేసింది. హీరో, హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇక హీరోయిన్ తండ్రి రామ‌రాజుగా నాజ‌ర్ క్యారెక్ట‌ర్ కూడా బాగుంది. 

టెక్నిక‌ల్‌గా అన్ని అంశాలు సినిమాకు చ‌క్క‌గా కుదిరాయి. నిజార్ షఫీ సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. సినిమాకు ఫ్రెష్‌లుక్ తీసుకువ‌చ్చింది. థ‌మ‌న్ ఆడియో ఇప్ప‌టికే హిట్ అవ్వ‌గా ఆర్ ఆర్ సినిమాను ప్రేక్ష‌కుడు మాంచి మూడ్‌లో ఎంజాయ్ చేసేలా ఉంది. కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎడిటింగ్‌లో సెకండాఫ్‌లో కొన్ని సీన్ల‌కు ట్రిమ్ చేస్తే బాగుండేది. 151 నిమిషాల ర‌న్ టైంను 140 నిమిషాల‌కు కుదిస్తే ఇంకా బాగుండేది. యూవీ క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. మంచి సినిమాను అక్కౌంట్‌లో వేసుకున్నారు. ఇక ద‌ర్శ‌కుడు మారుతి ఓ పాత కథని కొత్త పాయింట్ చుట్టూ అల్లుకుని కామెడీ తో ప్రేక్షకుల్ని ఆలరించడంలో సక్సెస్ అయ్యాడు. 

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– శర్వానంద్ – మెహ్రీన్ కౌర్ ఫెయిర్‌

– కామెడీ , లవ్ ట్రాక్ 

– డైరెక్టర్ 

– సినిమాటోగ్ర‌ఫీ

– నిర్మాణ విలువలు

మైన‌స్ పాయింట్స్ (-):

– కొన్ని చోట్ల రొటీన్ కామెడీ

– స్లో సెకండాఫ్‌

ఫైన‌ల్‌గా…

ద‌స‌రాకు శ‌ర్వానంద‌మే ఈ మ‌హానుభావుడు

మ‌హానుభావుడు సినిమా TJ రేటింగ్‌: 3.25 / 5