‘మెహ‌బూబా’ TJ రివ్యూ

May 11, 2018 at 1:27 pm
Mehbooba, Movie, Review & Rating, Puri Jagannadh, Akash Pur

టైటిల్ : మెహబూబా

జానర్ : లవ్‌ ఎంటర్‌టైనర్‌

న‌టీన‌టులు : ఆకాష్‌ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి, మురళీ శర్మ, షియాజీ షిండే

మ్యూజిక్‌ : సందీప్‌ చౌతా

నిర్మాత : పూరి కనెక్ట్స్‌

దర్శకత్వం : పూరి జగన్నాథ్‌

సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ

ర‌న్ టైం: 152 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 11 మే, 2018

 

టాలీవుడ్ డేరింగ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌కు కొద్ది రోజులుగా త‌న స్థాయికి త‌గిన హిట్ లేదు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఎన్టీఆర్‌తో తీసిన టెంప‌ర్ త‌ర్వాత పూరి ఐదు వ‌రుస ప్లాపులు ఇచ్చాడు. టెంప‌ర్ క‌థ కూడా పూరిది కాదు. క‌థ‌, క‌థ‌నాల మీద క‌స‌ర‌త్తులు లేకుండా స్పీడ్‌గా సినిమాలు తీయ‌డంతో పూరి బొక్క బోర్లా ప‌డుతున్నాడు. వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నా పూరి మాత్రం త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. తన తనయుడు ఆకాష్‌ను రీ లాంచ్‌ చేస్తూ తెరకెక్కించిన సినిమా మెహబూబా. ముందు నుంచి ఇది పూరికి కూడా రీలాంచ్‌ లాంటి సినిమా అంటూ ప్రచారం చేశారు చిత్రయూనిట్. పూరి తన రెగ్యులర్‌ స్టైల్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి ఓ డిఫరెంట్‌ జానర్‌లో ఇండో – పాక్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా పూరికి, వార‌సుడు ఆకాష్‌కు హిట్ ఇచ్చిందా ?  వీరి క‌ష్టాలు తీర్చిందా ?  అన్న‌ది TJ స‌మీక్ష‌లో చూద్దాం.

 

స్టోరీ & TJ ఎన‌లైజింగ్ :

రోషన్ (ఆకాష్ పూరి)కి చిన్నప్పటినుండి తనను ఎవరో చంపేసినట్లు, తను ఎవరికో మాట ఇచ్చినట్లు రకరకాల కలలు వస్తుంటాయి. బోర్డ‌ర్ అవ‌త‌ల ఉన్న అఫ్రీన్ (నేహాశెట్టి) అనే పాకిస్థానీ అమ్మాయి కూడా అలాంటి క‌ల‌ల్లోనే మునిగి తేలుతుంటుంది. ఇంజ‌నీరింగ్ చ‌దివిన రోష‌న్ మిల‌ట‌రీలో జాయిన్ అవుతాడు. ఆఫ్రీన్ స్ట‌డీ కోసం ఇండియాకు రావాల‌ని చూస్తుంటాడు. ఆఫ్రీన్‌ను పెళ్లాడ‌ని చూసే నదీన్ ఖాన్ (విషు రెడ్డి) ఆమెను తన అధీనంలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అఫ్రీన్‌కు నదీన్ అంటే ఇష్టం లేనప్పటికీ తల్లితండ్రుల కోసం భరిస్తుంటుంది. ఇండియాకు వ‌చ్చిన ఆఫ్రీన్ ఓ ప్రాబ్ల‌మ్‌లో ఉంటే రోష‌న్ ఆమెను కాపాడ‌తాడు. అయితే వారిద్ద‌రు ఒక‌రినొక‌రు చూసుకోలేరు. 

 

అప్ప‌టి నుంచి ఆఫ్రీన్ రోష‌న్‌కు థ్యాంక్స్ చెప్పాల‌ని ట్రై చేసి చివ‌ర‌కు ట్రైన్‌లో అత‌డిని క‌లుసుకుంటుంది. వారు ఒక‌రిని ఒక‌రు చూసుకోగానే వారికి ఇది వ‌ర‌కే ప‌రిచ‌యం ఉన్న‌ట్టుగా అనిపిస్తుంటుంది. ఆఫ్రీన్ పాకిస్తాన్‌కు వెళ్లిపోతుంది. ఆ త‌ర్వాత హిమాల‌యాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన రోష‌న్‌కు ఆఫ్రీన్ గురించి ఓ కీల‌క విష‌యం తెలుస్తుంది. ఆ త‌ర్వాత రోష‌న్ ఆఫ్రీన్‌ను వెతుక్కుంటూ పాకిస్తాన్‌కు వెళ‌తాడు ? అక్క‌డ ఆఫ్రీన్ కోసం అత‌డు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు ?  రోషన్ తెలుసుకున్న విషయాలు ఏంటి?   వీరిద్ద‌రి గ‌త జ‌న్మ‌ల‌కు ఉన్న లింక్ ఏంటి ?  అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..! 

 

న‌టీన‌టుల ప‌నితీరు…

పూరి త‌న‌యుడు ఆంధ్రాపోరి స‌క్సెస్ కాలేదు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత మెహ‌బూబాతో ఓ క‌మ‌ర్షియ‌ల్ హీరోగా లాంచ్ అయ్యాడు. రెగ్యుల‌ర్ ఫార్మాట్‌లో కాకుండా అత‌డు ఎంచుకున్న జాన‌ర్ బాగుంది. రోష‌న్ సైనికుడిగాను, ప్రేమికుడిగాను రెండు వేరిష‌య‌న్ల‌లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. లుక్స్ ప‌రంగా బాగున్నా కొన్ని స‌న్నివేశాల్లో త‌న వ‌య‌స్సుకు మించిన పాత్ర ఎంచుకున్న‌ట్టే అనిపిస్తుంది. అత‌డి డ్యాన్స్ స్కిల్స్ చూపించే స్కోప్ లేదు. హీరోయిన్ నేహాశెట్టి జ‌స్ట్ ఓకే. 

విలన్‌గా విషు రెడ్డి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్‌ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా షియాజీ షిండే రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.

 

పాజిటివ్‌లు :

పూరి ఎంచుకున్న ఇండో – వార్ నేప‌థ్యం, గ‌త జ‌న్మ‌ల వృత్తాంతం బాగుంది. హీరోకు ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో గ‌త జ‌న్మ‌ల గురించి తెలియ‌డంతో అక్క‌డ ట్విస్ట్ బాగుంది. దీంతో సెకండాఫ్ ఎలా ఉంటుందో ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. పూరి త‌న ట్రేడ్ మార్క్ డైలాగ్స్‌, సీన్లు మెప్పించాయి. హీరో ఆకాష్ ఈ సినిమాతో న‌ట‌నా ప‌రంగా మ‌రో మెట్టు ఎక్కాడు. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న రోల్ కావ‌డంతో అత‌డి న‌ట‌న‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతమందించిన సందీప్‌ చౌతా పరవాలేదనిపించాడు. యాక్షన్‌ సీన్స్‌ తో పాటు ట్రెక్కింగ్‌కు సంబంధించిన సన్నివేశాల్లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. 

 

నెగిటివ్‌లు :

పూరి రాసుకున్న మెయిన్ స్టోరీ లైన్ బాగున్నా దానిని పూర్తి స్థాయి సినిమాగా మ‌ల‌చ‌డంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. 

క‌థ‌నం బాగా బోర్ కొట్టించేసింది. సినిమాకు సెకండాఫ్‌లో కీల‌కంగా నిల‌వాల్సిన హీరో, హీరోయిన్ల గ‌త జ‌న్మ‌తాలూకూ సీన్లు మ‌రీ రొట్ట‌గా ఉన్నాయి. పూర్వ‌జ‌న్మ‌ల ప్రేమ అంటూ ఎమోష‌న‌ల్‌గా ప్రేక్ష‌కుల‌ను క‌దిలించాలి… మెహ‌బూబాలో అది పూర్తిగా మిస్ అయ్యింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిల్‌. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా సరిగ్గా లేదు. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ చూపాల్సివుంది. క్లైమాక్స్ లో ప్యారలల్ గా సీన్స్ చూపించడం మాత్రం మెచ్చుకోదగ్గ విషయం. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా పూరి జగన్నాథ్ ఆశించిన విజయాన్ని మాత్రం ఈ సినిమా అందించలేకపోయింది. ఆక‌ట్టుకోని 

స్క్రీన్‌ప్లే, లాజిక్‌ లేని సీన్స్‌, పూరి మార్క్‌ కనిపించకపోవటంతో సినిమాను ఎవ్వ‌రూ కాపాడే ప‌రిస్థితి లేదు.

 

ఫైన‌ల్గ‌గా… 

తండ్రి కొడుకుల‌కు నెక్ట్ టైం బెట‌ర్ ల‌క్‌

 

TJ సూచ‌న‌:  మెప్పించ‌ని మెహ‌బూబా

 

మెహ‌బూబా TJ రేటింగ్‌: 2  / 5

 

‘మెహ‌బూబా’ TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share