‘@నర్తనశాల’ సినిమా రివ్యూ

August 30, 2018 at 1:49 pm

నటీనటులు : నాగశౌర్య,కశ్మీర పరదేశి,యామిని భాస్కర్
దర్శకులు : శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాత‌: ఉష ముల్పూరి
సంగీతం: మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్
సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ సి.కుమార్‌

ఈ మద్య టాలీవుడ్ లో కొత్త హారోల జోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చిన హీరో నాగశౌర్య. ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం అందుకోలేకపోయాయి. నిర్మాత‌గా మారి చేసిన తొలి ప్ర‌య‌త్నం `ఛ‌లో` సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్నాడు. మరోసారి తన సొంత బ్యానర్ లో ‘@నర్తనశాల’తో ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చాడు. సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ‘న‌ర్త‌న‌శాల’ సినిమా టైటిల్‌ను పెట్ట‌డం ఒక ఎత్తు అయితే..ఇందులో హీరో గే పాత్రలో నటించడం మరో ఎత్తు. మరి ఈ సినిమాతో నాగశౌర్య మరో సక్సెస్ అందుకుంటాడా..లేదా అన్నది తెలియాలి.
natrhanasala4

కథ :
కళామందిర్ కళ్యాన్(శివాజీరాజా)కి తన భార్య రూపమంలో అమ్మాయి పుడుతుందని భావిస్తాడు అతని తండ్రి. కానీ అనూహ్యంగా శివాజీరాజా కు హీరో నాగశౌర్య పుడతాడు. అసలే హార్ట్ పేషెంట్ అయిన తన తండ్రికి కొడుకు కాదు అమ్మాయి పుట్టిందని చెప్పి నాగశౌర్యను అమ్మాయిగా పెంచుతాడు. అయితే నాగశౌర్యను ఆడవాళ్లను రక్షించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తాడు శివాజీరాజ. ఇక జీవితంలో ఒక సన్యాసినిగా మారి సేవ చేయాలనే ఆలోచనలో ఉంటుంది మేఘ‌న‌(కశ్మీర ప‌ర‌దేశి). ఆ ఊరిలో పెద్ద పేరు ఉన్న రాయుడు కూతురు సత్యభామ(యామిని భాస్కర్) నాగశౌర్యను చూసి ప్రేమించడం మొదలు పెడుతుంది. రాయుడుకి ఎదురు చేప్పలేని కళ్యాన్ తన కొడుకుకు పెళ్లి సంబంధం కోసం సత్యభామ ఇంటికి వెళ్తారు..కానీ అప్పటికే తన కొడుకు మేఘనను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని షాక్ తింటాడు. అదే సమయంలో తాను ఓ గే అని సత్యభామను పెళ్లి చేసుకోలేనని చెబుతాడు. అప్పుడు సినిమాలో ట్విస్ట్ వస్తుంది..అనుకోకుండా హీరో, హీరోయిన్ కి పెద్ద సమస్య వచ్చి పడుతుంది..మరి ఆ సమస్య ఏంటీ..దాన్ని ఎలా ఎదుర్కొని మేఘనను పెళ్లిచేసుకుంటాడు నాగశౌర్య అనే విషయమే సినిమా కథ.
-Narthanasala-Egireney-Manasu-Video-Song-1533038022-1549

విశ్లేషణ :
సినిమా విషయంలో దర్శకుడు చాలా వరకు కామెడీ నేపథ్యంలో కొనసాగించడానికి ప్రయత్నించాడు..కానీ కొన్ని చోట్ల మాత్రం అస్సలు వర్క్ ఔట్ కాలేదు. టాలీవుడ్ లో హీరోలు గే పాత్రల్లో నటించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆ మత్య వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ‘మసాల’ సినిమాలో రామ్ గే పాత్రలో నటించి పరవాలేదు అనిపించాడు. ఈ సినిమాలో నాగశౌర్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఒకటి హాండ్ సమ్ హీరోగా..మరొకటి గే పాత్ర. హీరోయిన్స్ క‌శ్మీర ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్ విష‌యానికి వ‌స్తే స్కిన్ షో చూపించడానికి అన్నట్లే ఉన్నారు.

ఒక పాటలో యామినీ భాస్కర్ మరీ రెచ్చిపోయిన నటించినట్లు కనిపించింది. జయప్రకాశ్ రెడ్డి రాయ‌ల‌సీమ స్లాంగ్‌లో మాట్లాడటం..జబర్ధస్త్ రాకెట్ రాఘవ తాగుబోతుగా బాగానే నవ్వించారు. అజయ్ గే పాత్రలో నటించి విలనీజం ఎక్కడా చూపించలేక పోయాడు. నాగ‌శౌర్య గే పాత్ర‌ను చేయ‌డానికి అంగీక‌రించ‌డం గొప్ప విష‌యం.

కానీ డైరెక్ట‌ర్ హీరో పాత్ర‌ను బాగా ఎలివేట్ చేయలేకపోయారనిపించింది. సినిమాలో ఫస్టాఫ్ లవ్ ఎఫైర్ తో నడిచినా..సెకండ్ ఆఫ్ గే పాత్ర ఎంట్రీ ఇచ్చి కాస్త గజిబిజ చేసినట్లు కనిపిస్తుంది. ఇక రాయుడుగా విలనీజం కన్నా కమెడీ తోనే ఎక్కువ నడిచింది. సినిమాటోగ్రఫి విజయ్ పరవాలేదు అనిపించాడు. సాగర్ మహంతి సంగీతం ఒకే. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.
1535468432-187

నటీనటులు :
‘ఛలో’సినిమాతో మంచి రొమాంటిక్ హీరో అనిపించుకున్న నాగశౌర్య ఈసారి పెద్ద సాహసమే చేశాడు. ఓ పాత్రలో నార్మల్ గా ఉంటూ..మరో పాత్ర గే గా కనిపించాడు. వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో గే పాత్రల్లో నటించి మెప్పించడం కష్టమే. కాకపోతే మనోడి పర్ఫామెన్స్ కి మార్కులు వేయొచ్చు. ఇక హీరోయిన్లు శ్మీర ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్ నటనకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా గ్లామర్ తో నెట్టుకొచ్చారు. హీరో తండ్రిగా శివాజీరాజా మంచి నటన కనబరిచారు. ప్రకాశ్ రాజ్, విజయ్, రాకెట్ రాఘవ తమన నటన పరిథిమేరకు నటించారు. దాదాపు సినిమా ఎక్కువ శాతం కామెడీ జోనర్ లోనే కొనసాగడంతో విలనీజం కూడా కామెడీ అయ్యింది.

ప్లస్ పాయింట్స్ : హీరో నటన, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ : కథా కథనాలు,సెకండ్ ఆఫ్ బోరింగ్ సీన్లు, సాంగ్స్

బాటం లైన్ : నవ్వు తెప్పించిన ‘@నర్తనశాల’..కానీ
రేటింగ్ : 2/5

‘@నర్తనశాల’ సినిమా రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share