‘నోటా’ మూవీ రివ్యూ& రేటింగ్

October 5, 2018 at 2:26 pm

`నోటా` రివ్యూ..!

విడుదల తేదీ: 05 వ అక్టోబర్, 2018
న‌టీన‌టులు: విజయ్ దేవరకొండ, మెహ్రీన్ పిర్జాదా, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్‌
దర్శకుడు: ఆనంద్ శంకర్
సంగీత దర్శకుడు: శక్తీకాంత్ కార్తీక్
కొరియోగ్రఫీ: సంతానా కృష్ణన్ రవిచంద్రన్
ప్రొడక్షన్ కంపెనీ: స్టూడియో గ్రీన్

టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మాంచి ఊపులో ఉన్నాడు. అర్జున్‌రెడ్డి మానియా కొన‌సాగుతుండ‌గానే.. మొన్న‌టికి మొన్న‌గీత‌గోవిందంతో మంత్ర‌ముగ్ధుల్ని చేసిండు. ఈ విజ‌య‌ప‌రంప‌ర‌లోనే `నోటా`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిండు. అయితే.. ఆయ‌న గ‌త సినిమాల‌కు భిన్న‌మైన క‌థ‌కావ‌డం.. అదికూడా పొలిటిక‌ల్ డ్రామా కావ‌డంతో ఎలా ఉంటుందోన‌న్న క్యూరియాసిటీ అంద‌రిలో నెల‌కొంది. అయితే.. ఇప్ప‌టికే తెలుగులో పొలిటిక‌ల్ థ్రిల‌ర్‌, డ్రామా క‌థాంశాల‌తో చాలా సినిమాలే వ‌చ్చాయి. ఇదే క‌థాంశంతోనే వ‌చ్చిన ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ సీఎంగా క‌నిపిస్తున్న‌ట్లు ట్రైల‌ర్‌తోనే తెలిసిపోయింది. ఒక్క‌సారిగా ల‌వ‌ర్‌బాయ్ నుంచి పొలిటిషియ‌న్‌గా అవ‌తార‌మెత్తిన విజ‌య్‌దేవ‌ర‌కొండ ఏమేర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడో చూద్దాం..

క‌థేమిటంటే.. వాసుదేవ్‌( నాజ‌ర్‌) అవినీతిప‌రుడైన సీఎం. వ‌రుణ‌( విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ఆయ‌న కుమారుడు. కానీ తండ్రి లైఫ్‌ని విజ‌య్ అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డు. అయితే.. ఒక్క‌సారిగా రాత్రికి రాత్రే త‌న‌కుమారుడు విజ‌య్‌ని తాత్కాలిక సీఎంగా ప్ర‌క‌టిస్తాడు. ఇదంతా కూడా త‌న‌కు తెలియ‌కుండానే జ‌రిగిపోవ‌డంతో మొద‌ట విజ‌య్ అయిష్టంగానే ఉంటాడు. కానీ.. ఓ చిన్న ఇన్సిడెంట్‌తో త‌న మైండ్‌సెట్‌ను మార్చుకుంటాడు. ఆ త‌ర్వాత క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది.. వాసుదేవ్ విజ‌య్‌ని ఎందుకు సీఎంగా ప్ర‌క‌టించాడు.. తాత్కాలిక సీఎంగా ఉన్న విజ‌య్‌..చివ‌రిదాకా ఎలా కొనసాగారు.. పొలిటిక‌ల్ గేమ్‌ను ఆయ‌న ఎలా ఛేంజ్ చేశారు.. త‌న‌వైపు ఎలా తిప్పుకున్నారు.. ఈ క్ర‌మంలో ఎలాంటి ట్విస్ట్‌లు ఉన్నాయి.. అనే విష‌యాల్ని మాత్రం తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే..: రాజకీయ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలు తెలుగు ప్ర‌జ‌ల‌కు కొత్తేమీ కాదు. చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇందులో లీడ‌ర్‌, భ‌ర‌త్ అనే నేను.. త‌దిత‌ర చిత్రాలు వ‌చ్చాయి. అయితే ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ క‌థ కంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్‌నే ఎక్కువ‌గా న‌మ్ముకున్న‌ట్లు అనిపిస్తుంది. రోటీన్ పొలిటిక‌ల్ డ్రామానే అయినా.. న‌డిపించ‌డంలో కొత్త‌ద‌న‌మేమీ లేదు. ఇక సినిమా మొత్తానికి విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌ట‌నే బెట‌ర్ అని చెప్పొచ్చు. ఆయ‌న‌కు త‌గ్గ‌ట్టుగా క‌థ‌ను ఇంకా బ‌లంగా తీర్చిదిద్దుకుని ఉంటే బాగుండేది. ఎక్కువ‌గా ఊహ‌కందే స‌న్నివేశాలే ఉన్నాయి. ప‌లు స‌న్నివేశాల‌ను ఇంకా బ‌లంగా చూపించి ఉంటే ప్రేక్ష‌కుల‌ను మ‌రింత‌గా ఆకట్టుకునేలా ఉండేది. ఏదేమైనా.. విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌గానే.. ఆయ‌న ఇమేజ్‌ను, హీరోయిజాన్ని ద‌`ష్టిలో పెట్టుకుని వెళ్లే అభిమానులు మాత్రం కొంత నిరాశ‌కు గురవుతారు.

ఎవ‌రెలా చేశారంటే…: ఈ సినిమాకు బ‌లం విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆయ‌న త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. అయితే ఆ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు మ‌రింత బ‌లంగా తీర్చిదిద్ది ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. అయితే.. తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌ల అయిన ఈ సినిమాతో త‌మిళ సినీరంగంలో అరంగేట్రానికి విజ‌య్‌కి మంచి ప‌రిణామ‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఈ సినిమాలో ఎక్కువ‌సీన్లు త‌మిళ రాజ‌కీయాల‌ను గుర్తుకు తెస్తాయి. వీటిని తెలుగు ప్రేక్ష‌కులు మాత్రం ఇష్ట‌ప‌డ‌డం కొంత క‌ష్ట‌మే కావొచ్చు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదాకు ఈ సినిమాలో పెద్ద‌గా ప్రాధాన్యం లేద‌నే చెప్పాలి. ఇక నాజ‌ర్‌, స‌త్య‌రాజ్‌లు త‌మ పాత్ర‌ల‌కు జీవం పోశారు. ఇక సంగీత ద‌ర్శ‌కుడు సామ్ ప‌ర‌లాలేద‌ని అనిపించాడు. ఇక ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్‌, కెమెరా వ‌ర్క్ మాత్రం బెస్ట్‌గా నిలుస్తాయి.

చివ‌రిగా… అభిమానుల‌కు `నోటా` తూటానే..!

రేటింగ్ :2.5 / 5

‘నోటా’ మూవీ రివ్యూ& రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share