శివ‌బాలాజీ-రాజీవ్ క‌న‌కాల ‘ స్నేహ‌మేరా జీవితం ‘ రివ్యూ

స్నేహం, ప్రేమ – ఇవి రెండూ ఎవ‌ర్ గ్రీన్‌. వీటి గురించి ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్ష‌కుడు మ‌న‌స్సు క‌దిలించేలా తీస్తే ఎన్నిసార్లు ఎన్ని క‌థ‌ల‌తో సినిమాలు వ‌చ్చినా చూస్తారు. తాజాగా శివ‌బాలాజీ, రాజీవ్ క‌న‌కాల బెస్ట్ ఫ్రెండ్స్‌గా న‌టించిన సినిమా స్నేహ‌మేరా జీవితం. స్నేహం విలువ‌ల నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్రివ్యూ షోల ప్ర‌కారం చూస్తే….

స్టోరీ:

ఈ సినిమాలో మోహ‌న్ (శివ బాలాజీ), చ‌ల‌ప‌తి (రాజీవ్ క‌న‌కాల‌) ఇద్ద‌రూ ప్రాణ స్నేహితులు. అనాథ అయిన మోహ‌న్‌ను చ‌ల‌ప‌తి త‌న సొంత త‌మ్ముడిలా చూసుకుంటాడు. ఎమ్మెల్యే అవ్వాల‌ని క‌ల‌లు క‌నే చ‌ల‌ప‌తి అమ్మాయిల పిచ్చితో వాళ్ల‌తో తెగ తిరుగుతూ ఉంటాడు. మోహ‌న్ ఇందిర‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోన్న విష‌యం చ‌ల‌ప‌తికి తెలుస్తుంది. వాళ్లిద్ద‌రిని క‌లుపుతాన‌ని చ‌ల‌ప‌తి మోహ‌న్‌కు మాట ఇస్తాడు. అయితే మోహ‌న్ అనుకోనివిధంగా తాను ప్రేమిస్తోన్న ఇందిర‌ను చ‌ల‌ప‌తిని స‌న్నిహితంగా చూస్తాడు. త‌న‌ను ఇద్ద‌రూ క‌లిసి మోసం చేశార‌ని కుమిలిపోతాడు. ఇదిలా ఉంటే మోహ‌న్‌ను చంపేందుకు ఓ ముఠా ప్ర‌య‌త్నిస్తోంటోంది. ఇక చ‌ల‌ప‌తిని చంపేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. మ‌రి ఈ ప్రాణ స్నేహితులు ఇద్ద‌రూ ఎవ‌రికి టార్గెట్ అయ్యారు. వీరిని ఎవ‌రు చంపాల‌నుకుంటున్నారు. వీరు మ‌ళ్లీ కలిశారా ? లేదా ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:

స్నేహితులు విడిపోవ‌డం, వారి మ‌ధ్య అపార్థాలు రావ‌డం తిరిగి వారు క‌లుసుకోవ‌డం నేప‌థ్యంలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. అయితే అలాంటి క‌థ‌ల్లో ప్రేక్ష‌కుడు హృద‌యాన్ని ట‌చ్ చేస్తూ సాగేలా సీన్లు ఉండాలి. ఇలాంటి సీన్ల‌ను ద‌ర్శ‌కుడు ఒక్కటి కూడా ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు. బ‌ల‌మైన స‌న్నివేశం కాని, మ‌న‌స్సును హ‌త్తుకునే డైలాగులు కాని లేవు. షాక్ ఏంటంటే త‌న ప్రాణ స్నేహితుడు క‌నిపించ‌కుండా పోతే, త‌న ఎమ్మెల్యే ప్ర‌చారంలో బిజీ అయిపోతాడు చ‌ల‌ప‌తి. ఇదెక్క‌డి స్నేహం అనిపిస్తుంది. ఈ సినిమా 1982 నేప‌థ్యంలో సాగుతుంది. ద‌ర్శ‌కుడి క‌థ‌, క‌థ‌నాలు, ఆలోచ‌న‌లు అక్క‌డే ఆగిపోయాయ‌నిపిస్తుంది.

ఫైన‌ల్ పంచ్ :

స్నేహ‌మేరా జీవితం తుప్పుపట్టిన పాత సినిమా