‘తేజ్ ఐ లవ్ యు’ రివ్యూ రేటింగ్

July 6, 2018 at 1:34 pm

‘తేజ్ ఐ లవ్ యూ’ : రివ్యూ
నిర్మాణ సంస్థ‌: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ మూవీ మేక‌ర్స్‌
తారాగ‌ణం: సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు
సంగీతం: గోపీ సుంద‌ర్
ఛాయాగ్ర‌హ‌ణం: అండ్రూ.ఐ
మాట‌లు: డార్లింగ్ స్వామి
కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
క‌ళ‌: సాహి సురేశ్‌
స‌హ నిర్మాత‌: వ‌ల్ల‌భ‌
నిర్మాత‌: కె.ఎస్‌.రామారావు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎ.క‌రుణాక‌ర‌న్‌

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వులేని జీవితం సూపర్ హిట్ కావడంతో మనోడిపై భారీ అంచనాలే పెరిగాయి. ఆ తర్వాత సుబ్రమణ్యంఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలు మంచి విజయం అందుకోవడంతో మినిమం గ్యారెంటీ హీరో అనుకున్నారు దర్శక,నిర్మాతలు. కానీ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫెయిల్ కావడంతో సాయిధరమ్ తేజ్ కెరీర్ ఆలోచనలో పడింది. ప్రస్తుతం కరుణాకరణ్ దర్శకత్వంలో ‘తేజ్ ఐ ల‌వ్ యూ’ సినిమాలో నటించాడు సాయిధరమ్. ఈ సినిమాతో తేజ్ భవిత్యం తేలనుంది.

కథ :
సినిమా జైలు సన్నివేశం నుంచి మొదలైంది. తేజ్ (సాయిధ‌ర‌మ్‌తేజ్‌) ప‌ద్ధ‌తిగ‌ల కుటుంబానికి చెందిన అబ్బాయి. ఓ స‌మ‌స్య కార‌ణంగా అత‌న్ని, అత‌ని పెద‌నాన్న(జ‌య‌ప్ర‌కాష్‌) కుటుంబం నుంచి వెలివేస్తాడు. దాంతో కాలేజీ అయిపోయాక స‌ప్లీలు రాసుకుంటూ హైద‌రాబాద్‌లోని బాబాయ్ (పృథ్వి) ఇంట్లో ఉంటాడు. కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి ఓ ట్రూప్ మెయింటేన్ చేస్తుంటాడు. రైళ్లో పరిచయం అయిన నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. అనుకోకుండా జ‌రిగిన అగ్రిమెంట్ కార‌ణంగా 15 రోజులు ఆమెకు అత‌ను బాయ్ ఫ్రెండ్‌గా న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. ఇలా ఒక‌రికి ఒక‌రు చేరువ‌య్యే క్ర‌మంలో నందినికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ కి కార‌ణం ఎవ‌రు? న‌ందినిని ఫాలో చేస్తున్న వారు ఎవ‌రు? ఆమెకు ఎవ‌రి వ‌ల్ల ప్ర‌మాదం. నందిని అస‌లు ఇండియాకు ఎందుకు వ‌చ్చింది? ఆమె తండ్రి ఆమెకు మంచి చేశాడా? చెడు చేశాడా? తేజ్ తన ప్రేమను దక్కించుకుంటాడా? అన్నదే కథా సారాంశం.

విశ్లేష‌ణ‌ :
క‌రుణాక‌ర‌న్ ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నార‌న‌గానే త‌ప్ప‌కుండా ఎంతో కొంత తేజ్‌కి క్రేజ్ ఉంటుందని భావించారు. అయితే హీరో, హీరోయిన్ల మ‌ధ్య ఏదో డీల్ కుద‌ర‌డం, అది న‌చ్చ‌క‌పోయినా, లోప‌ల ఎక్క‌డో న‌చ్చుతున్నా.. పైకి న‌చ్చ‌న‌ట్టు క‌నిపిస్తూ..సినిమా సరదా సరదాగా సాగిపోయింది. ఇక సినిమాలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. రోటీన్ స్టోరీలాగే.. ప్రేయ‌సి మీద గుండెల నిండా ప్రేమ ఉన్నా, అది ఆమెకు ఎక్క‌డో న‌చ్చ‌దో అనే ఏకైక కార‌ణంగా, ఆమెను ఇబ్బందిపెట్ట‌డం ఇష్టంలేకుండా ప్ర‌వ‌ర్తించే హీరోలు మ‌న‌కు కొత్త‌కాదు. అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం నడిచిన సినిమా తర్వాత ఎలాంటి పరిణామానికి దారి తీస్తుందనే సినిమా కథ.

నటీ నటులు : పిల్లా నువ్వు లేని జీవితం` సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. `తిక్క` సినిమా నుండి `ఇంటెలిజెంట్` సినిమా వ‌ర‌కు ఐదు వ‌రుస ప‌రాజ‌యాల‌ను చ‌విచూశాడు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వన్ నటన బాగానే ఉన్నా కథ రోటీన్ గా ఉండటం ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రెస్ట్ కలగలేదు. కామెడీ పరంగా బాగానే ఉంది. గోపీసుంద‌ర్ స్వ‌ర‌ప‌రిచిన పాట‌లు కూడా మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా లేవు. స్టార్టింగ్ సాంగ్‌లో `స్నేహితుడు`లోని `మ‌న ఫ్రెండ‌ల్లే..` పాట‌లోని ట్యూను వినిపిస్తుంది. నుప‌మ త‌న పాత్ర‌లో బాగానే న‌టించింది. తేజ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ పాత్ర‌ల్లో న‌టించిన‌వారంద‌రూ బాగా చేశారు. వైవా హ‌ర్ష‌కు కొన్నాళ్ల గ్యాప్ త‌ర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ ప‌డింది. అనీష్ కురువిల్ల ష‌రా మామూలు పాత్ర‌లో క‌నిపించారు. క‌థ‌లో ట్విస్టులు లేక‌పోవ‌డం, ఎంపిక చేసుకున్న స‌మ‌స్య‌ను కూడా లోతుగా చూపించ‌క‌పోవ‌డం వంటివాటివ‌ల్ల సినిమా అనాసక్తిగా, నిదానంగా సాగిన‌ట్టు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్: సాయిధరమ్, మ్యూజిక్
మైనస్ పాయింట్ : బోరింగ్ కథ, ఆసక్తి లేని కామెడి

బాటమ్ లైన్ : తేజ్ ఐ లవ్ యూ షరా మామూలుగానే ఉంది

రేటింగ్ : 2.0/5

‘తేజ్ ఐ లవ్ యు’ రివ్యూ రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share