‘విజేత’ TJ రివ్యూ

July 12, 2018 at 1:33 pm
Vijetha, review, Rating, Kalyaan Dhev, Malavika Nair

నిర్మాణ సంస్థ‌: వారాహి చ‌ల‌న చిత్రం
తారాగ‌ణం: క‌ల్యాణ్‌దేవ్‌, మాళ‌వికా నాయ‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నాజ‌ర్‌, ప్ర‌గ‌తి, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు
సంగీతం: హ‌ర్ష‌వ‌ర్ధ‌న రామేశ్వ‌ర్‌
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
క‌ళ‌: రామ‌కృష్ణ‌
చాయాగ్ర‌హ‌ణం: కె.కె.సెంథిల్ కుమార్‌
నిర్మాత‌: ర‌జ‌నీ కొర్ర‌పాటి, సాయికొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్స్‌
క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: రాకేశ్ శ‌శి

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కళ్యాన్ దేవ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు..శ్రీజ భర్త అయిన కళ్యాన్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన మామయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన టైటిల్ ‘విజేత’సినిమాతోనే ఈ రోజు థియేటర్లలో సందడి చేశాడు. `విజేత‌`. పాత చిరంజీవి టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా తండ్రి కొడుకుల‌ అనుబంధాన్ని తెలియ‌జేసేదిగా ఉంది. రాకేష్ చెప్పిన కథ నచ్చటంతో కల్యాణ్‌ ఎంట్రీకి ఇదే సరసన సినిమా అన్ని ఫిక్స్‌ అయిన మెగా ఫ్యామిలీ ఓకె చెప్పింది. మరి ఈ రెండు రెండు సినిమాలు ఆర్ ఎక్స్ 100, విజేత ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.

కథ :
రామ్‌ (కల్యాణ్‌ దేవ్‌) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటాడు. రామ్‌ తండ్రి శ్రీనివాసరావు (మురళీ శర్మ) స్టిల్‌ ఫ్యాక్టరీ లో పనిచేసే మధ్యతరగతి ఇంటిపెద్ద. కుటుంబ బాధ్యతల కోసం తనకు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని పక్కన పెట్టి చిరు ఉద్యోగిగా మిగిలిపోతాడు. రామ్ ఎదురింట్లో జైత్ర‌(మాళ‌వికా నాయ‌ర్‌) అద్దెకు వ‌స్తారు. జైత్రను రామ్ ఇంప్రెస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేసిన రామ్‌కి..ప్రారంభంలో త‌ప్పులు జ‌రిగి చెడ్డ పేరు వ‌స్తుంది. అదే స‌మ‌యంలో శ్రీనివాస‌రావుకి గుండెపోటు వ‌స్తుంది. శ్రీనివాస‌రావు త‌ను లేక‌పోతే త‌న కుటుంబం ఏమైపోతుందోన‌ని బాధ‌ప‌డుతుంటాడు. అది చూసిన శ్రీనివాస‌రావు స్నేహితుడు(త‌నికెళ్ల‌భ‌ర‌ణి).. రామ్‌కి శ్రీనివాస‌రావు గురించి నిజం చెప్పి.. కుటుంబానికి తోడుగా నిల‌బ‌డ‌మ‌ని అంటాడు. మరి అనుకున్నట్టుగా రామ్‌ విజయం సాధించాడా..? తన కోసం ఇష్టా ఇష్టాలను కోరికలను త్యాగం చేసిన తండ్రి కోసం రామ్‌ ఏం చేశాడు..? అన్నదే సినిమా కథ..

విశ్లేష‌ణ‌:
మెగా ఫ్యామిలీ హీరోను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న దర్శకుడు రాకేష్‌ శశి ఆ పనిని సమర్ధవం‍తంగా పూర్తి చేశాడు. కల్యాణ్ పై ఉన్న అంచనాలకు తగ్గ కథా కథనాలు ఆకట్టుకున్నాడు. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. రాకేష్‌ తనదైన టేకింగ్‌ తో మెప్పించాడు. తొలి భాగం హీరో ఫ్రెండ్స్‌ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో పాటు లవ్‌ స్టోరితో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా ఎమోషనల్‌ డ్రామాగా మలిచాడు. త‌న‌దైన న‌ట‌న‌తో, అనుభ‌వంతో పాత్ర‌కు ప‌రిపూర్ణ‌త తెచ్చాడు. ఇక జ‌య‌ప్ర‌కాశ్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, మాళ‌వికా నాయర్‌, ప్ర‌గ‌తి ఇత‌రుల న‌ట‌న వారి వారి ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. మాళ‌వికా నాయ‌ర్ పేరుకు హీరోయిన్ కానీ… ఆ పాత్ర‌లో న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. హీరో, అత‌ని ఫ్రెండ్స్ మ‌ధ్య వచ్చే కామెడీ కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా లేదు. ఇక సెకండాఫ్ అంతా హీరో బాధ్య‌త‌గా మెల‌గ‌డం.. తండ్రి కల‌ను తీర్చ‌డానికి కొడుకుగా త‌న వంతు బాధ్య‌త‌ను నేర‌వేర్చ‌డం వాటి సంద‌ర్భానుసారం వ‌చ్చే స‌న్నివేశాలు బావున్నాయి. సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డా బావున్నాయి. సెంథిల్ కెమెరా ప‌నిత‌నం గురించి మ‌నం కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హ‌ర్ష‌వర్ధ‌న్ రామేశ్వ‌ర్ అందించిన ట్యూన్స్ ఓకే. నేప‌థ్య సంగీతం బాగానే ఉంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటులు :
సినీ బ్యాగ్ గ్రౌండ్ నుంచి వచ్చినా..కళ్యాన్ దేవ్ ఈ సినిమాకు కొత్తే. తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్‌ డ్రామాను ఎంచుకున్న కల్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక నాయర్‌ ఆకట్టుకుంది. పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ లేకపోయినా.. ఉన్నంతలో హుందాగా కనిపించి ఆకట్టుకుంది. శ‌్రీనివాస‌రావు(ముర‌ళీశ‌ర్మ) స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా మద్యతరగతి తండ్రిగా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. కొడుకు కోసం ఏదైన చేసేయాలనుకునే మధ్య తరగతి తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన చాలా సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది.హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్‌, నోయల్‌, కిరిటీ, మహేష్‌లు ఫస్ట్‌ హాఫ్‌లో బాగానే నవ్వించారు. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, జయ ప్రకాష్‌, రాజీవ్‌ కనకాల తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్‌ పాయింట్స్‌ : తండ్రి కొడుకుల మద్య ఎమోషనల్‌ సీన్స్‌,క్లైమాక్స్‌,కెమెరా వ‌ర్క్‌
మైన‌స్ పాయింట్స్‌: ఫస్టాఫ్ నేరేషన్, కామెడీ

బాటం లైన్ : ‘విజేత’గా బాగా కష్టపడ్డాడు
రేటింగ్ : 2.5/5

‘విజేత’ TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share