ఎన్టీఆర్ నా హీరో అంటున్న రితిక సింగ్

రితిక సింగ్ ఇప్పుడు ఈ పేరుకి ఇప్పుడు టాలివుడ్ లో మంచి క్రేజ్ వుంది. మొన్న వచ్చిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ ముంబై బాక్సర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. గురు సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరోయిన్ కోసం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నారు.

సినిమా చూసి బయటికొచ్చిన ప్రతి ప్రేక్షకుడు రితిక సింగ్ నటన గురించే మాట్లాడేంతగా తన పాత్రలో జీవించింది రితిక. అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ ఒక ఇంటర్వ్యూ లో టాలీవుడ్ లో ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని వుంది అని చెప్పింది ఈ క్రేజీ హీరోయిన్. చూదాం ఈ యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ కి మన యంగ్ టైగర్ తో సినిమా చేసే అవకాశం ఏ డైరెక్టర్ కల్పిస్తాడో..