టీ కాంగ్రెస్‌కు అదిరిపోయే షాక్…టీఆర్ఎస్‌లోకి సీనియ‌ర్ ఎమ్మెల్యే..!

తెలంగాణ‌లో గ‌త రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఇంకా బ్రేకులు ప‌డిన‌ట్లు లేదు. ఇప్ప‌టికే టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీ, సీపీఐ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు మ‌రో కీల‌క వికెట్‌పై క‌న్నేశారు. ఇప్ప‌టికే అక్క‌డ ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించేందుకు కూడా అష్ట‌క‌ష్టాలు ప‌డుతోన్న కాంగ్రెస్‌కు ఈ వికెట్ కూడా ప‌డిపోతే మ‌రింత డౌన్ అవ్వ‌క‌త‌ప్ప‌దు.

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క గులాబీ పార్టీలోకి జంప్ చేసేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుసగా కాంగ్రెస్ త‌ర‌పున గెలుస్తోన్న భ‌ట్టి కొద్ది రోజులుగా టీ పీసీసీలో తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నాడు. తెలంగాణ‌లో త‌న‌లాంటి సీనియ‌ర్లు ఎంతోమంది ఉన్నా కేవ‌లం రెడ్డి సామాజిక వ‌ర్గం ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఆధిప‌త్యం చెలాయిస్తుండ‌డంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ర‌గిలి పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కాంగ్రెస్‌లో ఇమ‌డ‌లేక‌పోతున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న కేసీఆర్ భ‌ట్టికి ఆఫ‌ర్ పంపిన‌ట్టు స‌మాచారం. ఖ‌మ్మం జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు కొద్ది రోజులుగా టీఆర్ఎస్ అధిష్టానంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వీరు భ‌ట్టిపై వ‌ల‌వేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఇటీవ‌ల కేసీఆర్ నిర్వ‌హించిన స‌ర్వేల్లో భ‌ట్టి రెండుసార్లు మ‌ళ్లీ గెలుస్తాడ‌ని తేలింది. కేసీఆర్ స‌ర్వేలోనే ఆయ‌న‌కు మంచి మార్కులు వ‌చ్చాయి. అందుకోసమే భట్టి విక్రమార్క కోసం గులాబీ పార్టీ గాలం వేసినట్లు చెబుతున్నారు. అటు టీఆర్ఎస్‌తో పాటు తుమ్మ‌ల నుంచి పార్టీ మారాల‌న్న ఒత్తిడి ఉండ‌డం మ‌రో వైపు పార్టీలో త‌న‌కు ప్ర‌యారిటీ లేక‌పోవ‌డంతో భ‌ట్టి త్వ‌ర‌లోనే మంచి ముహూర్తం చూసుకుని టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేస్తార‌ని టాక్‌. అదే జ‌రిగితే టీ కాంగ్రెస్‌కు అదిరిపోయే షాక్ అన‌క త‌ప్ప‌దు